ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా..సింగర్‌ సునీత ఎమోషనల్‌ పోస్ట్‌ | Singer Sunitha Shares Emotional Post About Sp Balasubrahmanyam | Sakshi
Sakshi News home page

Singer Sunitha:ఎస్పీబీని తలుచుకొని సునీత భావోద్వేగం

Published Sun, Sep 5 2021 10:14 AM | Last Updated on Sun, Sep 5 2021 2:51 PM

Singer Sunitha Shares Emotional Post About Sp Balasubrahmanyam - Sakshi

Singer Sunitha Emotional:  గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని వీడి దాదాపు ఏడాది కావస్తోంది. సింగర్‌గా, నటుడిగా, మూజిక్‌ డైరెక్టర్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఆయన గతేడాది 2020 సెప్టెంబర్‌25న కన్నుమూసిన సంగతి తెలిసిందే. భౌతికంగా ఆయన దూరమైనా సంగీత సరిగమల్లో చిరంజీవిలా ఎప్పటికీ నిలిచిపోతారు బాలు. ఆయన దూరమై ఏడాది కావస్తుండటంతో సింగర్‌ సునీత ఎస్పీబీని తలుచుకొని ఎమోషనల్‌ అయ్యారు.

చదవండి : హీరోయిన్‌ త్రిషను అరెస్ట్‌ చేయాలి..హిందూ సంఘాల ఫిర్యాదు

'మావయ్యా .. ఒక్కసారి గతంలోకి నడవాలనుంది. నీ పాట వినాలనుంది. నువ్ పాడుతుంటే మళ్ళీ మళ్ళీ చెమర్చిన కళ్ళతో చప్పట్లు కొట్టాలనుంది. ఇప్పుడు ఏంచెయ్యాలో తెలీని సందిగ్ధంలో నా గొంతు మూగబోతోంది.సంవత్సరం కావొస్తోందంటే నమ్మటం కష్టంగా వుంది. ఎప్పటికీ నువ్వే నా గురువు, ప్రేరణ, ధైర్యం,బలం,నమ్మకం.

ఎక్కడున్నా మమ్మల్నందర్నీ అంతే ఆప్యాయతతో చుస్కుంటున్నావన్న నమ్మకముంది. ఆ నమ్మకంతోనే నేను కూడా ..బతికేస్తున్నా'.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. కాగా ఎస్పీబీతో కలిసి సునీత పలు స్టేజ్‌ షోలలో పాలు పంచుకున్న సంగతి తెలిసిందే.

చదవండి : 'ఆ హీరో ఫిజిక్‌ ది బెస్ట్‌..రష్మికను బలవంతంగా గెంటేస్తా'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement