
Singer Sunitha Latest Interview About Sp Balu And Her Personal Life: టాలీవుడ్ సింగర్ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన మధుర గాత్రంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సునీతకు టాలీవుడ్‌లో ఏ సింగర్‌కు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవలె రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సునీత అటు పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తిర విషయాలను పంచుకుంది.
పెళ్లి తర్వాత మ్యారెజ్ లైఫ్ ఎలా ఉంది అని అడగ్గా.. పెళ్లి తర్వాత నేను ఎలా ఉన్నాను అన్నది మా ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. నా జీవితం నాకు నచ్చినట్లుగా గౌరవంగా బతకాలనుకున్నాను. అలాగే బతుకుతున్నాను. నా జీవితంపై క్లారిటీ ఉంది. ఇక ఇద్దరం ఇంచుమించు ఒకే రంగంలో ఉన్నాం. భార్యగా తనకు ఎప్పుడైనా సాయం కావాలంటే చేస్తా. ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తా అని పేర్కొంది.
ఇక ఈ ఏడాది జరిగిన విషాదాలపై స్పందిస్తూ..2021లో ఎంతోమందిని పోగొట్టుకున్నాను. ముఖ్యంగా బాలు గారిని పోగొట్టుకున్నా. ఆ విషాదం తర్వాత కన్నీళ్లు రావడం ఆగిపోయాయి. ఏదైనా జరిగినా మహా అయితే బ్లాంక్ అయినట్లు అనిపిస్తుంది కానీ అంతలా నన్నేమీ కదిలించడం లేదు. ఆయన లేని లోటు తీర్చలేనిది అంటూ ఎమోషనల్ అయ్యారు.