memorial hall
-
ఏడాదిలోగా ఎస్పీబీ స్మారక మందిరం: ఎస్పీ చరణ్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతిని శనివారం ఆయన కుటుంబ సభ్యులు నిరాడంబరంగా నిర్వహించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలో గల వ్యవసాయ క్షేత్రంలో ఎస్పీబీ సమాధికి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ– ‘‘నాన్న లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఎస్పీబీ స్మారక మందిరం నిర్మాణ పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తాం. ఎస్పీబీ పేరిట ప్రత్యేకంగా మ్యూజియమ్ థియేటర్‌ను కూడా నిర్మించాలని భావిస్తున్నాం. ఇందు కోసం ప్రభుత్వ సాయాన్ని కూడా కోరతాం’’ అన్నారు. -
అమ్మ స్మారకం జాప్యం.. సీఎం అసంతృప్తి
సాక్షి, చెన్నై: మెరీనా తీరంలో చేపట్టిన దివంగత సీఎం జయలలిత స్మారక మందిరం నిర్మాణ పనుల్లో జాప్యం జరగడంపై సీఎం పళనిస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబరులోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెన్నై మెరీనా తీరంలో ఎంజియార్ సమాధికి కూతవేటు దూరంలో అమ్మ జయలలిత సమాధి ఉంది. ఇక్కడికి ప్రతి రోజూ సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మ సమాధిని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాంతాన్ని అత్యాధునిక హంగులతో స్మారక మందిరంగా తీర్చిదిద్దాలని సీఎం నిర్ణయించారు. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతోపాటు కోస్టల్ అనుమతులు అంటూ వివాదం రేగింది. దీంతో పనులకు ఆటంకాలు తప్పలేదు. రాష్ట్రంలో ఉన్నది తమ ప్రభుత్వమే కావడంతో పనుల్ని ముందుకు తీసుకెళ్లేందుకు అన్నాడీఎంకే నాయకులు సిద్ధం అయ్యారు. ఆ మేరకు 2018 మేలో పనులకు శ్రీకారం చుట్టారు. 2019 ఫిబ్రవరిలో జయలలిత తొలి జయంతి సందర్భంగా దీనిని ప్రారంభించాలని తొలుత సంకల్పించినా, ఆటంకాల రూపంలో పనుల్లో జాప్యం తప్పడం లేదు. (రాజుకుంటున్న ఎన్నికల వేడి) సెప్టెంబరు వరకు గడువు.... గత ఏడాది చివర్లో ముగించి, ఈ ఏడాది రెండో జయంతి సందర్భంగా ప్రారంభిద్దామనుకున్నా ఆటంకాలు తప్పలేదు. సమాధి పరిసరాలను సుందరంగా, అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దడం, జయలలిత జీవితం, సినిమా, రాజకీయ ఘనతను చాటేలా ఫొటో, వీడియో ప్రదర్శనను ఆ స్మారక మందిరంలో ఏర్పాటు చేస్తూ నిర్మాణాలు చేపట్టారు. ఆ పరిసరాల్ని ముస్తాబు చేసి నిర్మాణాలకు మెరుగులు దిద్దాల్సి ఉంది. ఫినిక్స్ పక్షి ఆకారంతో సమాధి స్మారకం నిర్మాణంతో అస్సలు సమస్య నెలకొని ఉంది. 15 మీటర్ల ఎత్తుతో, రెండు వైపులా ఆ పక్షి రెక్కలు 21 మీటర్ల ఉండేలా నిర్మాణం సాగుతోంది. ఐఐటీ మద్రాసు, అన్నా వర్సిటీ సాంకేతిక విభాగం సహకారంతో దుబాయ్ నుంచి తీసుకొచ్చిన పరికరాలతో ఈ ఫినిక్స్ పక్షి నిర్మాణాన్ని రూపొందిస్తున్నారు. పలు కారణాల వల్ల ఆగస్టు మొదటి వారానికి దీన్ని ప్రభుత్వానికి అప్పగించలేని పరిస్థితి. సెప్టెంబరు చివరి వరకు గడువు ఇవ్వాలని అధికారులు సీఎం పళనిస్వామి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా జాప్యం, కరోనా తదితర సమస్యల వల్ల నిర్మాణ పనుల వ్యయం మరో పది కోట్లకు పెరిగినట్టు సమాచారం. వీటిని పరిశీలించిన సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. సెప్టెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబరులో జయలలిత వర్ధంతి సందర్భంగా ఈ స్మారకం ప్రారంభం లక్ష్యంగా ప్రభుత్వం ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆగమేఘాల మీద పనులు సాగించేందుకు ప్రజా పనుల శాఖ వర్గాలు ఉరకలు తీస్తున్నాయి. మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు రానున్న నేపథ్యంలో అమ్మ స్మారకం అన్నాడీఎంకే వర్గాలకే కాకుండా ప్రజలందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలవాలన్న కాంక్షతో సీఎం ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే పోయెస్ గార్డెన్ వేదా నిలయంకు కొత్త మెరుగులకు తగ్గ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. -
చరిత్రలో నిలిచిపోయేలా 'అమ్మ' స్మారకం
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారకమండప నిర్మాణ పనులను ఈ ఏడాది జూలై నెలాఖరులోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఆదేశించారు. ఈ నిర్మాణం చరిత్రలో నిలిచిపోయేలా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2016 డిసెంబర్ 5వ తేదీన అనారోగ్యంతో కన్నుమూశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించిన చెన్నై మెరీనాబీచ్ ఒడ్డున అందమైన సమాధి నిర్మాణం జరిగింది. ఆ తరువాత ఎంజీఆర్ సమాధి పేరొందిన పర్యాటక క్షేత్రంగా మారింది. ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత అన్నాడీఎంకేకు విజయవంతంగా సారధ్యం వహించిన జయలలిత పార్దివదేహాన్ని సైతం చెన్నై మెరీనాబీచ్ ఒడ్డున ఎంజీఆర్ సమాధి పక్కనే ఖననం చేశారు. ఆ ప్రదేశంలో స్మారక మండపాన్ని నిర్మించనున్నట్లు ఎడపాడి ప్రభుత్వం నాడే ప్రకటించింది. చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే నిర్మాణంలో అమ్మ స్మారక మండపం సముద్ర తీరాల్లో సమాధుల నిర్మాణంపై పర్యావరణ నిషేధం ఉన్నట్లు కొందరు వివాదాలు లేవనెత్తినా వాటిని అధగమించి రూ.5.08 కోట్ల అంచనాతో పనులు కొనసాగుతున్నాయి. జయ సమాధి డిజైన్‌ను చెన్నై ఐఐటీ రూపకల్పన చేయగా మధ్యప్రదేశాన్ని కాంక్రీట్‌తో పినిక్స్ పక్షి ఆకారంలో తీర్చిదిద్దుతున్నారు. అత్యంత క్లిష్టమైన నిర్మాణం కావడంతో ప్రజాపనులశాఖ అధికారులు పదేపదే పర్యవేక్షణ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిర్మాణంలో కొంత జాప్యం కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాణానికి అవసరమైన వస్తువులను దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. లాక్డౌన్ రోజుల్లో సైతం ప్రత్యేక అనుమతి పొంది నిరవధికంగా పనులను సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా స్మారకమండప నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులను ముఖ్యమంత్రి ఎడపాడి రెండు రోజుల క్రితం తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. పనులు ఎంతవరకు వచ్చాయో వాకబు చేశారు. పనుల ప్రగతిని ఫొటోల ద్వారా సీఎంకు చూపించారు. చారిత్రాత్మక నిర్మాణంగా చరిత్రలో నిలవబోతున్న జయ స్మారక మండపం విషయంలో అత్యంత శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశించారు. హడావిడికి తావివ్వకుండా నాణ్యత పాటించాలని సూచించారు. ఈ ఏడాది జూలై మాసాంతానికి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. చదవండి: టీవీ సీరియళ్లకు ప్రభుత్వం అనుమతి -
పోలీస్ అమరవీరులకు మోదీ నివాళి
-
పోలీస్ అమరవీరులకు మోదీ నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పునరుద్ధరించిన నేషనల్ పోలీస్ మెమోరియల్‌ను జాతికి అంకితం చేశారు. విధినిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు. 1959లో లడఖ్ ప్రాంతంలో చైనా దళాలు పదిమంది పోలీసులను పొట్టనబెట్టుకున్న క్రమంలో అక్టోబర్ 21న జాతీయ పోలీసు దినోత్సవంగా జరుపుతున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని దేశానికి స్వాతంత్యం లభించినప్పటి నుంచి పోలీసుల త్యాగాలను కొనియాడారు. పోలీస్ మెమోరియల్‌ను ప్రారంభించే ముందు ప్రధాని మోదీ, ఇతర నేతాలు పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో పోలీస్ మెమోరియల్‌ను ఏర్పాటు చేశారు. -
కన్నడ రాజ్‌కుమార్ స్మారక మందిరం
కన్నడ తెరపై సూపర్‌స్టార్ అంటే ఇప్పటికీ రాజ్‌కుమారే. తన అభినయంతో కన్నడ సినిమాను ఓ మలుపు తిప్పారాయన. ఆయన దివికేగి 8 ఏళ్లయినా, ప్రజల జ్ఞాపకాల్లో చిరంజీవిగానే ఉన్నారు. ఆయన స్మారకంగా ఓ బృహత్తర ప్రయత్నం జరిగింది. బెంగళూరులోని కంఠీరవ స్టూడియో ప్రాంగణంలో ఏడు కోట్ల రూపాయల వ్యయంతో భారీ ఎత్తున రాజ్‌కుమార్ స్మారక మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరంలో మూడడుగుల రాజ్‌కుమార్ కాంస్య విగ్రహంతో పాటు, 800 సీట్లు గల ఓపెన్ ఆడిటోరియం, ఓ సరస్సు, గార్డెన్ ఏర్పాటు చేశారు. రాజ్‌కుమార్ కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో నవంబర్ 29న అంగరంగ వైభవంగా ఆవిష్కరణ వేడుక జరుగనుంది. లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, కమల్‌హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్, బి. సరోజాదేవి తదితరులు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు.