కన్నడ రాజ్‌కుమార్ స్మారక మందిరం
కన్నడ తెరపై సూపర్‌స్టార్ అంటే ఇప్పటికీ రాజ్‌కుమారే. తన అభినయంతో కన్నడ సినిమాను ఓ మలుపు తిప్పారాయన. ఆయన దివికేగి 8 ఏళ్లయినా, ప్రజల జ్ఞాపకాల్లో చిరంజీవిగానే ఉన్నారు. ఆయన స్మారకంగా ఓ బృహత్తర ప్రయత్నం జరిగింది. బెంగళూరులోని కంఠీరవ స్టూడియో ప్రాంగణంలో ఏడు కోట్ల రూపాయల వ్యయంతో భారీ ఎత్తున రాజ్‌కుమార్ స్మారక మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరంలో మూడడుగుల రాజ్‌కుమార్ కాంస్య విగ్రహంతో పాటు, 800 సీట్లు గల ఓపెన్ ఆడిటోరియం, ఓ సరస్సు, గార్డెన్ ఏర్పాటు చేశారు. రాజ్‌కుమార్ కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో నవంబర్ 29న అంగరంగ వైభవంగా ఆవిష్కరణ వేడుక జరుగనుంది. లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, కమల్‌హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్, బి. సరోజాదేవి తదితరులు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు.