చెన్నై : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం రోజురోజుకు మరింత మెరుగవుతుందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో స్పందించిన ఆయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత నిలకడగా ఉందన్నారు. ‘నాన్న ఊపిరితిత్తులు మెరుగుపడుతున్నట్లు ఎక్క్‌రేలో కనిపిస్తుందన్నారు. ఫిజియోథెరపీలో చురుకుగా పాల్గొంటున్నాడు. 20 నిమిషాల పాటు కూర్చోగలుగుతున్నాడు. త్వరలోనే ద్రవ పదార్థాలు అందించవచ్చని వైద్యులు చెప్పారు’ అని పేర్కొన్నారు. (బాలుకి కరోనా నెగిటివ్.. కాబాలుకి కరోనా నెగిటివ్.. కానీ)
ఇప్పటి వరకు తమకు తోడుగా, అండగా ఉన్నవారందరికీ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కష్ట సమయాల్లో తమ కుటుంబ పట్ల మీరు చూపించిన ప్రేమ, అనురాగాలకు ధన్యవాదాలు. ఇలాగే ప్రతి ఒక్కరూ ఎస్పీ బాలు ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరారు. కాగా ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా వ్యాధి సోకడంతో ఆగస్టు 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్‌గా తేలిన ఎస్పీ బాలు అప్పటి నుంచి హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు. ఇటీవల కరోనా నెగిటివ్ అని తేలడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. (చికిత్సకు స్పందిస్తున్న ఎస్పీ బాలు)
Comments
Please login to add a commentAdd a comment