![SP Balasubrahmanyam Responding To Treatment Son Says A Good Day - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/25/sp-balu.gif.webp?itok=QEnALQwG)
సాక్షి, చెన్నై: కరోనా బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. తన తండ్రి చికిత్సకు స్పందిస్తున్నారని.. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు వెల్లడించారు. ఇన్నాళ్లుగా తమ కుటుంబ క్షేమం కోసం ప్రార్థనలు చేసిన ప్రతీ ఒక్కరికి, బాలుకు ట్రీట్‌మెంట్ చేస్తున్న ఎంజీఎం వైద్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇదొక శుభ దినమని, త్వరలోనే బాలు అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎస్పీ చరణ్ ఓ వీడియో విడుదల చేశారు. (చదవండి: బాలుకి కరోనా.. నేను కారణం కాదు: గాయని)
ఇక అనేక భాషల్లో పాటలు పాడిన తన తండ్రికి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న చరణ్.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్న ప్రతీ ఒక్కరికి అర్థమవడం కోసమే తాను ఆంగ్లంలో మాట్లాడుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా ఈ నెల 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని రోజుల క్రితం ఆయనను చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. (చదవండి: నా ఆయుష్షు కూడా ఇచ్చి కాపాడాలి: నటి)
Comments
Please login to add a commentAdd a comment