సాక్షి, చెన్నై : సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ తీవ్రంగా ఖండించారు. కట్టుకథలు అల్లి, అనవసర ప్రచారం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎస్పీ చరణ్ సోమవారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రి యాజమాన్యంతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ నాన్నగారు ఆస్పత్రిలో చేరిన తర్వాత ప్రతి వారం బిల్స్ చెల్లిస్తూనే ఉన్నాం. చివరిగా నాన్న చనిపోయిన తర్వాత కూడా బిల్స్ గురించి అడిగితే.. ముందు భౌతికకాయాన్ని తీసుకెళ్లమని చెప్పి మాకు గౌరవం ఇచ్చారు. (ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వండి: సీఎం జగన్)
మూడు కోట్లు ఖర్చు అయింది. వైస్ ప్రెసిడెంట్ సహకరించారు అంటూ కట్టుకథలు అల్లుతున్నారు. కోటి 85 లక్షలు కట్టాలి అని ఎందుకు సోషల్ మీడియాలో అనవసర ప్రచారం చేస్తున్నారు. కట్టుకథలతో మాకు ఎంజీఎం ఆస్పత్రి యాజమాన్యంతో ఉన్న రిలేషన్ చెడగొట్టవద్దు. మేము ఇంకా బాధలోనే ఉన్నాం. నాన్నగారి స్మారక స్థూపం నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ నాన్నగారి సమాధి సందర్శనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. నాన్నగారే మాకు పెద్ద భారత రత్న.. ఒకవేళ ఇస్తే స్వాగతిస్తాం’ అని అన్నారు. (ఎస్పీ బాలు స్మారకమందిరం అక్కడే: చరణ్)
Comments
Please login to add a commentAdd a comment