
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం భారతీయ సినిమాలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. గానగంధర్వుడుగా ఖ్యాతి గాంచిన ఈయనలో మంచి నటుడు, నిర్మాత కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో కమలహాసన్ హీరోగా శుభసంకల్పం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని నిర్మించారు. కాగా తాజాగా ఎస్‌పీ బాలు వెబ్ ప్రపంచంలోకి తన నిర్మాణాన్ని విస్తరించారు. దీనిలో భాగంగా ‘అధికారం’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే తండ్రి బాటలోనే తనయుడు ఎస్పీ చరణ్ నడస్తున్నాడు. ఇప్పటికే గాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చరణ్ తండ్రికి తగ్గట్టు నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నాడు. అరణ్యకాండం, నాణయం, చెన్నై 28, తిరుడన్ పోలీస్ వంటి చిత్రాలు అతడి నిర్మాణంలోనే రూపొందాయి.
క్యాపిటల్ ఫిలిం వర్క్స్ పతాకంపై ఎస్‌పీబీ నిర్మిస్తున్న ఈ అధికారం వెబ్ సిరీస్‌ను మంగళవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దీనికి ఎస్పీ బాలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వెబ్ సీరీస్ గురించి చిత్ర బృందం తెలుపుతూ ప్రేమ, అధికారం ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయన్నారు. ఇలాంటి అంశాలతో రాజకీయాలను జోడించి రూపొందిస్తున్న సీరీస్ అధికారం అని తెలిపారు. ఇందులో అధికారంలో ఉన్న వారు దాన్ని నిలబెట్టుకోవడానికి చేస్తుంటే, వారిని అణగదొక్కి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఒక యువకుడు చేసే ప్రయత్నమే అధికారం సిరీస్ అని చెప్పారు.
ఇది జాతీయ స్థాయి సమకాలీన రాజకీయాలను చర్చించే వెబ్ సీరీస్‌గా ఉంటుందని దీనికి కథ, సంబాషణలను అందిస్తున్న కేబుల్ శంకర్. ఇందులో వెళ్‌లైపూక్కళ్ దేవ్, ఏఎల్ అళగప్పన్, ఇళవరసు, బిగ్‌బాస్ ఫేమ్ అభిరామి, జాన్‌విజయ్, అరవింద్‌ఆకాశ్, వినోదిని వైద్యనాథన్, సూదుకవ్వం శివకుమార్, సురాజ్, రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి దీనా దేవరాజన్ సంగీతాన్ని, రాజేశ్‌యాదవ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment