
సాక్షి, సినిమా : అగ్ర నటుడు వెంకటేష్ కొత్త చిత్రం కోసం హీరోయిన్ అన్వేషణ దాదాపు ముగిసినట్లేనన్న వార్త అందుతోంది. ఈ చిత్రం కోసం ఓ బాలీవుడ్ హీరోయిన్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నటి అదితి రావ్ హైదరి పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది.
నిజానికి ఈ చిత్రం కోసం అనుష్క, కాజల్, తమన్నా పేర్లను తొలుత దర్శకుడు తేజ పరిశీలించాడు. వీరందరినీ కాదని అదితి రావ్‌ను ఫైనలైజ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సిన అవకాశం ఉంది.
కాగా, హైదరాబాదీ అయిన 31 ఏళ్ల అదితి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించినప్పటికీ సక్సెస్ అందుకోలేకపోయింది. మణిరత్నం చెలియా చిత్రం కూడా ఆమె ఫేట్‌ను మార్చలేకపోయింది. దీంతో వెంకీ ప్రాజెక్టు పట్ల ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు అర్థమౌతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్-సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆటా నాదే వేటా నాదే అన్న టైటిల్ పరిశీలనలో ఉంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment