
కాజల్, సాయి శ్రీనివాస్, అనీల్ సుంకర, వినాయక్, తేజ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటరై్టన్‌మెంట్స్ పతాకంపై అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా, మరో డైరెక్టర్ శ్రీవాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్రదర్శకుడు తేజ తొలి షాట్ డైరెక్షన్ చేశారు. ‘‘మాస్ మసాలా ఎంటరై్టనర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది.
సోమవారమే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తేజ, కాజల్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ రెండోసారి నటిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి దానం నాగేందర్, నటుడు అభిమన్యు సింగ్ పాల్గొన్నారు. సోనూ సూద్ నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శీర్షరే, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు.
Comments
Please login to add a commentAdd a comment