మళ్లీ కాజల్‌తోనే రొమాన్స్‌ | Bellamkonda sreenivas and Kajal to team up again | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 25 2018 11:54 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

Bellamkonda sreenivas and Kajal to team up again - Sakshi

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌కు అవకాశాలు అస్సలు తగ్గటం లేదు. ఫ్రెష్‌ ఫేస్‌లకు పోటీగా ఆమె కెరీర్‌ కొనసాగుతోంది. ఓవైపు సీనియర్లతోపాటు కుర్ర హీరోలతోనూ రొమాన్స్‌ చేస్తోంది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో శ్రీనివాస్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.  అయితే ఈ యువ హీరోతోనే ఆమె మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లుగా ఓ వార్త వినిపిస్తోంది. తేజ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు కోసం ఈ ఇద్దరు మరోసారి జోడీ కట్టబోతున్నారని తెలుస్తోంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోయే ఈ ప్రాజెక్టును ఏకే ఎంటర్‌టైనర్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మించబోతున్నారన్నది ఆ కథనం సారాంశం. ప్రస్తుతం తేజ స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement