
దర్శకుడు తేజ.. ఉదయ్ కిరణ్(పాత చిత్రం)
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్‌లో బయోపిక్‌ల క్రేజ్ కనిపిస్తోంది. మహానటి సక్సెస్‌తో మరిన్ని జీవితగాథలను వెండితెరపై తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే గత రెండు రోజులుగా ఆసక్తికర కథనాలు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. దివంగత నటుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ రాబోతుందని, దీనికి తేజ దర్శకత్వం వహించబోతున్నాడని, ‘కాబోయిన అల్లుడు’ అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశాడని ఆ కథనాల సారాంశం.
అయితే ఆ వార్తలపై ఎట్టకేలకు దర్శకుడు తేజ స్పందించారు. ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తాను తీయట్లేదని, అదంతా రూమర్ అని ఆయన నవ్వేశారు. దీంతో పుకార్లకు పుల్‌స్టాప్ పడినట్లైంది. ఉదయ్ కిరణ్ కెరీర్‌కు తేజ సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన చిత్రం తీయబోతున్నాడంటూ కథనాలు అల్లేశారు. అయితే తన తర్వాతి చిత్రం మాత్రం యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లోనే ఉండబోతుందని తేజ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి అర్థంతరంగా తప్పుకున్న తేజ.. దగ్గుబాటి రానాతో తేజ యుద్ధ నేపథ్యంలో ఓ చిత్రం ఫ్లాన్ చేస్తున్నాడంటూ ఆ మధ్య ఓ టాక్ వినిపించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment