62 గెటప్పుల్లో బాలయ్య | Balakrishna reveals interesting details about NTRs biopic | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 7 2018 11:03 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Balakrishna reveals interesting details about NTRs biopic - Sakshi

ఈ సంక్రాంతికి జై సింహాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న నందమూరి బాలకృష్ణ త‍్వరలో సీనియర్ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కబోయే సినిమాను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కోసం ప్రత్యేకంగా ఒకరోజు షూటింగ్ నిర్వహించారు. ఈ టీజర్‌ను ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18న రిలీజ్ చేయనున్నారు.

త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు బాలయ్య. ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్ జీవితాన్ని సమగ్రంగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపిన బాలయ్య, దాదాపు 62 గెటప్పుల్లో కనిపిస్తానని వెల్లడించారు. అంతేకాదు సినిమాలో ఎన్టీఆర్ స్నేహితులు, సన్నిహితులతో పాటు ఆయన శత్రువుల ప్రస్థావన కూడా ఉంటుందని తెలిపారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement