ఎన్టీఆర్‌ బయోపిక్‌లో బాలీవుడ్ హీరోయిన్‌ | Vidya Balan play The Role Of Basavatarakam In NTR Biopic | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 13 2018 10:44 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Vidya Balan play The Role Of Basavatarakam In NTR Biopic - Sakshi

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ ప్రీ లుక్‌

జై సింహా సినిమా తరువాత గ్యాప్‌ తీసుకున్న బాలకృష్ణ త్వరలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ను ప్రారంభించబోతున్నాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖరున సెట్స్‌ మీదకు వెళ్లనుంది. బాలయ్య ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ ఎన్టీఆర్‌ గా శర్వానంద్‌ నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఎన్టీఆర్‌ సతీమణి పాత్ర ఎంపిక కోసం చాలా కసరత్తులు చేసిన చిత్రయూనిట్ ఫైనల్‌ ఓ బాలీవుడ్ హీరోయిన్‌ను ఎంపిక చేశారట. విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న టాలెంటెడ్‌ బ్యూటీ విద్యాబాలన్‌ ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో కనిపించనున్నారట. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ధృవీకరించాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement