బాలయ్య సొంత బ్యానర్‌లో మరో సినిమా | Balakrishna To Produce Another Film | Sakshi
Sakshi News home page

Published Sat, May 26 2018 1:35 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Balakrishna To Produce Another Film - Sakshi

కుర్ర హీరోలకు పోటి ఇస్తూ వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే ఎన్టీఆర్‌ సినిమాను ప్రారంభించిన బాలయ్య, దర్శకుడు తేజ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవటంతో ఆ చిత్ర షూటింగ్‌ను తాత్కాలికంగా పక్కకు పెట్టారు. ఈ గ్యాప్‌లో వినాయక్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు బాలకృష్ణ.

అంతేకాదు తనకు సింహా, లెజెండ్‌ లాంటి ఘనవిజయాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ ఓ సినిమాను ప్రారంభించనున్నారట. ఈ సినిమాను బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా జూన్‌ 10న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాను బాలయ్య స్వయంగా ఎన్‌.బి.కె ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ను కూడా బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement