
డిసెంబర్ 13... ‘విక్టరీ’ వెంకటేశ్ బర్త్‌డే. ఆ రోజునే కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాలనుకుంటున్నారట వెంకీ అండ్ కో! తేజ దర్శకత్వంలో ఈ స్టార్ హీరో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమానే బర్త్‌డేకి లాంచ్ చేయాలనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అట! ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉందంటున్నారు. ‘గురు’ తర్వాత వెంకీ హీరోగా నటించనున్న చిత్రమిది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించనున్నారు.
ఇందులో వెంకీ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదట! ప్రస్తుతానికి కాజల్ అగర్వాల్ పేరు వినబడుతోంది. తేజ లాస్ట్ సిన్మా ‘నేనే రాజు నేనే మంత్రి’లో కాజలే మెయిన్ హీరోయిన్. ‘లక్ష్మీ కల్యాణం’తో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేసిందీ ఆయనే. అందువల్ల, తేజ అడిగితే కాజల్ ‘యస్’ చెప్పే అవకాశాలు ఎక్కువే! ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయని తెలుస్తోంది!! వెంకటేశ్ సినిమా తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందనున్న ఎన్టీఆర్ బయోపిక్‌కి తేజ దర్శకత్వం వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment