
దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జయం, నిజం’ సినిమాల్లో విలన్ పాత్రలో నటించారు గోపీచంద్. విలన్‌గా మంచి ప్రశంసలు అందుకున్నారు కూడా. ఇప్పుడు తేజ దర్శకత్వంలో హీరోగా నటించనున్నారాయన. గోపీచంద్ – తేజ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘అలివేలు వెంకటరమణ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇందులో గోపీచంద్ పాత్ర పూర్తి పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. గోపీచంద్‌లోని కొత్త కోణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారట తేజ. జూన్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ అనే సినిమా చేస్తున్నారు గోపీచంద్.
Comments
Please login to add a commentAdd a comment