
తన పుట్టిన రోజు (ఫిబ్రవరి 22) సందర్భంగా తాజా చిత్రాల అప్‌డేట్స్ ఇచ్చారు దర్శకుడు తేజ. 1836వ సంవత్సరంలో సాగే పీరియాడికల్ లవ్‌స్టోరీతో ‘విక్రమాదిత్య’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2022 ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషాలకు ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించారు తేజ. కాగా తేజ కెరీర్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘జయం’ సినిమా షూటింగ్ సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఇదే ముహూర్తాన మొదలైంది.
ఇక ‘విక్రమాదిత్య’ సినిమా విషయానికివస్తే.. 1836వ సంవత్సరంలో సర్ ఆర్ధర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం జరిగింది. కాబట్టి ‘విక్రమాదిత్య’ సినిమా కథకు, ఈ వంతెనకు సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భవ్య సమర్పణలో లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment