ఎన్టీఆర్‌ బయోపిక్‌... స్టార్టింగ్‌ సూన్‌! | Nandamuri Balakrishna Movie On Senior NTR's Life Story | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ బయోపిక్‌... స్టార్టింగ్‌ సూన్‌!

Published Wed, Oct 11 2017 11:55 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Nandamuri Balakrishna Movie On Senior NTR's Life Story  - Sakshi

హీరో బాలకృష్ణ, దర్శకుడు తేజ మధ్య చర్చలు ముగిశాయి. చిత్రీకరణ మొదలు కావడమే మిగిలుంది! ఎన్టీఆర్‌ బయోపిక్‌ గురించే ఈ ఇద్దరు చర్చించుకున్నారు. హీరో, దర్శకుడు ఓ ఐడియాకి వచ్చేశారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తామని ఫేస్‌బుక్‌ ద్వారా తేజ ప్రకటించారు.

తెలుగు చిత్రసీమలోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి, ప్రేక్షకుల మనసుల్లో నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవితకథ ఆధారంగా ఓ సినిమా రూపొందించనున్నట్టు ఆయన తనయుడు, హీరో నందమూరి బాలకృష్ణ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించనున్నారు. ‘‘ఎన్టీఆర్‌ బయోపిక్‌... స్టార్టింగ్‌ సూన్‌’’ అని బుధవారం తేజ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని బాలకృష్ణే నిర్మిస్తారట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement