సినీ దర్శకుడు తేజపై క్రిమినల్ కేసు | criminal case filed against director teja | Sakshi
Sakshi News home page

సినీ దర్శకుడు తేజపై క్రిమినల్ కేసు

Published Tue, Apr 26 2016 8:26 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM

సినీ దర్శకుడు తేజపై క్రిమినల్ కేసు - Sakshi

సినీ దర్శకుడు తేజపై క్రిమినల్ కేసు

హైదరాబాద్: సినీ దర్శకుడు తేజ, వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ కలప వ్యాపారి ఆర్‌వి.కృష్ణారావు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఫిలింనగర్ రోడ్ నెం.9లో నివసించే ఆర్‌వి.కృష్ణారావు టింబర్ బిజినెస్ చేస్తున్నారు.

ఈ నెల 7వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో ఫిలింనగర్‌లోని ముక్తిధామం సాయిబాబా దేవాలయం నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం.12 వైపు వెళ్తుండగా విక్కి అనే వ్యక్తి కారు ఆపి ఆయనను కలుసుకొని వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ నీపై దృష్టి పెట్టాయని సినిమా దర్శకుడు తేజ ఇంటి విషయాన్ని సెటిల్ చేసుకోవాలని సూచించారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ ఇంటి విషయాన్ని త్వరగా తేల్చుకోకపోతే వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. మళ్లీ ఈ నెల 13వ తేదీన సినీ డెరైక్టర్ తేజ ఇదే విషయంపై కృష్ణారావుకు ఫోన్ చేసి దూషించాడు. తనకు ఈ ముగ్గురి నుంచి ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు న్యాయ సలహా కోసం ఫిర్యాదును కోర్టుకు పంపించారు. కోర్టు ఆదేశాలతో శనివారం రాత్రి ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement