
కళ్లజోడు... గళ్లచొక్కా... రెండిటికీ తోడు చక్కగా బూటులు వేసుకుని, టై కట్టుకుని పాతికేళ్ల క్రితమే వెంకటేశ్ పాఠాలు చెప్పారు. ‘సుందరకాండ’ సిన్మాలో! రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో జూనియర్ కాలేజ్ లెక్చరర్‌గా వెంకీ కనిపించారు. మళ్లీ ఇప్పుడు కాలేజీలో క్లాసులు చెప్పడానికి రెడీ అవుతున్నారట! తేజ దర్శకత్వంలో నటించే సినిమా కోసం! వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో వెంకీ కాలేజ్ ప్రొఫెసర్‌గా కనిపిస్తారట! ఎట్ ద సేమ్ టైమ్... ఆయన లుక్ చాలా స్టైలిష్‌గా ఉంటుందని సమాచారమ్. వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న మొదలు కానున్న ఈ సిన్మాలో హీరోయిన్ ఎవరనేది చిత్రబృందం ఇంకా ప్రకటించనప్పటికీ... కాజల్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉందట!!
Comments
Please login to add a commentAdd a comment