తేజ దర్శకత్వంలో మెగా మల్టీ స్టారర్..? | Varun Tej and Sai Dharam Tej Multistarrer with Director Teja | Sakshi
Sakshi News home page

తేజ దర్శకత్వంలో మెగా మల్టీ స్టారర్..?

Published Mon, Sep 4 2017 3:50 PM | Last Updated on Tue, Sep 12 2017 1:51 AM

Varun Tej and Sai Dharam Tej Multistarrer with Director Teja

చాలా కాలం తరువాత నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన దర్శకుడు తేజ, ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే యంగ్ హీరోలతో ఓ మల్టీ స్టారర్ సినిమా చేసే ఆలోచన ఉన్నట్టుగా తేజ ప్రకటించాడు. అయితే ఆ హీరోలు ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. తాజాగా తేజ దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమా చేయబోయే హీరోలకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.

బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు తేజ దర్శకత్వంలో కలిసి నటించనున్నారట. ఈ సినిమా యునైటెడ్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కనుంది. అయితే ఈ మెగా మల్టీ స్టారర్ కు సంబంధించి అఫీషియల్ గా మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. అయితే చిత్రయూనిట్ ఈ వార్తలను ఖండించకపోవటంతో అభిమానులు మెగా మల్టీ స్టారర్ సెట్స్ మీదకు రావటం ఖాయం అని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement