శనివారం తేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా తాను దర్శకత్వం వహించబోయే రెండు సినిమాలను ప్రకటించారు. ఒకటి గోపీచంద్‌తో, మరొకటి రానాతో. ఈ హీరోలతో సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించి, ‘రాక్షసరాజు–రావణాసురుడు’, ‘అలివేలు మంగా– వెంకటరమణ’ అని రెండు టైటిల్స్ కూడా చెప్పారు. అయితే ఈ టైటిల్స్‌లో గోపీచంద్ సినిమా ఏది? రానా సినిమా ఏది? అనే క్లారిటీ ఇవ్వలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘అలివేలు మంగా–వెంకటరమణ’ గోపీచంద్ సినిమా టైటిల్ అని తెలిసింది. ఇక గోపీచంద్–తేజ, రానా–తేజల కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. గోపీచంద్‌ను ‘జయం’ చిత్రం ద్వారా విలన్‌గా పరిచయం చేసి, పెద్ద హిట్ ఇచ్చారు తేజ. అలాగే రానాకు ‘నేనే రాజు– నేనే మంత్రి’ వంటి చక్కటి విజయాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment