ఎన్టీఆర్ బయోపిక్ : వర్మ కాదు.. ఆయన శిష్యుడు | Director Teja to Direct NTR Biopic | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ బయోపిక్ : వర్మ కాదు.. ఆయన శిష్యుడు

Published Thu, Oct 5 2017 10:18 AM | Last Updated on Thu, Oct 5 2017 10:18 AM

Director Teja to Direct NTR Biopic

నందమూరి తారక రామారావు బయోపిక్ పై రోజుకో వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. బాలకృష్ణ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. అప్పటి నుంచే వివాదాలు మొదలయ్యాయి. అదే సమయంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించటం మరింత ఆసక్తి కలిగేలా చేసింది.

తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో పొలిటికల్ థ్రిల్లర్ లను కూడా తెరకెక్కించగలనని ప్రూవ్ చేసుకున్న దర్శకుడు తేజ. ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై దర్శకుడు తేజ స్పందించారు. తాను బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో చర్చించిన విషయం నిజమేనన్న తేజ, తాను దర్శకత్వం వహించేది లేనిది త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు.

వర్మ మాత్రం తన స్టైల్ లో ఎన్టీఆర్ బయోపిక్ తో వివాదాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసిన వర్మ, వచ్చే ఏడాది చివరకు సినిమాను రిలీజ్ చేస్తానని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement