షాక్కు గురయ్యా: దర్శకుడు తేజ | i was really shocked on uday kiran suicide news, director teja | Sakshi
Sakshi News home page

షాక్కు గురయ్యా: దర్శకుడు తేజ

Published Mon, Jan 6 2014 8:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM

షాక్కు గురయ్యా: దర్శకుడు తేజ

షాక్కు గురయ్యా: దర్శకుడు తేజ

హైదరాబాద్ : ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వార్త విని షాక్కు గురైనట్లు దర్శకుడు తేజ తెలిపారు. ఈ విషయాన్ని ఓ స్నేహితుడు తనకు ఫోన్ చేసి చెప్పాడని, ఆ వార్త నిజం కాకపోతే బాగుండు అనుకున్నానన్నారు. ఉదయ్ కిరణ్ను చివరగా అతనిని పెళ్లిలో చూశానని ...చాలా సంతోషంగా ఉన్నాడని తేజ తెలిపారు. తనను కలవాలని ఉదయ్ కిరణ్ అడిగితే.... కొంత సమయం తీసుకుందామని చెప్పానన్నారు.

సినిమాలు లేకపోతే ఏ నటుడైనా డిప్రెషన్కు గురవుతారని, యాక్టర్లకు సినిమాలు తప్ప, మరేమీ తెలియదని తేజ అన్నారు. మీసాలు కూడా రాని ఉదయ్ను తానే చిత్ర పరిశ్రమకు పరిచయం చేశానని, చాలా మంచి వ్యక్తి అని, ఎవరికీ హాని చేసే మనస్తత్వం కాదని అన్నారు.

తన కెరీర్కు బాగోనందున కొంత సమయం తీసుకుని...ఉదయ్ కిరణ్తో ఓ సినిమా చేద్దామనుకున్నానని, ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగిపోయిందన్నారు. కొద్ది రోజుల క్రితం ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోవటం...ఇప్పుడు ఉదయ్ మృతి బాధాకరమన్నారు. కాగా ఉదయ్ కిరణ్ను చిత్రపరిశ్రమలో తొక్కేసారా? లేదా అన్నది తనకంటే మీడియాకే బాగా తెలుసు అని...విలేకర్ల ప్రశ్నకు తేజ సమాధానం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement