uday kiran suicide
-
'కెరీర్లో ఎక్కడో తప్పు జరిగింది'.. ఉదయ్‌కిరణ్ మృతిపై సదా కామెంట్స్
టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. లవర్‌బాయ్ ఇమేజ్‌తో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రల్లో నటించిన ఉదయ్కిరణ్కి యూత్‌లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే అనుకున్నంత స్థాయిలో కెరీర్ లేకపోవడం, సరైన అవకాశాలు లేక డిప్రెషన్‌తో ఉదయ్‌కిరణ్ 2014లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉదయ్‌కిరణ్ మృతిపై హీరోయిన్ సదా మాట్లాడుతూ.. 'అతను ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎప్పుడూ ఊహించలేదు. ఉదయ్ కిరణ్‌తో కలిసి 'ఔనన్నా కాదన్నా' సినిమా చేశాను. అతను ఎంతో మంచి వ్యక్తి. అంత మంచి నటుడ్ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన కెరీర్లో ఎక్కడో తప్పు జరిగింది. కానీ ఏం జరిగినా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. సినిమా అవకాశాల కంటే జీవితమే ముఖ్యం. సమస్యకు చావే పరిష్కారం కాదు.. ఒక యాక్టర్ గా మనం ది బెస్ట్ అవ్వాలి అంతే. ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అన్నది పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది ' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సదా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
ఉదయ్‌కిరణ్‌ను ఒక్కసారే కలిశా: సంగీత
-
ఉదయ్‌కిరణ్‌ను ఒక్కసారే కలిశా: సంగీత
* ఆయన మరణానికి నేను కారణం కాదు * నేను డబ్బులిచ్చింది మున్నాకే.. * తెలిసిన వారి దగ్గర రూ.17 లక్షలు వడ్డీకి తెచ్చి ఇచ్చా.. * మున్నా ఆచూకీ కోసం ఉదయ్‌కిరణ్ ఇంటికి వెళ్లా.. సాక్షి, హైదరాబాద్: సినీనటుడు ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యకు తన వేధింపులే కారణమని వెలువడుతున్న వార్తల్లో వాస్తవం లేదని ఫైనాన్షియర్ సంగీత చెప్పారు. ఉదయ్‌కిరణ్‌ను తాను ఒక్కసారే కలిసానని, ఎప్పుడూ డబ్బుల విషయం మాట్లాడలేదని అన్నారు. ఆయన మరణానికి తానెంత మాత్రమూ కారణం కాదని చెప్పారు. ‘వారు పెద్ద వ్యక్తులు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నారుు..’ అని అన్నారు. తాను మున్నాకే డబ్బులు ఇచ్చానని, ఆయనకు సంబంధించిన చెక్కులు, ప్రామిసరీ నోటే తీసుకున్నానని తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సంగీత ఆదివారం సాక్షితో మాట్లాడారు. వాస్తవానికి తాను ఫైనాన్షియర్‌ను కాదన్నారు. స్వగ్రామం చిత్తూరు జిల్లా కుప్పంలో చీరల వ్యాపారం చేసే తనకు.. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఉదయ్‌కిరణ్ మేనేజర్ మున్నా పరిచయమయ్యూడని తెలిపారు. ఐదారు నెలల స్నేహం తర్వాత తాను ఉదయ్‌కిరణ్‌తో ఓ సినిమా తీస్తున్నట్టు మున్నా చెప్పాడన్నారు. మీరు ఫైనాన్స్ చేస్తే బావుంటుందనడంతో అంత డబ్బు తన వద్ద లేదన్నానని, మీకు తెలిసిన వారెవరైనా ఉంటే వడ్డీకి ఇచ్చినా పర్వాలేదని చెప్పడంతో.. తెలిసిన ఇద్దరి దగ్గర ఐదారు రూపాయల వడ్డీ చొప్పున రూ.17 లక్షలు తెచ్చి మున్నాకు ఇచ్చినట్లు సంగీత చెప్పారు. సినిమా ప్రారంభం కావడానికి 3 నెలలు పడుతుందని, ఆ తర్వాత ఇస్తానని చెప్పాడన్నారు. సినిమాలో తమ బాబుకు పాత్ర ఇస్తానన్నాడని, కో ప్రొడ్యూసర్‌గా మీ పేరు వేస్తానని చెప్పినట్లు తెలిపారు. చీరల వ్యాపారం చేస్తున్నారు కాబట్టి సినిమాలో కాస్ట్యూమ్స్ కూడా మీవే వినియోగిస్తామని, తద్వారా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుందనడంతో అంగీకరించానన్నారు. డబ్బులిస్తున్నప్పుడే ఉదయ్‌కిరణ్‌తో ఫోన్లో మాట్లాడి సినిమా తీస్తున్న విషయూన్ని ధ్రువీకరించుకున్నట్లు తెలిపారు. అప్పుడు మున్నానే ఫోన్ కలిపి ఇచ్చాడన్నారు. అరుుతే ఆరు నెలలైనా సినిమా ప్రారంభించకపోవడం, ఫోన్లు చేస్తే మున్నా ఎత్తకపోవడం, పైగా ఆఫీస్ ఎత్తివేశారని తెలియడంతో.. అతని ఆచూకీ కోసం కొద్దిరోజుల క్రితం తొలిసారి ఉదయ్ ఇంటికి వెళ్లినట్లు సంగీత తెలిపారు. వాచ్‌మన్ చెన్నై వెళ్లారని చెప్పడంతో వెనుదిరిగి వచ్చానని, మళ్లీ గతనెల 21న వెళ్లి ఉదయ్‌ను కలిశానని వివరించారు. మున్నా డబ్బులకోసం తిరుగుతున్నాడని, మీరు ఆందోళన చెందవద్దని ఆయన చెప్పారని పేర్కొన్నారు. ఆ సమయంలోనే మున్నాకు ఫోన్ చేసినా స్విచాఫ్ రావడంతో.. అదే విషయం ఉదయ్‌కు చెప్పి, మీరైనా విషయం తెలియజేయండి అని కోరి వచ్చేశామన్నారు. -
ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య బాధించింది
ఆత్మహత్య బాధాకరం: హీరో తరుణ్ దివంగత హీరో ఉదయ్‌కిరణ్ తనకు మంచి మిత్రుడని, అతని మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని హీరో తరుణ్ ఆవేదన చెందారు. శ్రీకాంత్ కలసి ఇక్కడికి వచ్చిన ఆయన తన మనస్సులోని భావాలను విలేకరులతో పంచుకున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలియదుకాని ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. మంచి నటుడ్ని తె లుగు సినీ పరిశ్రమ పోగొట్టుకుందని వ్యాఖ్యానించారు. తెలుగు ఇండస్ట్రీని నాలుగు కుటుంబాలే శాసిస్తున్నాయన్న టాక్‌పై విలేకరులు ప్రస్తావించగా అలాంటిదేమి ఉండదన్నారు. ఎవరూ ఎవర్నీ ఏమీ చేయలేరన్నారు. మన సినిమా బాగుంటే అదే ఆడుతుందన్నారు. పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలు బాగున్నా ఆడడం లేదన్న విషయంలో కూడా నిజం లేదన్నారు. ఎన్ని చిన్న సినిమాలు బాగా ఆడడం లేదంటూ... ఇటీవల విడుదలై విజ యం సాధించిన కొన్ని చిన్న సినిమాల పేర్లను ఉదహరించారు. చిన్నవి, పెద్దవి అని కాదని లో బడ్జెట్, హై బడ్జెట్ అనేదే చూడాలన్నారు. ఎన్నో లో బడ్జెట్ సినిమాలు బాగా ఆడుతున్నాయన్నారు. సినిమా బాగుం టే ప్రేక్షులు వద్దన్నా వెళ్లతారన్నారు. వారినెవరూ ఆపలేరని చెప్పారు. ప్రస్తుతం వేట, యుద్ధం సినిమాల్లో నటిస్తున్నట్టు తెలిపారు. -
ఉదయకిరణ్ అభిమాని ఆత్మహత్య
దత్తిరాజేరు: తన అభిమాన నటుడి మరణాన్ని తట్టుకోలేని ఓ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో కోమటిపల్లి గ్రామంలో ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో లభించిన పాకెట్ డైరీలో ‘నా అభిమాన హీరో ఉదయకిరణ్ చనిపోయాడు. ఇక ఈ జన్మ చాలు. మా మామయ్య కనకకు ఈ మోటారు బైక్ ఇచ్చేయండి. అందరికీ బై’అని రాసి ఉంది. గ్రామానికి చెందిన నాంగీరి సతీష్(19) బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గురువారం మధ్యాహ్నం 2గంటల సమయంలో మామడిచెట్టుకు వేలాడుతున్న సతీష్ మృతదేహాన్ని చూసినవారు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి తల్లి కొండమ్మ, సోదరి సత్యవతి ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనుక సవాలక్ష ప్రశ్నలు
సినిమా హీరో ఉదయ్ కిరణ్ మరణం పెద్దలను, యువతని అందరిని అందోళనలోకి నెట్టింది. ఆలోచనలను రేపింది. అనేకమంది కలత చెందారు. హీరోగా అందరికీ ఆదర్శప్రాయుడు కావాల్సిన ఉదయ్ ఇలా అర్ధాంతరంగా చనిపోవడం దురదృష్ట కరమని యువ ఉద్యోగులు వాపోతున్నారు. కష్టాలనెదుర్కొని సినిమాలో నిలదొక్కుకున్న ఉదయ్ నిజ జీవితంలో పోరాడి ఓడిపోయాడని భావిస్తున్నారు. ఇలా ఎవ్వరు చేయకూడదని అందరూ అంటున్నారు. అనేక సినిమాలలో మనల్ని అలరించిన అందగాడు-లవర్‌బాయ్ చావు మిస్టరీగా మారింది. ఉదయ్ ఆత్మహత్య వెనుక సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనేక ప్రశ్నలకు సమాధానాలే లేవు. అంతుపట్టని ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి. ఉదయ్ కిరణ్ వద్ద ఆఫీస్ బాయ్‌గా పనిచేసిన మున్నా తర్వాత మేనేజర్ స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత నిర్మాతగా మారి సొంతంగా సినిమాలు తీస్తున్నాడు. మున్నా నిర్మాతగా "దిల్ కపాడి'' సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఉదయ్ హీరో. రెండు పాటలు మినహా ఈ సినిమా మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఒక హీరోయిన్ పెట్టుబడి పెట్టారని చెబుతున్నారు. ఈ చిత్ర నిర్మాణం మధ్యలో అర్ధంతరంగా ఆగిపోయింది. ఆత్మహత్య వెనుక అంతు చిక్కని ప్రశ్నలు: వృత్తి పరంగా సినిమా అవకాశాలు లేకపోవడమా? కుటుంబ సమస్యలా? ఆర్థిక లావాదేవీలా? వీటన్నిటి వల్ల మానసిక వత్తిడులకు లోనవడమా? ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఉన్న మాట నిజమేనా? గడచిన మూడు వారాల్లో ఏం జరిగింది? ఉదయ్ శరీరంపై గాట్లు ఎందుకున్నాయి? ఇంతకుముందు ఆత్మహత్యాయత్నం చేశాడా? ఒకవేళ అదే నిజమైతే ఎందుకు చేశాడు? అతని మానసిక పరిస్థితి బాగోలేదా? అదే నిజమైతే కుటుంబ సభ్యులు ఎందుకు జాగ్రత్తపడలేదు? ఆదివారం సాయంత్రం ఏం జరిగింది? భార్యభర్తల మధ్య విభేదాలు ఉన్నాయా? అవి అంత తీవ్రమైనవా? ఆమె మణికొండ వెళ్లిందా? ఇంకెక్కడికైనా వెళ్లిందా? పార్టీకి వెళ్లిన మాట నిజమేనా? అది ఎవరి పార్టీ? విషిత బయటకు వెళ్లినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారా? వాళ్లు వెళ్లిపోయిన తర్వాతే ఉదయ్ చనిపోయాడా? ఆత్మహత్యకు ముందు ఉదయ్ ఎవరికి ఫోన్ చేశాడు? ఆ రోజు రాత్రి భోజనం చేయకపోడానికి కారణాలేంటి? ఆదివారం ఉదయం నుంచే భార్యాభర్తల మధ్య గొడవ మొదలైందా? అంతకు ముందే గొడవలు ఉన్నాయా? విషిత ఉద్యోగం చేసే విషయంలో ఉదయ్ అసంతృప్తికి లోనయ్యాడా? ఉదయ్ కిరణ్ చెన్నై వెళ్లిపోవాలని ఎందుకు అనుకున్నాడు? చెన్నై స్నేహితుడు ఎవరు? ఇప్పుడెక్కడున్నాడు? ఉదయ్ మేనేజర్ మున్నా సినిమా ఎందుకు ఆగిపోయింది? ఉదయ్ సినిమా కోసం పెట్టుబడి పెట్టిన హీరోయిన్ ఎవరు? డబ్బుల కోసం ఆ హీరోయిన్ ఉదయ్ పీకల మీద కూర్చుందా? ఉయద్కు స్థిరాస్తులు ఉన్నాయా? ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఎలా వచ్చాయి? అప్పులు తీర్చగలిగీ తొందరపడి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? కుటుంబ సభ్యుల మాటలలో ఎందుకు స్పష్టతలేదు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరకవలసి ఉంది. ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య వెనుక కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మర చేశారు. ఆర్థిక పరమైన లావాదేవీలపై కూపీలాగుతున్నారు. ఇవే కాకుండా కొత్తకోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉదయ్ కిరణ్ ది ఆత్మహత్యేనని వైద్యులు నిర్ధారించారు. ఇక ఆత్మహత్యకు కారణాలు తెలియవలసి ఉంది. కారణాలలో ప్రధానమైనది మానసిక వత్తిడేనని స్సష్టమవుతోంది. సమస్యలు ఒక్కసారిగా దాడి చేసినప్పుడు, శక్తికి మించి తట్టుకోలేని వత్తిడి ఏర్పడినప్పుడు ఒక వ్యక్తి మానసిక పరిస్థితిలో మార్పు వస్తుంది. అతని మాటలు, ఆలోచనలు, ప్రవర్తన ద్వారా ఇంట్లోని వారు, మిత్రులు పసిగట్టవచ్చు. అప్పుడు తప్పనిసరిగా మానసిక వైద్యుడిని కలవాలి. మన దేశంలో చాలా మంది మానసిక వైద్యుడిని సంప్రదించడానికి వెనకాడతారు. ఒక వ్యక్తిలో మానసిక రుగ్మతలు వెలుగు చూసినప్పుడు కుటుంబ సభ్యులు జాగ్రత్తపడాలన్ని విషయాన్ని ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గుర్తు చేస్తోంది. -
ఉదయ్ కిరణ్ భౌతికాయాన్ని సందర్శించిన ప్రముఖులు
-
ఉదయ్ కిరణ్ది ఆత్మహత్యే
-
ఉదయ్ కిరణ్ది ఆత్మహత్యే : ఉస్మానియా వైద్యుల నిర్ధారణ
హైదరాబాద్: సినీహీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. పోస్ట్ మార్టం నివేదికను వైద్యులు సిద్దం చేశారు. వైద్యులు తెలిపిన సమాచారం ప్రకారం ఉదయ్ కిరణ్ రాత్రి 10 -12 గంటల మధ్యలో ఉరి వేసుకున్నాడు. క్లాత్ రోప్‌తో ఉరి వేసుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఉరి వేసుకున్న కొద్ది నిమిషాలలోనే అతను మరణించాడు. ఉదయం నుంచి ఉదయ్ కిరణ్ ఎటువంటి ఆహారం తీసుకోలేదని కూడా వైద్యులు తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు నివేదికను ఈ సాయంత్రం పోలీసులకు అందజేస్తారు. -
మచ్చుకైనా లేదు మానవత్వం!
మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు అన్న కవి మాటలు నిజమవుతున్నాయి. ఆధునిక మానవుల్లో మంచితనం కొడిగడుతోంది. సంకుచిత ధోరణితో మనిషి కుంచించుకుపోతున్నాడు. విజ్ఞానశాస్త్రంలో శిఖరస్థాయికి చేరినా విలువలు పరంగా దిగజారిపోతున్నాడు. ఆధునికుడిగా పరిణామం చెందినా మూఢవిశ్వాసాలతో అంధయుగ ఆనవాళ్లు కొనసాగిస్తున్నాడు. ఆపదలో ఉన్న వాడిని ఆదుకునేందుకు సంశయిస్తున్నాడు. సహాయ చింతన మరిచి సంచరిస్తున్నాడు. యువ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యోదంతమే ఇందుకు తిరుగులేని రుజువు. తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన ఉదయ్ కిరణ్ అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సక్సెస్ పరుగులు తీసే సినిమా జనం ఈ వార్త తెలిసినా పెద్దగా స్పందించలేదు. ప్రతి చిన్న విషయానికి హడావుడి చేసే సినిమా పెద్దలు ఉదయ్ కిరణ్ మరణాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఫిలిమ్ ఛాంబర్‌కు తరలించేవరకు అతడి భౌతిక కాయాన్ని సందర్శిన పాపాన పోలేదు. ఇక సినిమా పరిశ్రమను శాసిస్తున్న కొన్ని కుటుంబాలైతే ఆ ఛాయలకే రాలేదు. తోటి నటుడిగా కూడా అతడి పట్ల సానుభూతి వ్యక్తం చేయలేకపోయాయి. ఇక రాజకీయ నాయకులు, కుల సంఘాల పెద్దల హంగామా సరేసరి. తోటి మనుషులు కూడా మానవత్వం లేకుండా ప్రవరిస్తుండడమే విస్తుగొలుపుతోంది. నిన్నటివరకు తమ కళ్లెదుటే తిరిగిన మనిషి మరణిస్తే కనీస కనికరం చూపడం లేదు. అతడుంటున్న అపార్ట్మెంట్ యజమాని ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని తీసుకునేందుకు అంగీకరించలేదు. అటు సినిమా పరిశ్రమ వారు పట్టించుకోలేదు. కన్నతండ్రి, భార్య తరపువారు ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు. చివరకు నిమ్స్ ఆస్పత్రిలో భౌతిక కాయాన్ని భద్రపరిచారు. అందరూ ఉన్నా అనాథలా అతడి మృతదేహాన్ని ఆస్పత్రిలో దాచాల్సివచ్చింది. మనిషి ఎలాంటివాడైనా చనిపోయిన తర్వాత ఘనంగా సాగనంపాలనేది మన సంప్రదాయం. కానీ మనిషి చనిపోవడమే పాపం అన్నట్టుగా ఆధునికులు వ్యవహరిస్తుండడం సమాజంలో లుప్తమవుతున్న విలువలకు అద్దం పడుతోంది. అద్దె ఇళ్లలో ఉంటున్నవారి 'చావు' కష్టాలు చెప్పనలవి కాదు. తమ వారెవరైనా చనిపోయితే మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చే వీలుండదు. తమ ఇల్లు మైలపడిపోతుందనే ఉద్దేశంతో శవాన్ని గుమ్మం ఎక్కనివ్వని యజమానులే ఎక్కువ. మైలు పేరుతో నిర్ధాక్షిణ్యంగా ఇళ్లు ఖాళీచేయించే మహానుభావులు ఉన్నారంటే అర్థమవుతుంది మనమెంత ముందుకు పోయామో. చాలా విషయాల్లో ఇలాగే జరుగుతోంది. నమ్మకాలను ఎవరూ కాదనరు. కానీ మూఢ విశ్వాసాలతో మానవత్వాన్ని మంటగలపడమే అసలైన విషాదం. -
రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించిన ఉదయ్ కిరణ్
హైదరాబాద్ : ఉదయ్ కిరణ్ రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో వెల్లడి అయ్యింది. ఉరి వేసుకునే ముందు అతను చేతి మణికట్టు నరాలు కోసుకునే ప్రయత్నం చేసినట్లు ఫోరెన్సిక్ నివేదికలో బయటపడింది. రాత్రి 10.30 ....11.00 గంటల మధ్యలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోరెన్సిక్ సిబ్బంది తెలిపారు. అలాగే ఉదయ్ కిరణ్, అతని భార్య విషిత కాల్ డేటాను పోలీసులు తెప్పించారు. విషిత ఫోన్ నుంచే ఉదయ్ కిరణ్‌కు మెసేజ్‌లు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఉదయ్ కిరణ్ ఫోన్ నుంచి నాలుగు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రాణ స్నేహితుడు శరత్‌కు రెండుసార్లు, భార్య విషితకు రెండుసార్లు అతను కాల్ చేసినట్లు తెలుస్తోంది. భార్యకు ఎలాంటి మెసేజ్ పంపలేదని....ఉదయ్ కిరణ్ కాల్ చేయగా.... తన ఫోన్ చెడిపోయిందని విషిత మెసేజ్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. కాగా గత కొంత కాలంగా సినిమా అవకాశాలు లేక సతమతం అవుతున్న ఉదయ్ కిరణ్....ఆదివారం రాత్రి శ్రీనగర్ కాలనీనలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతను ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, తన కెరీర్ ఆశాజనకంగా లేక పోవడమే కారణమని తెలుస్తోంది. -
'ఎవరి బతుకు వారిని బతకనీయండి'
హైదరాబాద్: యువ నటుడు ఉదయ్ కిరణ్ మరణంపై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు. ఉదయ కిరణ్ ఎలా మరణించాడనేది బాహ్య ప్రపంచానికి తెలియాలని అన్నారు. ఫిల్మ్ ఛాంబర్లో ఉదయ్ కిరణ్ భౌతిక కాయానికి ఆమె నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్వశక్తితో పైకొచ్చిన కుర్రాడి జీవితం ఇలా ముగియం బాధాకరమని పేర్కొన్నారు. ఉదయ్ కిరణ్ మరణం కలచివేసిందదన్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు వర్థమాన నటులను అగణదొక్కడం మానుకోవాలని హితవు పలికారు. ఎవరి బతుకు వారిని బతకనీయండి అంటూ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఉదయ్ కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కోరుకున్నారు. -
పోరాడదాం, గెలుద్దాం: శివాజీ
హైదరాబాద్: ఆత్మహత్య పిరికి చర్య అని నటుడు శివాజీ అన్నారు. సమస్యల నుంచి పారిపోకూడదని, పోరాడాలని ఆయన సూచించారు. సమస్యలను తప్పించుకుంటే ఓడిపోయినట్టేనని పేర్కొన్నారు. సమస్యలను ఎదుర్కొందాం, పోరాడదాం అని అన్నారు. పోరాడదాం, గెలుద్దాం అని వ్యాఖ్యానించారు. జీవితంలో ఏదో రోజు విజయం సాధిస్తామని తెలిపారు. ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి నివాళి అర్పించిన శివాజీ విలేకరులతో మాట్లాడారు. తాను ఎదుర్కొన్న సమస్యలకు 20, 30 సార్లు ఆత్మహత్య చేసుకోవాలన్నారు. భగవంతుడి ఇచ్చిన జీవితాన్ని పిరికి చర్యలకు బలికానీవ్వకూడదన్నారు. ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు, నమ్ముకున్న వారిని నట్టేటా ముంచడం భావ్యం కాదని శివాజీ అన్నారు. -
ఉదయ్ కిరణ్ కి ప్రముఖుల నివాళులు
-
ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి ప్రముఖుల నివాళి
హైదరాబాద్ : నటుడు ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్లోని అతని పార్థివదేహాన్ని ఉంచారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు. దర్శకుడు దాసరి నారాయణరావు, తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ, చలపతిరావు, నటి జయసుధ, అశోక్ కుమార్, వరుణ్ సందేశ్, ఎంఎస్ రాజు, పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేష్, సురేష్ బాబు, రామానాయుడు, శ్రీకాంత్, శివాజీ రాజా, దర్శకుడు సముద్ర, అనూప్ రూబెన్స్, కాదంబరి కిరణ్ కుమార్, బెనర్జీ తదితరులు ఉదయ్ కిరణ్‌కు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. -
సినిమా ఫీల్డ్ అనేది మాయ: శివాజీరాజా
హైదరాబాద్: సినిమా ఫీల్డ్ అనేది మాయ అని నటుడు శివాజీరాజా అన్నారు. సినిమా పరిశ్రమలో అన్ని ఉన్నాయనుకుంటారని, కానీ ఏమీ ఉండవని వెల్లడించారు. సినిమా నటులకు డిప్రెషన్ సహజమని పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం సినిమాలు విడుదలవుతాయని, ఈ సమయంలో కొంత మందికి ఆనందం.. మరికొంత మందికి నిరాశ కలుగుతాయని చెప్పారు. ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి నివాళి అర్పించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకుని ఉదయ్ కిరణ్ 100 శాతం తప్పు చేశాడని శివాజీరాజా అన్నారు. కెరీరెలో ఎంతో సాధించిన అతడు ఇలా చేయడం తనకు చాలా బాధ కలిగించిందని పేర్కొన్నారు. యువతకు సందేశాలిచ్చిన సినిమాల్లో నటించిన అతడు ప్రాణాలు తీసుకోవడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. దయచేసి ఎవరూ ఇలా చేయొద్దని కోరారు. మన కష్టాలు, సుఖాలు పంచుకునే మంచి స్నేహితులను సంపాదించుకుంటే ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడాల్సిన రాదన్నారు. -
ఫిల్మ్ ఛాంబర్ కు ఉదయ్ కిరణ్ భౌతికకాయం
హైదరాబాద్ : సినీ నటుడు ఉదయ్ కిరణ్ భౌతికకాయాన్ని ఈరోజు ఉదయం నిమ్స్ ఆసుపత్రి నుంచి శ్రీనగర్ కాలనీలోని ఆయన నివాసం జ్యోతి హోమ్స్ అపార్ట్‌మెంట్‌కు తరలించారు. అనంతరం అభిమానుల సందర్శనార్ధం ఉదయ్‌కిరణ్ పార్థివదేహాన్ని ఫిలించాంబర్ కు తరలించారు. ఉదయ్ ఆత్మహత్యతో భార్య విషత, సోదరి శ్రీదేవి, బావ, తండ్రి అభిమానులు దుఃఖంలో మునిగిపోయారు. ఈ రోజు సాయంత్రం ఎర్రగడ్డ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా అంతకు ముందు ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా పూజ నిర్వహించారు. -
నివ్వెరపోయిన అన్నవరం
ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య వార్త విని చలించిన ఆలయవర్గాలు సత్యదేవుని సన్నిధిలో పెళ్లి జ్ఞాపకాలు గుర్తుచేసుకొన్న స్థానికులు 2012, అక్టోబర్ 24న విషితతో వివాహం అన్నవరం, న్యూస్‌లైన్ : సినీ హీరో ఉదయ్‌కిరణ్ మరణవార్త విని అన్నవరం ఉలిక్కిపడింది. సత్యనారాయణస్వామి సన్నిధిలో విషితతో వివాహం జరిగి రెండేళ్లు కూడా కాకుండానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త పలువురిని కలచివేసింది. సోమవారం ఉదయం నుంచి ఈ వార్త చానళ్లలో వస్తుంటే దేవస్థానం వర్గాలే కాదు, గ్రామస్తులు కూడా నివ్వెరపోయారు. ‘వివాహం నిన్న కాక మొన్న జరిగినట్టు ఉంది. ఇంతలోనే ఇలా జరిగిందేమిటి పాపం’ అని బాధపడ్డారు. ఆర్భాటం లేకుండానే వివాహం సెలబ్రిటీల వివాహాలు రత్నగిరిపై ఆర్భాటంగానే జరుగుతాయి. కానీ అందుకు భిన్నంగా, ఎటువంటి హంగామా లేకుండా 2012, అక్టోబర్ 24 (విజయదశమిరోజు)న జరిగింది సినీహీరో ఉదయ్‌కిరణ్ వివాహం. తన ప్రేమికురాలు, విషితను ఆయన ఆరోజు తెల్లవారుజామున వివాహం చేసుకున్నారు. ఆ రోజు వరకూ దేవస్థానంలో కూడా ఈ వివాహం గురించి ఎవరికీ తెలియదు. ఆ రోజు ఉదయం వివాహ మంటపానికి సంప్రదాయ వివాహ వస్త్రధారణతో ఉదయ్‌కిరణ్ విచ్చేయడంతో ఒక్కసారిగా ఈ వివాహం గురించి అందరికీ తెలిసింది. ఆయనను చూసేందుకు ఎక్కువమంది అభిమానులు, భక్తులు వచ్చారు. అప్పుడు కూడా తాను జైశ్రీరామ్ షూటింగ్లో ఉన్న గెటప్‌తోనే కనిపించారు. రాత్రి పది గంటలకు విషిత, ఉదయ్‌కిరణ్‌లు బంధుమిత్రుల సమక్షంలో దండలు మార్చుకున్నారు. తెల్లవారుజామున సత్యదేవుని సన్నిధిలో వివాహం శాస్త్రోక్తంగా జరిగింది. నవదంపతులు ఉదయం సత్యదేవుని వ్రతమాచరించారు. అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ వివాహానికి సినీ పరిశ్రమ నుంచి కూడా చాలా తక్కువ మంది హాజరయ్యారు. హీరో అల్లరి నరేష్ మాత్రమే పెళ్లికి వచ్చినవారిలో చెప్పుకోతగిన వ్యక్తి. వివాహం సమయంలో ఉదయ్‌కిరణ్ విలేకర్లతో మాట్లాడుతూ... ఈ వివాహంతో తనకు మళ్లీ స్టార్డమ్ వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విషిత మాట్లాడుతూ కేవలం ఆయన సినీహీరో అని తాను వివాహం చేసుకోలేదని, ఆయన మంచితనం తెలుసుకున్నానని అందుకే వివాహం చేసుకున్నానని తెలిపారు. ఏమైనా పెళ్లయి రెండేళ్లూ కూడా నిండకుండానే ఉదయ్‌కిరణ్ తనువు చాలించడం స్థానికంగా చాలామందిని కలచివేసింది. -
నటుడు ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలు
-
అందరూ ఉన్నా అనాధగా.. !
-
ఉదయ్ కిరణ్ అత్తమామలను ప్రశ్నించిన పోలీసులు
హైదరాబాద్ : ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి అతని అత్తమామలను పోలీసులు విచారించారు. వారితో పాటు ఉదయ్ కిరణ్ నివాసం ఉంటున్న శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని ఇద్దరు వాచ్మెన్లను ప్రశ్నించారు. మరోవైపు క్లూస్ టీమ్ కూడా ఉదయ్ కిరణ్ నివాసంలో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సెల్‌ఫోన్‌తో పాటు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ చివరిసారిగా చెన్నైకి చెందిన భూపాల్ అనే వ్యక్తితో మాట్లాడినట్లు సమాచారం. అలాగే భార్య విషితకు ఐ లవ్ యూ అంటూ మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. గత మూడేళ్లుగా ఉదయ్ కిరణ్ కుటుంబం ఇక్కడే నివాసం ఉంటుందని అదే అపార్ట్మెంట్ నివాసి శ్రీనివాస్ తెలిపారు. ఉదయ్ కిరణ్ భార్య, అత్త, మామ రాత్రి 12 గంటల సమయంలో వచ్చారని, పెద్దగా ఏడుపులు వినిపించాయని, తాను వెళ్లేసరికి విషిత ఏడుస్తున్నట్లు తెలిపారు. లోనికి వెళ్లి చూసేసరిక ఉదయ్ కిరణ్ ఉరి వేసుకుని ఉన్నారని, వెంటనే 108కి సమాచారం అందించినట్లు శ్రీనివాస్ చెప్పారు. కుటుంబ కలహాలు లేవనే తాను అనుకుంటున్నానని, ఉదయ్ కిరణ్ దంపతులు అన్యోన్యంగానే ఉంటున్నారని తెలిపారు. గత రెండేళ్లుగా వారి కుటుంబం గురించి తనకు తెలుసునని ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో...ఉదయ్‌కిరణ్ భార్య ఇంట్లో లేరన్నారు. ఫోన్ కాల్స ఎత్తకపోవటంతో వాళ్లకు అనుమానం వచ్చి ఇంటికి వచ్చినట్లు తెలిపారు. కాగా ఉదయ్ కిరణ్ మృతిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
'సినీ పరిశ్రమను రెండు కులాలు శాసిస్తున్నాయి'
హైదరాబాద్: సినీ పరిశ్రమలో వర్థమాన నటులు కనుమరుగవడానికి కులాధిపత్యమే కారణమని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం ఆరోపించింది. తెలుగు సినీ పరిశ్రమను రెండు కులాలు శాసిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఆరోపించారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉదయ్ కిరణ్ కొంత మంది పెద్దలు తొక్కేసారని ఆరోపించారు. ఉదయ్‌కిరణ్ ఈ దుస్థితికి రావడానికి కారణమైనవారేవరో రాష్ట్రప్రజలందరికి తెలుసునని అన్నారు. కాగా, ఉదయ్ కిరణ్ భౌతికకాయాన్ని అగ్ర హీరోలెవరూ సందర్శించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉదయ్ కిరణ్ భౌతికకాయాన్ని పట్టించుకునేవానే కరువయ్యారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నింగికెగసి.. నేలకు జారి...
తెలుగు చిత్ర సీమలోకి అనూహ్యంగా దూసుకొచ్చిన యువ కిరణం కనుమరుగయింది. ఇక సెలవంటూ కానరాని లోకాలకు తరలిపోయింది. రంగుల ప్రపంచంలోని చీకట్లను బట్టబయలు చేస్తూ బాధగా నిష్ర్రమించింది. 'హ్యాట్రిక్ హీరో'గా జేజేలు అందుకున్న చోటే వెక్కిరింపులు పలకరించడంతో నిశ్శబ్దంగా తనువు చాలించింది. 'లవర్ బాయ్'గా అభిమానులను అలరించిన యువ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అభిమానులను, సన్నిహితులను శోక సాగరంలో ముంచి తన దారి తాను చూసుకున్నాడు. ఎవరి అండ లేకుండా 2000వ సంత్సరంలో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ మూడు వరుస విజయాలతో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే సినిమాలతో హిట్ కొట్టారు. హ్యాట్రిక్ విజయాలతో ఉదయ్ కిరణ్ పేరు మార్మోగింది. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేశాడు. ప్రేమకథా చిత్రాలకు చిరునామాగా నిలిచిన ఉదయ్ కిరణ్‌కు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా మహిళలు అతడిని విపరీతంగా అభిమానించారు. కమల్ హాసన్ తర్వాత చిన్న వయసులో ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు ఉదయ్. ఎంత వేగంగా అగ్రస్థానానికి చేరుకున్నాడో అంతే వేగంగా కిందకి పడిపోయాడు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మూడేళ్ల తర్వాత అతడి పతనం ఆరంభమయింది. స్టార్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో ఓ అగ్ర నటుడు తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు ముందుకు వచ్చాడు. అయితే అనుకోని కారణాలతో ఈ పెళ్లి జరగకపోవడంతో ఉదయ్ కిరణ్ సినిమా కెరీర్ పట్టాలు తప్పింది. అగ్ర హీరోకు భయపడి అతడికి ఎవరూ అవకాశాలు ఇవ్వరాలేదు. అడపా దడపా చేసిన సినిమాలు పరాజయాలు చవిచూడడంతో అతడి ప్రభ తగ్గింది. తమిళంలో చేసిన సినిమాలు ఆదుకోలేకపోయాయి. కెరీర్ లో చేసిన 19 సినిమాల్లో మొదటి మూడు సినిమాలే హిట్‌గా నిలిచాయి. కెరీర్ పతనం, తల్లి మరణం, తండ్రితో కలహాలు అతడిని ఉక్కిరి బక్కిరి చేశాయి. చిన్న వయసులో వచ్చిన స్టార్‌డమ్‌ను నిలుపుకునేందుకు అతడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సినిమా అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో తన ఇంటికే పరిమితమయ్యాడు. ఎవరూలేని సమయం చూసి ప్రాణాలు తీసుకున్నాడు. జీవితంలో తనకెదురైన ఎదురుదెబ్బలను సమర్థవంతంగా కాచుకున్న ఈ యువ హీరో ఒక్క క్షణం ఆలోచించివుంటే ఇంత దారుణానికి ఒడిగట్టేవాడు కాదు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు. గెలుపోటములు జీవితంలో సహజం. కాలం కలిసిరానంత మాత్రాన కడతేరిపోవడం న్యాయం కాదు. బతికుంటే ఎప్పుడైనా సాధింవచ్చన్న వాస్తవాన్ని గుర్తించాలి. ముఖ్యంగా సినిమా రంగంలో కొనసాగే యువత ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. -
నిమ్స్ మార్చరీకి ఉదయ్ కిరణ్ మృతదేహం
హైదరాబాద్ : సినీనటుడు ఉదయ్ కిరణ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. ఉస్మానియా వైద్యులు పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని నిమ్స్ మార్చరీకి తరలించారు. అయితే మార్చరీకి తాళం వేసి ఉండటంతో సుమారు 20 నిమిషాల పాటు మృతదేహాన్ని బయటే ఉంచారు. కాగా ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు మంగళవారం పంజాగుట్ట స్మశాన గుట్టలో జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా అతని సోదరి మస్కట్ నుంచి ఈరోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్నారు. అనంతరం అంత్యక్రియలపై ఓ స్పష్టత రానుంది. ఉదయ్ కిరణ్ రాత్రి 12:15 నిమిషాలకు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఉదయ్ కిరణ్ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని మానవ హక్కుల కమిషన్‌లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఇక ఉదయ్ కిరణ్ అంత్యక్రియలపై సందిగ్దత నెలకొంది. అతని కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోకపోవటంపై అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఉదయ్ కిరణ్ తండ్రికాని, భార్య విషిత కుటుంబ సభ్యులు కానీ, మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు రాకపోవటంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరోకి ఇలాంటి దుస్థితి రావటం బాధాకరమన్నారు. -
'సినిమావాళ్ల మీద పడ్డాడు... దేవుడు'
హైదరాబాద్ : కష్టాల్లో ఉన్నప్పుడు చిత్రసీమలో ఆదుకునేవారు దిక్కుండరని క్యారెక్టర్ నటి పావలా శ్యామల ఆవేదన వ్యక్తంచేశారు. ఉదయ్ కిరణ్ అకాల మరణం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక ఒత్తిడిని అధిగమించలేక..తాను కూడా ఒకప్పుడు ఆత్మహత్యనే శరణ్యమని భావించానని ఆమె అన్నారు.... ఎవరైనా సరే చనిపోయాక అయ్యో అంటారే కానీ, బతికి ఉన్నప్పుడు ఒక్కరూ అండగా ఉండరన్నారు. ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే ఆత్మహత్య చేసుకుంటాడో అర్థం చేసుకోవచ్చన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండేవారంటే బాగుండేదన్నారు. మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ....ఉదయ్ కిరణ్,తాను అయిదారు చిత్రాలు కలిసి చేశామన్నారు. శ్రీరాం సినిమా షూటింగ్ సమయంలో కోఠీలో షూటింగ్ సమయంలో తన ఇంట్లో ఉండేవాడన్నారు. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారన్నారు. నర్సింగ్ అన్నా... నర్సింగ్ అన్నా అని మాట్లాడేవాడని తెలిపారు. ఈ మధ్య కాలంలో దేవుడు....సినిమా వాళ్ల మీద పడ్డాడని, మంచివాళ్లనే తీసుకు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కొద్ది రోజుల క్రితం శ్రీహరి, ఆతర్వాత ధర్మవరపు సుబ్రహ్మణం, ఇప్పుడు ఉదయ్ కిరణ్ మృతి కలిచి వేస్తుందన్నారు. -
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి ఉదయ్ కిరణ్ కళ్లు దానం
-
కుటుంబ కలహాలు లేవు: విషిత తండ్రి
హైదరాబాద్ : తమ మధ్య ఎలాంటి కుటుంబ కలహాలు లేవని విషిత తండ్రి, ఉదయ్ కిరణ్ మామ గోవింద రాజన్ తెలిపారు. ఆయన తన అల్లుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉదయ్ కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావటం లేదన్నారు. అతనికి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని, అయితే చిత్ర పరిశ్రమలో తాను ఒంటరి అనే బాధపడుతు ఉండేవన్నారు. కెరీర్ విషయంలో ఉదయ్ కిరణ్ చాలారోజులుగా నిరాశా నిస్పృహలతో ఉన్నాడని తెలిపారు. భార్యా భర్తలు అన్న తర్వాత చిన్న చిన్న వివాదలు సాధారణమని, అవి గొడవలు అనలేమని గోవింద రాజన్ అన్నారు. ఉదయ్ కిరణ్-విషిత మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునే ఆలోచనలో ఉన్నాడని తెలిస్తే తాము అతన్ని ఒంటరిగా వదిలి వెళ్లేవాళ్లమే కాదని ఆయన తెలిపారు. అప్పటివరకూ అందరం కలిసే సినిమా చూశామని, ఆతర్వాత బర్త్‌డే పార్టీకి వెళ్లినట్లు చెప్పారు. ఉదయ్ కిరణ్‌కు గతంలో అతని తండ్రితో ఏవో గొడవలు ఉండేవని గోవింద రాజన్ తెలిపారు. కాగా ఉదయ్ కిరణ్ తండ్రి మూర్తి .... రెండో పెళ్లి చేసుకోవటంతో గత ఆరేళ్ల నుంచి వారి మధ్య సంబంధాలు లేవు. మరోవైపు ఉదయ్ కిరణ్ మూడు రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదని సమాచారం. -
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి ఉదయ్ కిరణ్ కళ్లు దానం
హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న సినినటుడు ఉదయ్ కిరణ్ నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి దానం చేశారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు సోమవారం ఉదయం ఉదయ్ కిరణ్ నేత్రాలలోని రెటీనాను సేకరించారు. మరోవైపు ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అపోలో ఆస్పత్రి నుంచి ఉస్మానియాకు తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అర్థాంతరంగా తనువు చాలించిన ఉదయ్ కిరణ్... తన కళ్లు మాత్రం వేరొకరికి చూపునిచ్చేలా సజీవంగా నిలిచాడు. -
బతకాలని లేదంటూ.... పలుమార్లు!
-
బతకాలని లేదంటూ.... పలుమార్లు!
హైదరాబాద్ : తనకు బతకాలని లేదంటూ ఉదయ్ కిరణ్ తన భార్య విషితతో పలుమార్లు అన్నట్లు సమాచారం. రెండు వారాల క్రితం నుంచి అతను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయ్ కిరణ్ మూడ్ మార్చేందుకు విషిత ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో విషిత ఈ విషయాన్ని వెల్లడించింది. నూతన సంవత్సర వేడుకలను బెంగళూరులో జరుపుకున్నామని, జనవరి 2న హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు ఆమె తెలిపింది. సినిమాల్లో అవకాశాలు రాలేదని... ఉదయ్ కిరణ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు, దానితో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని విషిత పోలీసులు తెలియచేసింది. ఉదయ్ కిరణ్ 2012లో అక్టోబర్ 24న విషితను వివాహమాడాడు. ఏది ఏమైనప్పటికి టాలీవుడ్ చాక్లెట్ బాయ్ ఉదయ్ కిరణ్ ఇకలేడు. అందరినీ దుఃఖ సాగరంలో ముంచి కన్నుమూశాడు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఉరేసుకుని చనిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అతను ఇప్పటివరకు మొత్తం 19 సినిమాల్లో నటించాడు. అందులో 16 తెలుగు, 3 తమిళ సినిమాలు ఉన్నాయి. ఉదయ్ కిరణ్ చివరి చిత్రం జై శ్రీరాం.. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం ఉదయ్‌కిరణ్ దిల్ కబడ్డీ అనే తెలుగు, వంబు సదాయి అనే తమిళ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. -
'ఉదయ్ చాలా పెద్ద తప్పు చేశాడని పిస్తోంది'
హైదరాబాద్: ఉదయ్ కిరణ్ చనిపోయాడంటే నమ్మడం చాల కష్టంగా ఉందని సంగీ దర్శకుడు, నటుడు, దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్పారు. పెళ్లి తర్వాత ఆయన జీవితం ఎలా ఉందనేది తనకు తెలియదన్నారు. ఆయనకు చాలా మంది అభిమానులున్నారని తెలిపారు. అభిమానులు తనకు ఫోన్ చేసి ఉదయ్ కిరణ్ గురించి అడుగుతుంటారని చెప్పారు. ఆత్మహత్య చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాడని పిస్తోందని అభిప్రాయపడ్డారు. తనకున్న అభిమానులకు అన్యాయం చేశాడని ఆర్మీ పట్నాయక్ అన్నారు. ఒక్క క్షణం ఆలోంచివుంటే ఉదయ్ కిరణ్ బతికివుంచేవాడని నటుడు దువ్వాసి మోహన్ పేర్కొన్నారు. -
ఐ లవ్ యూ అంటూ ఉదయ్ కిరణ్ చివరి మెసేజ్
హైదరాబాద్ : సినీనటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునే ముందు భార్య విషితకు 'ఐ లవ్ యూ టూ' అంటూ చివరి మెసేజ్ పంపినట్లు సమాచారం. ఇక ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ అతని నివాసానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. మృతదేహంపై ఉరి వేసుకున్నట్లు గుర్తులు ఉన్నాయన్నారు. ఘటనా స్థలంలో ఉదయ్ కిరణ్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉరి వేసుకున్న తాడుతో పాటు, కళ్లజోడు, స్లిప్పర్స్ స్వాధీనం చేసుకున్నట్లు క్లూస్ టీమ్ అధికారులు తెలిపారు. ఉదయ్ కిరణ్ తన భార్యకు ఐ లవ్ యూ టూ అంటూ మెసేజ్‌ను పంపించినట్లు తెలుస్తుందన్నారు. కాల్ డేటాను పరిశీలిస్తున్నామని, పోస్ట్‌మార్టం నివేదిక రావల్సి ఉందన్నారు. మరోవైపు ఉదయ్ కిరణ్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్ ఏసీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ తీవ్ర డిప్రెషన్లో ఉన్నాడని, నెలరోజులుగా పరిస్థితులు బాగోలేదంటూ విచారణలో వెల్లడి అయ్యిందన్నారు. కెరీర్ సరిగా లేనందున తనకు చనిపోవాలని ఉందంటూ పదే పదే ఉదయ్ అనేవాడిన భార్య విషిత చెప్పినట్లు ఏసీపీ తెలిపారు. అవకాశాలు రాకపోవటంతో నిరాశకు లోనయ్యేవాడని విషిత వెల్లడించిందన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియాకు తరలిస్తున్నామన్నారు. -
'ఆరేళ్ల నుంచి ఉదయ్ కిరణ్‌తో మాటలు లేవు'
హైదరాబాద్: తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఉదయ్ కిరణ్ తండ్రి వివికే మూర్తి అన్నారు. కుమారుడి మరణవార్త విని ఆయన దిగ్భాంతికి గురయ్యారు. ఉదయ్ కిరణ్ మరణవార్తను ఆయనకు 'సాక్షి' తెలియజేసింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనుక ఏదో బలమైన కారణం ఉందన్నారు. హైదరాబాద్‌లో అతడికి కోట్ల రూపాయలు ఆస్తులున్నాయని తెలిపారు. చనిపోయి చేసేది ఏమీ లేదని బతికివుంటే ఎప్పటికైనా జీవితంలో పైకి రావొచ్చని అన్నారు. అయితే ఆరేళ్ల నుంచి ఉదయ్ కిరణ్‌తో మాటలు లేవని మూర్తి వెల్లడించారు. అతడి ఆస్తిని దుర్వినియోగం చేస్తున్నాననే అనుమానంతో తనను దూరం పెట్టాడని తెలిపారు. అప్పటి నుంచి తనకు దూరంగా ఉంటున్నాడని చెప్పారు. పెళ్లి చేసుకున్నట్టే తనకు చెప్పలేదన్నారు. తనకు తెలినంతవరకు అతడికి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్నారు. విదేశాల నుంచి తన కూతురు రాగానే ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని చూడడానికి వెళతానని చెప్పారు. -
షాక్‌కు గురయ్యా: దర్శకుడు తేజ
హైదరాబాద్ : ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వార్త విని షాక్‌కు గురైనట్లు దర్శకుడు తేజ తెలిపారు. ఈ విషయాన్ని ఓ స్నేహితుడు తనకు ఫోన్ చేసి చెప్పాడని, ఆ వార్త నిజం కాకపోతే బాగుండు అనుకున్నానన్నారు. ఉదయ్ కిరణ్‌ను చివరగా అతనిని పెళ్లిలో చూశానని ...చాలా సంతోషంగా ఉన్నాడని తేజ తెలిపారు. తనను కలవాలని ఉదయ్ కిరణ్ అడిగితే.... కొంత సమయం తీసుకుందామని చెప్పానన్నారు. సినిమాలు లేకపోతే ఏ నటుడైనా డిప్రెషన్‌కు గురవుతారని, యాక్టర్లకు సినిమాలు తప్ప, మరేమీ తెలియదని తేజ అన్నారు. మీసాలు కూడా రాని ఉదయ్‌ను తానే చిత్ర పరిశ్రమకు పరిచయం చేశానని, చాలా మంచి వ్యక్తి అని, ఎవరికీ హాని చేసే మనస్తత్వం కాదని అన్నారు. తన కెరీర్‌కు బాగోనందున కొంత సమయం తీసుకుని...ఉదయ్ కిరణ్‌తో ఓ సినిమా చేద్దామనుకున్నానని, ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగిపోయిందన్నారు. కొద్ది రోజుల క్రితం ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోవటం...ఇప్పుడు ఉదయ్ మృతి బాధాకరమన్నారు. కాగా ఉదయ్ కిరణ్‌ను చిత్రపరిశ్రమలో తొక్కేసారా? లేదా అన్నది తనకంటే మీడియాకే బాగా తెలుసు అని...విలేకర్ల ప్రశ్నకు తేజ సమాధానం ఇచ్చారు. -
డిప్రెషనే కారణమా?
తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఏడాది ఆరంభంలోనే విషాదం అలముకుంది. గతేడాది పలువురు సీనియర్ నటులను పోగొట్టుకున్న టాలీవుడ్‌కు 2014 ఆరంభంలోనే విషాదం ఎదురయింది. యువ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలదొక్కున్న అతడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలియగానే అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భాంతి చెందారు. ఎన్నో ఎదురుదెబ్బలు తట్టుకున్న ఈ యువ నటుడు ఆకస్మింగా వెళ్లి పోవడం వెనుక బలమైన కారణాలున్నాయని అనుమానిస్తున్నారు. 'చిత్రం' సినిమాతో తెరం గ్రేటం చేసిన ఉదయ్ కిరణ్ అనతికాలంలోనే పెద్ద హీరోగా ఎదిగాడు. ఎవరి అండ లేనప్పటికీ వరుస హిట్ సినిమాలతో అగ్రతారగా వెలుగొందాడు. లవర్ బాయ్ పాత్రల్లో నటించి మెప్పించాడు. చిత్రం తర్వాత నువ్వునేను, మనసంతా నువ్వే సినిమాలతో అందరి మన్నలను అందుకున్నాడు. తారా పథంలో అయితే ఎంత త్వరగా ఎదిగాడో అంతే త్వరగా పడిపోయాడు. అయితే చిత్ర పరిశ్రమలో కొందరు అతడిని తొక్కేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు, సినిమా అవకాశాలు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఉదయ్ కిరణ్ బలవన్మరణానికి పాల్పడినట్టు చెబుతున్నారు. ఉదయ్ కిరణ్ పదేళ్ల వయసులోనే అతడి అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దికాలం క్రితం అతడి తల్లి మరణించారు. దీంతో అతడి తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారు. ఏడాది కాలంగా సినిమాలు లేకపోవడంతో ఉదయ్ కిరణ్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈమధ్య వచ్చిన ఓ తమిళ సినిమా కూడా చేజారిపోవడంతో, ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో వేరే దారిలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు నెత్తిన పెట్టుకున్న చిత్ర పరిశ్రమ తనను దూరం పెట్టడం అతడు జీర్ణించుకోలేకయాడు. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా తనకు హానీ చేయాలని చూసిన వారి పేర్లను అతడు ఏనాడు వెల్లడించలేదు. సున్నిత మనస్కుడిగా, నిగర్విగా పేరొందిన ఉదయ్ కిరణ్ ఎప్పుడు ఎవరిపై ఫిర్యాదు చేసిన దాఖలు లేవు. తన పనేదో తాను చూసుకుని వెళ్లిపోయే వాడు. అందరితో స్నేహంగా మెలిగే ఉదయ్ కిరణ్ ఇక లేడన్న నిజాన్ని అతడి సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటున్ని కోల్పోయిందని నివాళులు అర్పిస్తున్నారు. అయితే సినిమా ఫీల్డ్‌లో ఒడిదుడుకులు సహజమని, ధైర్యం కోల్పోవద్దని యువ నటులకు సీనియర్లు సూచిస్తున్నారు. -
ఉదయ్ లేడంటే జీర్ణించుకోలేకపోతున్నాం
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం యావత్ సిని పరిశ్రమను, అభిమానులను విషాదంలో నింపింది. ఎన్నో అద్భుత చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన లవర్‌బాయ్ ఇక లేడన్న వార్తను ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో, అందరితో కలివిడిగా ఉండే ఉదయ్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం దిగ్ర్భాంతికి గురిచేస్తోందని పలువురు సిని ప్రముఖులు అంటున్నారు. ఉదయ్ కిరణ్ మృతి జీర్ణించుకోలేకపోతున్నామని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చవి చూసిన అతను చిన్నవయసులోనే ప్రాణాలు తీసుకోవటం బాధాకరమన్నారు. చిన్నప్పటి నుంచి ఉదయ్ కిరణ్ తెలుసునని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. తన జీవితానికి సంబంధించి ఎదురుదెబ్బలను తట్టుకోగలిగాడన్నారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణమైనవారిని విచారించి కఠినంగా శిక్షించాలన్నారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ నటులు ఉదయ్ కిరణ్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. -
'ఉదయ్ కిరణ్ది అనుమానాస్పద మృతిగా గుర్తింపు'
హైదరాబాద్ : సినీనటుడు ఉదయ్ కిరణ్ (33) ఆత్మహత్యపై అతని భార్య విషిత పోలీసులుకు ఫిర్యాదు చేసింది. కాగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై పోలీసులు స్పందించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోందని ఏసీపీ అశోక్ కుమార్ తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు, కెరీర్ సరిగా లేకపోవటంతో మనస్తాపం చెందే ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి, ఇతర వివరాలు తెలుపుతామన్నారు. విచారణ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన అన్నారు. ఉదయ్ కిరణ్ సెల్‌ఫోన్, లాప్ టాప్ స్వాధీనం చేసుకున్నామని, సూసైడ్ నోట్ లాంటిది ఏమీ దొరకలేదన్నారు.