'ఎవరి బతుకు వారిని బతకనీయండి' | Nannapaneni rajakumari Demand for Probe on Uday Kiran Death | Sakshi
Sakshi News home page

'ఎవరి బతుకు వారిని బతకనీయండి'

Published Tue, Jan 7 2014 11:41 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM

'ఎవరి బతుకు వారిని బతకనీయండి'

'ఎవరి బతుకు వారిని బతకనీయండి'

హైదరాబాద్: యువ నటుడు ఉదయ్ కిరణ్ మరణంపై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు. ఉదయ కిరణ్ ఎలా మరణించాడనేది బాహ్య ప్రపంచానికి తెలియాలని అన్నారు. ఫిల్మ్ ఛాంబర్లో ఉదయ్ కిరణ్ భౌతిక కాయానికి ఆమె నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్వశక్తితో పైకొచ్చిన కుర్రాడి జీవితం ఇలా ముగియం బాధాకరమని పేర్కొన్నారు. ఉదయ్ కిరణ్ మరణం కలచివేసిందదన్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు వర్థమాన నటులను అగణదొక్కడం మానుకోవాలని హితవు పలికారు. ఎవరి బతుకు వారిని బతకనీయండి అంటూ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఉదయ్ కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కోరుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement