'ఉదయ్ కిరణ్ది అనుమానాస్పద మృతిగా గుర్తింపు' | Uday kiran ends life, Police probe suspicious death | Sakshi
Sakshi News home page

'ఉదయ్ కిరణ్ది అనుమానాస్పద మృతిగా గుర్తింపు'

Published Mon, Jan 6 2014 8:07 AM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM

'ఉదయ్ కిరణ్ది అనుమానాస్పద మృతిగా గుర్తింపు' - Sakshi

'ఉదయ్ కిరణ్ది అనుమానాస్పద మృతిగా గుర్తింపు'

హైదరాబాద్ : సినీనటుడు ఉదయ్ కిరణ్ (33) ఆత్మహత్యపై అతని భార్య విషిత పోలీసులుకు ఫిర్యాదు చేసింది.  కాగా ఉదయ్‌ కిరణ్ ఆత్మహత్యపై పోలీసులు స్పందించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోందని ఏసీపీ అశోక్ కుమార్ తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో పాటు, కెరీర్ సరిగా లేకపోవటంతో మనస్తాపం చెందే ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి, ఇతర వివరాలు తెలుపుతామన్నారు. విచారణ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన అన్నారు. ఉదయ్ కిరణ్ సెల్ఫోన్, లాప్ టాప్ స్వాధీనం చేసుకున్నామని, సూసైడ్ నోట్ లాంటిది ఏమీ దొరకలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement