obituary
-
ములాయం, కృష్ణ, కృష్ణంరాజులకు పార్లమెంట్ నివాళి
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల మరణించిన సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, టాలీవడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సహా తదితరులకు తొలుత లోక్‌సభ నివాళులర్పించింది. సంతాప సందేశం చదివిన తర్వాత సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అటు.. రాజ్యసభలోనూ వారికి నివాళులర్పించారు. మరోవైపు.. రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఒక రైతు బిడ్డ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి అయ్యారని కొనియాడారు. ఆయన సైనిక్ పాఠశాలలో చదువుకున్నారని, దీంతో అటు సైనికులకు, ఇటు రైతులకు వారధిగా మారానున్నారన్నారు. దేశంలో ఎంతో మందికి ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. అనేక బాధ్యతలను ధన్‌ఖడ్ సమర్థంగా నిర్వర్తించారని గుర్తు చేసుకున్నారు. ఇదీ చదవండి: జీ20 నాయకత్వం.. భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు గొప్ప అవకాశం: ప్రధాని మోదీ -
సైన్స్ శిఖరం.. పీఎమ్ భార్గవ
శాస్త్రీయ ఆలోచనలు శాస్త్రవేత్తలందరికి ఉంటాయనుకోవడం పొరపాటు. తాము చేసిన పరిశోధనలకు దైవ సహకారం ఉందని బహిరంగంగా ప్రకటించుకునే శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఇస్రో ఉపగ్రహాలని అంతరిక్షములోకి పంపించే ముందు, తర్వాత కూడా విధిగా మన శాస్త్ర వేత్తలు పూజలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ నిల్వ చేసే పెట్టెలకు కూడా పూజలు చేసే వాటిని ఓపెన్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో శాస్త్రీయ దృక్పథంని కల్గి ఉండటమే కాకుండా, సైన్స్ పరిశోధనల విషయంలో పాలకులు తీసుకునే నిర్ణయాలని ఎప్పటికప్పుడు సహేతుకంగా విమర్శించకల్గిన అతి కొద్దిమంది శాస్త్రవేత్తలలో పీఎమ్ భార్గవ ఒకరు. భార్గవ వంటి వ్యక్తిత్వం కల్గిన శాస్త్రవేత్తలు నేడు అరుదుగా కనిపిస్తున్నారు. ఫిబ్రవరి 22, 1928న రాజస్థాన్‌లోని ఆజ్మీర్లో రామచంద్ర భార్గవ, గాయత్రి భార్గవ దంపతులకు జన్మించారు. ‘జన్యు ఇంజనీరింగ్’ అనే పదాన్ని ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. భారతదేశంలో ఆధునిక జీవశాస్త్రం వాస్తుశిల్పిగా ఆయన ప్రసిద్ధి చెందారు. 70లలో బయోటెక్నాలజీ విభాగం ఏర్పాటులో భార్గవ ముఖ్య పాత్ర పోషించారు. హైదరాబాద్ లోని సంభావన ట్రస్ట్, భోపాల్‌లో బేసిక్ రిసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ డెవెలప్మెంట్ సొసైటీ, న్యూఢిల్లీలోని మెడికల్లీ ఎవేర్ అండ్ రెస్పాన్సిబుల్ పీపుల్స్ వంటి పలు సంస్థలకు చైర్మన్‌గా కూడా ఆయన ఉన్నారు. 2005 నుండి 2007 వరకు నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వైస్ ఛెర్మైన్‌గా కూడా పనిచేశారు. భార్గవ 100 వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గౌరవాలను, అవార్డులను అందుకున్నారు. అలాగే 1986లో ఆయన ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 1998లో లెజియన్ డి హొన్నూర్తో తనను సత్కరించారు. ఇలా ఎన్నో కీర్తి పురస్కారాలను ఆయన అందుకున్నారు. జాతి గర్వించే స్థాయికి ఎదిగారు. ఆయన వివిధ సందర్భాలలో వేలాది ఉపన్యాసాలు ఇచ్చారు, 550 మంది ప్రముఖుల వ్యాసాల సంపుటి, ఆరు పుస్తకాలు కూడా వెలువరించారు. హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థకి వ్యవస్థాపక డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఈ సంస్థ వల్లే హైదరాబాద్ బయోటెక్నాలజీ రంగంలో అంతర్జాతీయంగా పేరు పొందింది. భారతదేశంలో జన్యుమార్పిడి పంటలని వేగంగా, ఎలాంటి శాస్త్రీయ పరిశోధన లేకుండా ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకించారు. ఈ పంటలు అధిక దిగుబడినిస్తాయి గానీ, వాటిలో పోషక విలువలు ఉండవని తెలిపారు. జ్యోతిష్యం అశాస్త్రీయం అని ఆయన తెలిపారు. హైకోర్టులో వ్యాజ్యం కూడా వేశారు. భోపాల్ గ్యాస్ బాధితులకు అండగా నిలిచారు. దేశంలో పెరుగుతున్న అసహనానికి నిరసనగా ఆయన పద్మభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చారు. బయోటెక్నాలజీని వ్యాపారకోణంలో ఉపయోగించడానికి ఆయన అంగీకరించలేదు. ఆయనని ఆధునిక భారతదేశ జీవశాస్త్రపిత అని కూడా పిలుస్తారు. సైన్స్ ఫలాలు పేదవారికి అందాలనేది ఆయన ఆశయం. జనవిజ్ఞాన వేదిక లాంటి సైన్స్ ప్రచార సంస్థలతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన 2017 ఆగస్ట్ 1న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం సైన్స్ ఉద్యమానికి తీరనిలోటు. - ఎమ్. రామ్‌ప్రదీప్, జనవిజ్ఞానవేదిక, తిరువూరు మొబైల్: 94927 12836 -
బతికి ఉండగానే యానివర్సరీ పోస్టు!
చైన్నై: ఓ వ్యక్తి తన డెత్ యానివర్సరీ కోసం రాసుకున్న పోస్ట్ వైరలైంది. ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూ కంటతడి పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే చెన్నైకు చెందిన ఇజ్జి కె ఉమామహేష్ శుక్రవారం మృతిచెందగా తన మరణానంతరం ప్రకటనల్లో ప్రచురించాల్సిన అంశాలను ముందుగానే రాసి పెట్టుకున్నారు. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు పత్రికలతో పాటు ఉమామహేష్ ఫేస్బుక్ అకౌంట్లో ప్రచురించగా నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అతను ఏం రాశాడంటే.. తాను తన నియమాలకు అనుగుణంగా సమాజంలో మతరహిత పౌరునిగా జీవించినట్టు తెలిపారు. రీసైకిల్డ్ టీనేజర్‌గా, రేస్ రన్నర్‌గా, హౌస్‌మేకర్‌గా, పార్టీ హోస్ట్‌గా, ఫిల్మ్ యాక్టర్‌గా, రేషనలిస్ట్‌గా, హ్యూమనిస్ట్‌గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్టు వివరించారు. జీవితం పార్టీలాంటిదని, ఎవరికైనా టైమ్ అయిపోతుందని, ఉన్నంతకాలం హ్యాపీగా జీవించాలని సూచించాడు. కాగా తనను తాను వాహనంగా పోల్చుకుంటూ తనలోని కొన్ని భాగాలు పని చేయడం లేదని, రిపేర్ చేసినప్పటికీ ఫలితం లేదని పేర్కొన్నాడు. తన మరణానంతరం ఉపయోగపడే భాగాలను మరొకరికి డొనేట్ చేయాలని కోరాడు. అవయవదానం చేయాలనే ఉమామహేష్ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఫెర్నాండెజ్ మృతి పట్ల ఎంపీ వినోద్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ మృతి పట్ల కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ సం తాపం ప్రకటించారు. సోషలిస్ట్ ఉద్యమంలో ప్రముఖ నాయకుల్లో ఒకరిగా, జనతాదళ్ నాయకుడిగా, వాజ్‌పేయి హయాంలో రక్షణ, రైల్వే, సమాచార శాఖలను ఫెర్నాండెజ్ సమర్థవంతంగా నిర్వర్తించారన్నారు. ఫెర్నాండెజ్ కుటుంబ సభ్యులకు వినోద్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
ఎడిటర్‌కు సంతాపం
కొరాపుట్ ఒరిస్సా: జమ్ము-కాశ్మీర్ సీనియర్ జర్నలిస్ట్, రైజింగ్ కశ్మీర్ ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ సయ్యద్ షుజాత్ బుఖారిని గురువారం ఉగ్రవాదులు దారుణంగా హత్య చేసిన సంఘటనను ఖండిస్తూ, కొరాపుట్ ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యులు శుక్రవారం సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల మౌనం పాటించారు. సమావేశంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు భవానీ శంకర్ మిశ్రా, సీనియర్ జర్నలిస్ట్ కీర్తిచంద్ర సాహులు మాట్లాడుతూ దేశంలో మీడియా ప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఎప్పటికప్పడు దేశంలో ఎక్కడో ఒకచోట నిత్యం జర్నలిస్టులు దాడులు, హత్యలకు బలవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధంగా స్పందించడం లేదని ఆరోపించారు. సమాజ శ్రేయస్సు కోరి పనిచేస్తున్న జర్నలిస్టుల ప్రాణ రక్షణకు తగిన చట్టం తీసుకు రావలసిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. ఇటువంటి దుశ్చర్యలను దేశంలో గల మీడియా ప్రతినిధులంతా ఏకమై ప్రతిఘటించాలని కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని ఉద్దేశించిన మెమొరాండాన్ని ప్రెస్‌క్లబ్ తరఫున శనివారం కొరాపుట్ కలెక్టర్‌కు అందచేసేందుకు నిర్ణయించారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యులు డి.శంకర రావు, విద్యా చౌదరి, రంజన్ దాస్,ఘనశ్యాం రథ్, జితు మిశ్రా, సత్యనారాయణ పండా తదితరులు పాల్గొన్నారు. -
రేపు చెరుకులపాడు నారాయణరెడ్డి సంతాపసభ
వెల్దుర్తి రూరల్ : వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్, దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సంతాపసభ బుధవారం నిర్వహించనున్నారు. చెరుకులపాడు గ్రామంలో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా జీ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. సంతాపసభ రోజునే నారాయణరెడ్డి వైకుంఠ సమారాధన నిర్వహిసా్తమని చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నారాయణరెడ్డికి నివాళులర్పించాలని కోరారు. -
అమ్మకు ఘననివాళి
► వేలూరు, తిరువణ్ణామలైల్లో పార్టీలకతీతంగా జన నివాళి ► అమ్మ మరణవార్తతో భావోద్వేగానికి గురైన మహిళలు వేలూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మృతికి పార్టీలకతీతంగా వ్యాపారులు, ప్రజలు, కార్యకర్తలు నివాళుర్పించారు. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి మృతి చెందారనే విషయం తెలుసుకున్న ఆమె అభిమానులతో పాటు రాష్ట్ర ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. ఇక , మంగళవారం కూడా టీవీల ముందు నుంచి వారు లేవలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ బయటకు వెళ్లకుండా టీవీల్లో ప్రచారమయ్యే అమ్మ అంత్యక్రియలు తదితర వాటిని చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలాఉండగా, వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని వాడ వాడల అమ్మ చిత్ర పటాలను ఉంచి కార్యకర్తలు, అభిమానులు, వ్యాపారులు పార్టీలకతీతంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేలూరు పాత కార్పొరేషన్ కార్యాలయం ఎదుట అన్నాడీఎంకే కార్యకర్తలు అమ్మ చిత్ర పటాన్ని ఉంచి నివాళులు అర్పించారు. వేలూరు నేతాజీ మార్కెట్లో పూల వ్యాపారుల ఆధ్వర్యంలో సుమారు 500 కిలోల పుష్పాలతో అమ్మకు నివాళుర్పించారు. ఈ నేపథ్యంలో కాట్పాడి, ఆంబూరు, వానియంబాడి ప్రాంతాల్లో పెద్ద పెద్ద టీవీలను ఏర్పాటు చేశారు. అలాగే, కాంగ్రెస్, తామాకా తదితర పార్టీల కార్యకర్తులు అమ్మకు నివాళుర్పించారు. ప్రతి ఇంట్లోనూ అమ్మ చిత్ర పటాలను ఏర్పాటుచేసి నివాళుర్పించడం గమనార్హం. ప్రతి ఇంటికీ ఫలాలు అమ్మవల్లనే వేలూరు: ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత వల్లనే తమ ఇళ్లకు సంక్షేమ ఫలాలు చేరాయని మహిళలు అంటున్నారు. వేలూరు సమీపంలోని సత్వచ్చారికి చెందిన రాణి మాట్లాడుతూ అమ్మ వల్లనే తమ పిల్లలకు ల్యాప్‌ట్యాప్‌లు వచ్చాయన్నా రు. తమ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అనేక సదుపాయాలను అమ్మ కల్పించిందన్నారు. రాష్ట్రంలోని మహిళలకు గౌరవాన్ని తీసుకొచ్చిన ఏకై క నాయకురాలు అమ్మ ఒక్కరే అటూ అమ్మను కొనియాడారు. జీవితాంతం రుణపడి ఉంటాం కూలీ పనులు చేసుకుంటున్న తమ లాంటి పేదవాళ్లకు సీమంతం జరి పించి పుట్టింటి వరస తరహాలో అన్ని తాంబూలాలు అందించిన అమ్మకు జీవితాంతం రుణపడి ఉంటామని వానియంబాడికి చెం దిన సమీనా బేగం తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ఇస్లామియులకు ప్రత్యేక స్థానం కల్పించడంతో అమ్మ జయలలిత ఎనలేని కృషి చేశారని కొనియాడారు. గర్భిణీలకు సీమంతం జరిపించడంతో పాటు ఫల పుష్పాదులను అందించి పుట్టింటి స్థానాన్ని భర్తీ చేశారని ఆమె కంటడి పెట్టుకున్నారు. - సమీనాబేగం, వానియంబాడి -
తమ్ముడి మరణవార్త విని అన్న హఠాన్మరణం
అయ్యంగారిపల్లె (పాలకుర్తి) : కలగోలుపుగా ఉండే తమ్ముడి మరణవార్త విని అన్న హఠాన్మరణం పొందిన సంఘటన మండలంలోని అయ్యంగారిపల్లెలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని ఈరవెన్నులో కాసోజు లక్ష్మీనర్సయ్య(70) ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయమై అయ్యంగారిపల్లెలో ఉంటున్న అన్న రామనర్సయ్య(80)కు బంధువులు సమాచారం అందించారు. అయితే తమ్ముడి మరణవార్త విన్న అన్న హఠాన్మరణం పొందాడు. దీంతో రెండు గ్రామాల్లో విషాదం అలుముకుంది. -
ప్రవాస భారతీయుల సంతాపం
వివిధ రాష్ట్రాల్లో స్మృతి చిహ్నాల ఏర్పాట్లకు కృషి వాషింగ్టన్: కలాం మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని ప్రవాస భారతీయులు, భారతీయ సంఘాలు తీవ్ర సంతాపం వ్యక్తంచేశాయి. కలాం నిరాడంబరత, నిగర్వశీలత, స్ఫూర్తినిచ్చే ఆయన వ్యక్తిత్వం ఆయనను అందరికీ ప్రీతిపాత్రుడిని చేశాయని కొనియాడాయి. భారత ముద్దుబిడ్డ అయిన కలాం నిజంగా ప్రజల రాష్ట్రపతి అని కీర్తించాయి. ‘మిసైల్ మ్యాన్’ కలాం ప్రపంచ ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటారని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నివాళులర్పించారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ తదితర సంఘాలు కలాం మృతిపట్ల సంతాపం ప్రకటించిన సంస్థల్లో ఉన్నాయి. సింగపూర్ ప్రధాని లూంగ్ కూడా సంతాపం తెలిపారు. భారత అణు సామర్థ్యాలను పెంపొందించటంలో కలాం ఎంతో కృషి చేశారని అమెరికా మీడియా శ్లాఘించింది. పలు రాష్ట్రాల్లో కలాం స్మృతి చిహ్నాలకు ఏర్పాట్లు న్యూఢిల్లీ: కలాం స్మృతి చిహ్నాలను ఏర్పాటు చేసేందుకు పలు రాష్ట్రాలు కృషి మొదలుపెట్టాయి. బిహార్ సీఎం నితీశ్‌కుమార్.. కిసాన్‌గంజ్ వ్యవసాయ కళాశాలకు మంగళవారం డాక్టర్ కలాం పేరు పెట్టారు. మధ్యప్రదేశ్‌లో స్కూళ్లలో పాఠ్యాంశంగా కలాం జీవితచరిత్రను బోధించాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్ తెలిపారు. కలాంకు నివాళిగా ఆగస్టు 2న ఆదివారం కూడా విధులు నిర్వర్తించాలని కేరళ రాష్ట్ర మహిళాభివృద్ధి కార్పొరేషన్ నిర్ణయించింది. కలాం మృతిపై ఆర్ఎస్ఎస్ సంతాపం తెలిపింది కలాం ట్విటర్ ఖాతాను మిత్రులు ‘ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం’గా కొనసాగించనున్నారు. -
రాజ్యసభ బరిలో మిలింద్ దేవరా?
సాక్షి, ముంబై: కేంద్ర పెట్రోలియం శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మురళీ దేవరా మృతితో ఖాళీ అయిన రాజ్యసభ స్ధానాన్ని ఆయన కుమారుడు మిలింద్ దేవరాకు కట్టబెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. దేవరా కుటుంబానికి అన్ని పార్టీలతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఎన్సీపీ, శివసేన మద్దతు కూడగట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మరోపక్క గత రెండు, మూడు నెలలుగా బీజేపీ వైఖరిపై విసిగెత్తిన శివసేనకు ప్రతీకారం తీర్చుకునేందుకు మంచి అవకాశం లభించింది. మురళీ దేవరా మృతితో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంపై త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో వాతావరణం మరోసారి వేడెక్కనుంది. ఆరు నెలల కిందటే దేవరా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవి కాలం గడువు 2020లో ముగియాల్సి ఉంది. కాని ఆయన ఇలా మృతి చెందడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడం కాంగ్రెస్‌కు సవాలుగా మారనుంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ ఈ స్థానాన్ని భర్తి చేయాలంటే సాధ్యమయ్యే పనికాదు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈ స్థానంపై తప్పకుండా కన్నువేసే అస్కారముంది. బీజేపీ వద్ద 130 మంది ఎమ్మెల్యేలున్నారు. అయినప్పటికీ రాజ్యసభ సీటును గెలిచేందుకు మరో 15 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరముంది. అందుకు శివసేన లేదా ఎన్సీపీ మద్దతు కూడగట్టుకోవల్సి ఉంటుంది. కాని గత రెండు, మూడు నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను బట్టి ప్రతీకారం తీర్చుకోవాలని శివసేన యోచిస్తోంది. బీజేపీ అభ్యర్ధి రాజ్యసభకు వెళ్లకుండా ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, ఎన్సీపీ సహా శివసేన కూడా ప్రయత్నాలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో మురళీ తనయుడు మిలింద్కు ఆ స్థానానికి నిలబెట్టాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేయనుంది. మురళీ దేవరా మృతికి సీడబ్ల్యూసీ సంతాపం న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా మృతికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మంగళవారం సంతాపం తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగి కమిటీ సమావేశంలో వక్తలు ఆయన సేవలను కొనియాడారు. ఇందిరాగాంధీ హయాంలో పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు మురళీ దేవరా పార్టీకి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని వారు పేర్కొన్నారు. కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన దేవరా ఎప్పుడూ పార్టీకి విధేయుడిగానే ఉన్నారని పేర్కొన్నారు. మురళీదేవరా(77) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ముంబైలో మృతిచెందిన విషయం తెలిసిందే. -
బతికున్న వ్యక్తిని 'చంపేసిన' పేపర్!!
ఆయన వయసు 81 ఏళ్లు. పొద్దున్నే పేపర్ చదవడం ఆయనకు బాగా అలవాటు. అందులో భాగంగానే ఒకరోజు పేపర్ తీసుకున్నారు. అందులో తీరా చూసేసరికి.. తాను చనిపోయినట్లు వార్త ప్రచురితమై ఉంది. అంతే.. దెబ్బకు ఆయన దిమ్మ తిరిగిపోయింది. ఈ సంఘటన స్వీడన్లో జరిగింది. స్వెన్ ఒలోఫ్ స్వెన్సన్ అనే వ్యక్తికి క్రిస్మస్ రోజు నుంచే అనారోగ్యంగా ఉండటంతో దక్షిణ స్వీడన్‌లోని ఆస్పత్రిలో ఆయనను చేర్చారు. ఆయన చెల్లెలు వైద్యులతో ఫోన్లో మాట్లాడగా, ఆయన చెప్పింది విని తన అన్న చనిపోయాడని అనుకుంది. దాంతో ఆయన చనిపోయినట్లు పత్రికలో ప్రకటన ఇచ్చేసింది. కానీ, స్వెన్సన్ స్నేహితుడు ఆ ఆస్పత్రికి అదేరోజు వెళ్తే.. ఈయన భేషుగ్గా మంచం మీద కూర్చుని కనిపించాడు. అదేంటి, నువ్వింకా చచ్చిపోలేదా అనుకుంటూ ఇద్దరూ నవ్వుకున్నారు. వెంటనే పెద్దాయన పత్రికా కార్యాలయానికి ఫోన్ చేసి, తానింకా బతికే ఉన్నానని కూడా చెప్పారు. పత్రికలో జరిగిన పొరపాటును తేలిగ్గా తీసుకుని, మర్నాడు సవరణ వేయాల్సిందిగా కోరడంతో పాటు రిపోర్టర్‌ను కూడా పంపమని అడిగారు. -
'ఉదయ్ కిరణ్ది అనుమానాస్పద మృతిగా గుర్తింపు'
హైదరాబాద్ : సినీనటుడు ఉదయ్ కిరణ్ (33) ఆత్మహత్యపై అతని భార్య విషిత పోలీసులుకు ఫిర్యాదు చేసింది. కాగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై పోలీసులు స్పందించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోందని ఏసీపీ అశోక్ కుమార్ తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు, కెరీర్ సరిగా లేకపోవటంతో మనస్తాపం చెందే ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి, ఇతర వివరాలు తెలుపుతామన్నారు. విచారణ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన అన్నారు. ఉదయ్ కిరణ్ సెల్‌ఫోన్, లాప్ టాప్ స్వాధీనం చేసుకున్నామని, సూసైడ్ నోట్ లాంటిది ఏమీ దొరకలేదన్నారు.