► వేలూరు, తిరువణ్ణామలైల్లో పార్టీలకతీతంగా జన నివాళి
► అమ్మ మరణవార్తతో భావోద్వేగానికి గురైన మహిళలు
వేలూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మృతికి పార్టీలకతీతంగా వ్యాపారులు, ప్రజలు, కార్యకర్తలు నివాళుర్పించారు. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి మృతి చెందారనే విషయం తెలుసుకున్న ఆమె అభిమానులతో పాటు రాష్ట్ర ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. ఇక , మంగళవారం కూడా టీవీల ముందు నుంచి వారు లేవలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ బయటకు వెళ్లకుండా టీవీల్లో ప్రచారమయ్యే అమ్మ అంత్యక్రియలు తదితర వాటిని చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలాఉండగా, వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని వాడ వాడల అమ్మ చిత్ర పటాలను ఉంచి కార్యకర్తలు, అభిమానులు, వ్యాపారులు పార్టీలకతీతంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వేలూరు పాత కార్పొరేషన్ కార్యాలయం ఎదుట అన్నాడీఎంకే కార్యకర్తలు అమ్మ చిత్ర పటాన్ని ఉంచి నివాళులు అర్పించారు. వేలూరు నేతాజీ మార్కెట్‌లో పూల వ్యాపారుల ఆధ్వర్యంలో సుమారు 500 కిలోల పుష్పాలతో అమ్మకు నివాళుర్పించారు. ఈ నేపథ్యంలో కాట్పాడి, ఆంబూరు, వానియంబాడి ప్రాంతాల్లో పెద్ద పెద్ద టీవీలను ఏర్పాటు చేశారు. అలాగే, కాంగ్రెస్, తామాకా తదితర పార్టీల కార్యకర్తులు అమ్మకు నివాళుర్పించారు. ప్రతి ఇంట్లోనూ అమ్మ చిత్ర పటాలను ఏర్పాటుచేసి నివాళుర్పించడం గమనార్హం.
ప్రతి ఇంటికీ ఫలాలు అమ్మవల్లనే
వేలూరు: ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత వల్లనే తమ ఇళ్లకు సంక్షేమ ఫలాలు చేరాయని మహిళలు అంటున్నారు. వేలూరు సమీపంలోని సత్‌వచ్చారికి చెందిన రాణి మాట్లాడుతూ అమ్మ వల్లనే తమ పిల్లలకు ల్యాప్‌ట్యాప్‌లు వచ్చాయన్నా రు. తమ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అనేక సదుపాయాలను అమ్మ కల్పించిందన్నారు. రాష్ట్రంలోని మహిళలకు గౌరవాన్ని తీసుకొచ్చిన ఏకై క నాయకురాలు అమ్మ ఒక్కరే అటూ అమ్మను కొనియాడారు.
జీవితాంతం రుణపడి ఉంటాం
కూలీ పనులు చేసుకుంటున్న తమ లాంటి పేదవాళ్లకు సీమంతం జరి పించి పుట్టింటి వరస తరహాలో అన్ని తాంబూలాలు అందించిన అమ్మకు జీవితాంతం రుణపడి ఉంటామని వానియంబాడికి చెం దిన సమీనా బేగం తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ఇస్లామియులకు ప్రత్యేక స్థానం కల్పించడంతో అమ్మ జయలలిత ఎనలేని కృషి చేశారని కొనియాడారు. గర్భిణీలకు సీమంతం జరిపించడంతో పాటు ఫల పుష్పాదులను అందించి పుట్టింటి స్థానాన్ని భర్తీ చేశారని ఆమె కంటడి పెట్టుకున్నారు. - సమీనాబేగం, వానియంబాడి
అమ్మకు ఘననివాళి
Published Wed, Dec 7 2016 4:50 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
Advertisement
Advertisement