
అమ్మ అంటే అంత అభిమానం
లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేలూరులో మంగళవారం అన్నాడీఎంకే బహిరంగ సభ జరిగింది. ఆ సభకు పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత పాల్గొన్నారు. ఆ సభలో రెండాకుల గుర్తును శరీరంపై వేసుకొని తన అభిమానాన్ని చాటుకున్నారు ఓ కార్యకర్త. ఎండను తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న కార్యకర్తలు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు.