
సాక్షి, హైదరాబాద్: మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ మృతి పట్ల కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ సం తాపం ప్రకటించారు. సోషలిస్ట్ ఉద్యమంలో ప్రముఖ నాయకుల్లో ఒకరిగా, జనతాదళ్ నాయకుడిగా, వాజ్‌పేయి హయాంలో రక్షణ, రైల్వే, సమాచార శాఖలను ఫెర్నాండెజ్ సమర్థవంతంగా నిర్వర్తించారన్నారు. ఫెర్నాండెజ్ కుటుంబ సభ్యులకు వినోద్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.