george fernandes
-
ప్రజానాయకుడు జార్జి
గత ఐదు దశాబ్ధాలుగా భారత రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసిన నాయకుడు జార్జి ఫెర్నాండెజ్. మంగుళూరులోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జార్జి జీవన గమనంలో యువప్రాయంలోనే కార్మిక వర్గపోరా టానికి కేంద్రమైన బొంబాయి చేరుకున్నాడు. ఈ నగరంలో యువసోషలిస్టుగా, కార్మికనాయ కుడుగా రూపొందాడు. పాకీ పని చేసే బొంబాయి మున్సిపల్ కార్మికుల పోరాటమే జార్జి మొదటి పోరాట అధ్యాయం. నూలు మిల్లు కార్మికులూ, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లూ, హాకర్లూ ఆఖరికి వేశ్య వృత్తిలో నలిగిపోతున్న మహిళలకూ కార్యకర్తగా చేరువయ్యాడు. ఆనాటి పెట్టుబడిదారీ వర్గ మూలస్తంభమైన యస్.కె.పాటిల్‌ను సునా యాసంగా ఓడించి జార్జి పార్లమెంటులో కాలు మోపాడు. పార్లమెంటుకు 9 సార్లు ఎన్నికై జాతీయ సమైక్యతకు చిహ్నంగా నిలిచాడు. కచ్చి, గోవా విముక్తి ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించిన విప్లవకారుడు. 1974లో రైల్వే సమ్మెకు నాయకత్వం వహించి కార్మిక లోకానికి ప్రియతమ నాయకుడ య్యాడు. ఇందిరాగాంధీ ఫాసిస్టు నిర్బంధ కాలంలో శ్రామికుల్లో ఉత్తేజాన్ని నింపడంలో జార్జి పాత్ర అద్వితీయమైంది. 50సార్లకు పైగా ఆయన జైలు నిర్బంధానికి గురయ్యారు. జార్జి ఫెర్నాండెజ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇంగ్లిష్ కాక అనేక భారతీయ భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు, రాయ గలడు, ఏమాత్రం సమయం దొరికినా విపరీతంగా పుస్తకాలను చదివే పుస్తకాల పురుగు జార్జి. సోషలిజానికీ, సహకార రంగానికీ ఉన్న సంబం ధాన్ని 25 ఏళ్లనాడే ‘న్యూ ఇండియా కోపరేటివ్ బ్యాంక్’ స్థాపించి నిరూపిం చాడు. ‘జార్జి ఫెర్నాండెజ్ స్పీక్స్’ అనే పుస్తకం ప్రపంచప్రసిద్ధి గాంచింది. జార్జిపై జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు వాసిన వ్యాసాల సంకలనం ‘డిగ్నిటీ ఫర్ ఆల్’ అనే పేరుతో వెలువడింది. ఎనిమిది పదులు నిండిన తరు వాత దీర్ఘకాల వ్యాధితో ఇబ్బందిపడి ఆయన 29, జనవరి 2019న మరణిం చారు. జార్జి మన మధ్యలేరు. కానీ ఆయన నాయకత్వం, ఉత్సాహం, ఆచ రణ విధానాలు మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో పయనించటమే మన నివాళి. (నేడు సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో జార్జి ఫెర్నాండెజ్ సంస్మరణ సభ సందర్భంగా) -రవితేజ పదిరి, న్యాయవాది ‘ మొబైల్ : 98661 16176 -
వైరుధ్యాలే శ్వాసగా ఫెర్నాండెజ్ ప్రస్థానం
ఆధునిక భారతదేశం ఇన్ని వైరుధ్యాల నడుమన జీవించిన మరొక రాజకీయ నేతను చూసి ఉండదంటే అతిశయోక్తి కాదు. తన కాలంలోని ఫైర్ బ్రాండ్ సోషలిస్టు నేతల్లో జార్జి మాథ్యూ ఫెర్నాండెజ్ పేరెన్నిక గన్నవారు. స్వల్పకాల మతబోధకుడు, ట్రేడ్ యూనియన్ నేత, వ్యవసాయ నిపుణుడు, రాజకీయ కార్యకర్త, మానవ హక్కుల కార్యకర్త, పార్లమెంటేరియన్, జర్నలిస్టు, కేంద్రమంత్రి ఇలా జీవితం పొడవునా బహుముఖీన వ్యక్తిత్వంతో గడిపినవారు జార్జి. ఎమర్జెన్సీకి ముందురోజుల్లో అంటే 1974లో 15 లక్షలమంది కార్మికులను కూడగట్టి జార్జి నిర్వహించిన రైల్వే సమ్మె యావద్దేశాన్ని స్తంభింపచేసింది. భారతీయ సోషలిస్టు పార్టీ పూర్వ చైర్మన్‌గా, కేంద్ర కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, రైల్వే, రక్షణ శాఖల మాజీ మంత్రిగా జార్జి ఫెర్నాండెజ్ జీవితంపూర్తిగా సంచలనాలు, వైరుధ్యాలమయంగా సాగింది. దీనికి చిన్న ఉదాహరణ: మొరార్జీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉండిన జార్జి తన ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా రెండున్నర గంటల పాటు వాదించిన తర్వాత అదే రోజు మంత్రి పదవికే రాజీనామా చేశారు. అలాగే అణుబాంబుకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు పోరాడిన జార్జి.. అణుశక్తి సంపన్న భారత్ అతి గొప్ప సమర్థకులలో ఒకరిగా నిలిచారు. 1949లో ఉద్యోగం కోసం ముంబై వెళ్లిన జార్జి ప్రారంభంలో దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఒక వార్తాపత్రికలో ప్రూఫ్ రీడర్‌గా ఉద్యోగం సాధించేంతవరకు వీధుల్లో నిద్రపోవలసి వచ్చింది. ముంబైలోని చౌపట్టి శాండ్స్ ప్రాంత బీచ్‌లలో నిద్రపోతుండగా నడిరాత్రి పోలీసులు వచ్చి లేపి వెళ్లిపొమ్మని చెప్పేవారు. ఈ క్రమంలో ప్రముఖ సోషలిస్టు నేత డాక్టర్ రామ్ మనోహర్ లోహియాతో ఏర్పడిన పరిచయం జార్జిపై మహత్తర ప్రభావం కలిగించింది. తర్వాత ముంబైలో ప్రముఖ కార్మిక నేత ప్లేసిడ్ డిమెల్లో నేతృత్వంలోని సోషలిస్టు ట్రేడ్ యూనియన్‌లో చేరారు. అచిరకాలంలోనే కార్మికనేతగా ఎదిగి హోటళ్లు, రెస్టారెంట్లు వంటి చిన్న తరహా పరిశ్రమల్లోని కార్మికుల హక్కుల కోసం పోరాడారు. 1967 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న జార్జి భారత జాతీయ కాంగ్రెస్‌లో అత్యంత ప్రజాకర్షణ కలిగిన, బలమైన నేత ఎస్.కె. పాటిల్‌ని ఓడించడం ద్వారా ప్రకంపనలు సృష్టించారు. ఇందిరాగాంధీ కేబినెట్లో శక్తివంతమైన మంత్రిగా, పార్టీకి విరాళాలు, నిధులను సమకూర్చిపెట్టే వ్యక్తిగా పేరొందిన పాటిల్‌పై 48.5 శాతం ఓట్లతో గెలుపొందిన జార్జికి... ‘జార్జి, ది జెయింట్ కిల్లర్’ అని మారుపేరు పెట్టారు. బంగ్లాదేశ్ విమోచన తర్వాత 70ల మొదట్లో కనీవినీ ఎరుగని ప్రజాదరణ పొందిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ అనతికాలంలోనే అవినీతి కేసుల్లో చిక్కుకున్నారు. గుజరాత్, బిహార్ రాష్ట్రాల్లో చెలరేగిన నవనిర్మాణ్ ఉద్యమ స్ఫూర్తి నేపథ్యంలో జార్జి 1974లో నిర్వహించిన రైల్వే సమ్మె దేశాన్ని స్తంభింపచేసింది. దీన్నుంచి జాతిని మళ్లించడానికే ఇందిరాగాంధీ పొఖారన్లో అణుపరీక్షలు నిర్వహించినట్లు విశ్లేషకుల నమ్మకం. జార్జి నిర్వహించిన రైల్వే సమ్మె నేపథ్యంలో పోఖ్రాన్–1 అణు ప్రయోగం జరగగా, వాజ్‌పేయి ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రి హోదాలో పోఖ్రాన్–2 ప్రయోగాన్ని జార్జి అమలు చేయడం చారిత్రక అపహాస్యం. తొలినుంచి కార్మికుల ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన జార్జి ఫెర్నాండెజ్ అనంతర జీవి తంలో రెండు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. 2002 నాటి గుజరాత్ మత మారణకాండను, ఒడిశాలో ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రాహమ్ స్టెయిన్స్ని అతడి పిల్లలతో సహా సజీవ దహనం చేసిన ఘటనను జార్జి సమర్థించారు. ఆయన గత చరి త్రలో మరిన్ని మరకలు కూడా చోటు చేసుకున్నాయి. పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ ఏజెంటుగా రామ్ స్వరూప్ వంటి గూఢచారులను ఉపయోగించుకుని భారత్‌ను ‘ఇజ్రాయిల్ మిత్రదేశం’గా మార్చడంలో జార్జి పాత్రను ఎవరూ సులభంగా మర్చిపోలేరు. ఇలాంటి ఎన్నో వైరుధ్యాలు, వివాదాలు కలగలసిన అతి సంక్లిష్టమైన జీవితం జార్జిది. కుడి, ఎడమలు రెండింటివైపూ ఆయా సందర్భాల్లో మొగ్గు చూపి రాజకీయాల్లో మనగలిగిన జార్జి ఆధునిక భారత రాజకీయాల్లో విశిష్టవ్యక్తి. రాజకీయ జీవిత చరమాంకంలో ఒక అవినీతి కేసులో చిక్కుకున్న జార్జి అచిరకాలంలోనే ప్రజల దృష్టినుంచి కనుమరుగవ్వాల్సి వచ్చింది. హిమాలయాల్లో భారత సైనికుల కడగండ్లను జాతి దృష్టికి తీసుకొచ్చిన జార్జి, మృతిచెందిన సైనికుల శవపేటికల కొనుగోళ్ల కుంభకోణంలో ఇరుక్కుని వాజ్‌పేయి ప్రభుత్వంలో రక్షణ మంత్రి పదవికే రాజీనామా చేయవలసి వచ్చింది. దాంట్లోంచి బయటపడి రాజకీయ జీవితంలోకి మళ్లీ వచ్చే అవకాశాలను అప్పటికే పొంచి ఉన్న అల్జీమర్స్, పార్కిన్సన్ వ్యాధులు అడ్డుకున్నాయి. పద్నాలుగేళ్ల పాటు అస్వస్థతతో, అజ్ఞాతంలోనే ఉండిపోయిన జార్జి ఫెర్నాండెజ్, 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వీడ్కోలు జార్జ్. కుర్బాన్ అలీ, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు Qurban100@ gmail.com -
నేడు ఫెర్నాండెజ్ అంత్యక్రియలు
న్యూఢిల్లీ: మాజీ రక్షణమంత్రి, సోషలిస్ట్ దిగ్గజం జార్జి ఫెర్నాండెజ్(88) అంత్యక్రియలు గు రువారం ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఫెర్నాం డెజ్ కోరిక మేరకు తొలుత ఆయన పార్థివదేహాన్ని దహనంచేసి, అస్థికలను పృథ్వీరాజ్ రోడ్డులోని క్రైస్తవ శ్మశానవాటికలో ఖననం చేయనున్నట్లు ఆయన భార్య లీలా కబీర్ వెల్ల డించారు. గురువారం ఉదయం వరకు ప్రముఖుల, అభిమానుల సందర్శనలు, నివాళుల తర్వాత మధ్యాహ్నం మూడింటికి స్వగృహం శాంతినివాస్ నుంచి అంతిమయాత్ర మొదలవుతుందని ఆమె పేర్కొన్నారు. అమెరికాలో ఉంటున్న ఫెర్నాండెజ్ ఏకైక కుమారుడు సియాన్ ఈరాత్రికల్లా ఢిల్లీ చేరుకోనున్నాడు. -
ఫెర్నాండెజ్ మృతి పట్ల ఎంపీ వినోద్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ మృతి పట్ల కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ సం తాపం ప్రకటించారు. సోషలిస్ట్ ఉద్యమంలో ప్రముఖ నాయకుల్లో ఒకరిగా, జనతాదళ్ నాయకుడిగా, వాజ్‌పేయి హయాంలో రక్షణ, రైల్వే, సమాచార శాఖలను ఫెర్నాండెజ్ సమర్థవంతంగా నిర్వర్తించారన్నారు. ఫెర్నాండెజ్ కుటుంబ సభ్యులకు వినోద్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
సోషలిస్టు దిగ్గజం కన్నుమూత
న్యూఢిల్లీ: సోషలిస్ట్ దిగ్గజం, ధీరోదాత్త రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచిన మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్(88) మంగళవారం ఆయన స్వగృహంలో కన్నుమూశారు. కొంత కాలంగా అల్జీమర్స్‌తో బాధపడుతున్న ఫెర్నాండెజ్ ఇటీవల స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం 6.42 గంటలకు ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఫెర్నాండెజ్ మరణ వార్తను ఆయన సన్నిహితురాలు జయా జైట్లీ నిర్ధారించారు. అమెరికాలో ఉంటున్న జార్జి ఫెర్నాండెజ్ కుమారుడు సియాన్ ఫెర్నాండెజ్ వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. ఫెర్నాండెజ్ పార్థివ దేహాన్ని ప్రధాని మోదీ సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి నిర్మల సీతారామన్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, బీజేపీ చీఫ్ అమిత్ షా తదితరులు కూడా ఫెర్నాండెజ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘ఉదయం ఆరు గంటల సమయంలో మా ఆస్పత్రికి ఫెర్నాండెజ్ ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆస్పత్రి నుంచి ఆయన ఇంటికి వెళ్లిన వైద్యుల బృందం ఆయనను పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించింది’ అని మాక్స్‌క్యూర్ ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. జీవితాంతం సోషలిస్ట్ నేతగానే.. జీవితాంతం సోషలిస్టు భావాలనే నమ్మి ఆచరించిన నేతగా ఫెర్నాండెజ్ నిలిచారు. 1974లో రైల్వే సమ్మెతో దేశాన్ని స్తంభింపజేసిన కార్మిక నేతగా.. 1977లో బడా బహుళ జాతి సంస్థ కోకకోలాను దేశం వదిలివెళ్లేలా చేసిన కేంద్రమంత్రిగా.. 1999లో కార్గిల్ యుద్ధాన్ని, అణ్వస్త్ర పరీక్షలను పర్యవేక్షించిన రక్షణ మంత్రిగా ఫెర్నాండెజ్ చరిత్ర పుటల్లో నిలిచారు. రెండు విభిన్న భావజాలాల నేతృత్వాల్లోని ప్రభుత్వాల్లో ఆయన మంత్రిగా పనిచేయడం విశేషం. 1977లో సామ్యవాదులతో కూడిన జనతాపార్టీ ప్రభుత్వంలో, 1999లో హిందుత్వ వాదులతో కూడిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. నిజాయతీ, నిర్భీతి ఆయన సొంతం: మోదీ జార్జి ఫెర్నాండెజ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తపరిచారు. ‘జార్జి సాహబ్ నిజాయతీపరుడు, నిర్భీతిగల నాయకుడు, నిరాడంబరుడు, వినయశీలి. తను నమ్మిన సామ్యవాద సిద్ధాంతాలను ఎన్నడూ విడనాడలేదు. భారత రాజకీయ నాయకత్వానికి నిజమైన ప్రతినిధి. ఆయన దేశానికి అందించిన సేవలు అమూల్యం. పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం గట్టిగా పోరాడారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన మంచి కార్మిక నేత, మంత్రిగా సమర్ధవంతమైన సేవలందించారు’ అని ప్రధాని మోదీ శ్లాఘించారు. ‘మాజీ పార్లమెంటేరియన్, కేంద్ర మంత్రి అయిన ఫెర్నాండెజ్ జీ మృతి బాధాకరం. ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు నా సానుభూతి’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అంత్యక్రియలు అయ్యేవరకు ఉంటా: నితీశ్ జార్జి ఫెర్నాండెజ్ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఢిల్లీలోనే ఉంటానని బిహార్ సీఎం నితీశ్‌కుమార్ పేర్కొన్నారు. ఫెర్నాండెజ్ మృతికి సంతాప సూచకంగా రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. అనంతరం ఆయన పట్నా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. తన రాజకీయ జీవితాన్ని ఫెర్నాండెజ్ తీర్చిదిద్దారని నితీశ్ తెలిపారు. ఫెర్నాండెజ్ పేరు మారుమోగిందిలా.. కర్ణాటకలో మంగళూరుకు చెందిన ఓ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన జార్జి ఫెర్నాండెజ్ సామ్యవాద భావాల పట్ల ఆకర్షితుడై కార్మిక నేతగా ఎదిగారు. 1975–77 సంవత్సరాల మధ్య ఇందిరాగాంధీ హయాంలో దేశంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. అనంతరం అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. రెండు విధాలుగా అంత్యక్రియలు జార్జి అంత్యక్రియలు లోధి శ్మశానవాటికలో జరుగుతాయని ఆయన సన్నిహితురాలు జయా జైట్లీ తెలిపారు. ‘ఆయన అంతిమ కోరిక మేరకు రెండు విధాలుగా అంత్యక్రియలు జరుపుతాం. గతంలో పార్థివ దేహాన్ని దహనం చేయాలని ఆయన కోరారు. ఇటీవల మాత్రం ఖననం చేయాలని చెప్పారు. ఆయన అభీష్టం ప్రకారం ఈ రెండింటిని నిర్వర్తిస్తాం. ముందుగా దహనం చేసి, అవశేషాలను ఖననం చేస్తాం’ అని చెప్పారు. నిత్య పోరాట యోధుడు జార్జి ఫెర్నాండెజ్ పేరు వినగానే 1974 రైల్వే సమ్మెతోపాటు 1975 ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటయోధుడు గుర్తుకొస్తాడు. గోవా మూలాలున్న రోమన్ కేథలిక్ కుటుంబంలో 1930 జూన్ 3న జన్మించిన జార్జిని 16 ఏళ్ల వయసులో క్రైస్తవ మత బోధకునిగా మార్చడానికి ఆయన కుటుంబం బెంగళూరు పంపించింది. శిక్షణ పూర్తయ్యాక ఆయన 1949లో సొంతూరు మంగళూరు నుంచి బొంబాయి వెళ్లి రాజకీయాలను జీవిత మార్గంగా ఎంచుకున్నారు. డాక్టర్ రాంమనోహర్ లోహియా నాయకత్వంలోని సోషలిస్ట్ పార్టీలో చేరి కార్మికోద్యమంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి బొంబాయి మహా నగరంలో ఈ పార్టీ అనుబంధ కార్మికసంఘం హింద్ మజ్దూర్ కిసాన్ పంచాయత్(హెచ్‌ఎంకేపీ)ను ముందుకు నడిపించారు. నిప్పులు చెరిగే ట్రేడ్ యూనియన్ నేతగా, శ్రామికవర్గాన్ని ఉర్రూతలూగించే వక్తగా జార్జి ఈ నగరంలో అనేక సమ్మెలు, బంద్‌లు విజయవంతంగా నిర్వహించారు. జాన్ జోసెఫ్, అలిస్ మార్తాల ఆరుగురు కొడుకుల్లో పెద్దవాడైన జార్జి రాజకీయ జీవితాన్ని బొంబాయి గొప్ప మలుపు తిప్పింది. దక్షిణ బొంబాయి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ప్రముఖ కాంగ్రెస్ నేత ఎస్కే పాటిల్‌ను 1967 సాధారణ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో సంయుక్త సోషలిస్ట్ పార్టీ(ఎసెస్పీ) టికెట్‌పై జార్జి ఓడించి తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2004 వరకూ ఆయన 9సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009–10 మధ్య చివరిసారి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. బరోడా డైనమైట్ కేసులో జైలు జీవితం జార్జి నాయకత్వంలో 1974లో జరిగిన రైల్వే సమ్మె విజయవంతమైంది. ప్రధాని ఇందిరాగాంధీ రైల్వే కార్మికుల్లో చీలికలు తెచ్చి వేలాది మందిని అరెస్ట్ చేయించడంతో సమ్మెను విరమించారు. 1975 జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు మిగిలిన ప్రతిపక్ష అగ్రనేతల మాదిరిగా అరెస్టు కాకుండా ఫెర్జాండెజ్ అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటం సాగించారు. చివరికి బరోడా డైనమైట్ కేసులో నిందితునిగా 1976 జూన్‌లో కోల్‌కతాలో జార్జి అరెస్టయ్యారు. 1977 జనవరిలో ఎమర్జెన్సీని తొలగించాక ప్రతిపక్ష నేతలందరినీ విడుదల చేసినా జార్జికి బరోడా కేసులో బెయిలు రాలేదు. జైలు నుంచే బిహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి జనతాపార్టీ తరఫున పోటీచేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇదే స్థానం నుంచి ఆయన ఐదు సార్లు ఎన్నికయ్యారు. మధ్యలో మూడుసార్లు నలందా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1977 ఎన్నికల్లో మొరార్జీదేశాయి ప్రధానిగా ఏర్పడిన జనతా పార్టీ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా, 1989 వీపీ సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. జనతా పాలనలో జార్జి పట్టుబట్టి అమెరికాకు చెందిన కంపెనీలు కోకాకోలా, ఐబీఎంను దేశంలో మూతవేయించారు. బిహార్ సీఎం లాలూ ప్రసాద్ జనతాదళ్‌లో పెత్తనానికి నిరసనగా 1994లో బిహార్ ప్రస్తుత సీఎం నితీశ్‌కుమార్‌తో కలిసి సమతాపార్టీ ఏర్పాటు చేసి బీజేపీ అగ్రనేత ఏబీ వాజ్‌పేయి నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వాల్లో 1998–99, 1999–2004 మధ్య కేంద్ర రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. రక్షణ శాఖ బడ్జెట్ భారీ పెంపునకు కూడా ఆయనే కారకుడు. యుద్ధంలో మరణించిన జవాన్ల కోసం కొనుగోలు చేసిన శవపేటికల కుంభకోణం కారణంగా ఆయన 2004లో రాజీనామా చేశారు. 2004లో ముజఫర్‌పూర్ నుంచి చివరిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే, 2009లో ఆయనకు జనతాదళ్(యూ)టికెట్ ఇవ్వలేదు. అదే ఏడాది ఈ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2010లోనే ఆయన అల్జీమర్స్ వ్యాధికి గురయ్యారు. కుష్వంత్ సింగ్లా ఎందుకు మారారు? దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో పోలీసుల కళ్లుగప్పేందుకు జార్జి ఫెర్నాండెజ్ కుష్వంత్ సింగ్ పేరుతో చెలామణీ అయ్యారని ఆయన సహవాసి ఒకరు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన విజయ్ నారాయణ్ అప్పటి ఘటనలను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘ఎమర్జెన్సీని వ్యతిరేకించే వారిని ఇందిర ప్రభుత్వం అరెస్టు చేస్తోంది. ఆ నిర్బంధం నుంచి తప్పించు కునేందుకు మేం మారువేషాల్లో తిరిగేవాళ్లం. ఫెర్నాండెజ్ సిక్కుగా మారిపోయారు. తలపాగా ధరించి, జట్టు, గడ్డం పొడుగ్గా పెంచుకుని తన పేరు కుష్వంత్ సింగ్‌గా చెప్పుకునేవారు. నేనేమో కాశీకి చెందిన ముస్లిం నేత పనివానిగా మారిపోయా. అలా మేం అజ్ఞాతంలో ఉంటూనే పని కొనసాగించేవాళ్లం. వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యమ నేతలకు ఆయన రాసే ఉత్తరాలను నేను రహస్యంగా రైల్వే మెయిల్లో పంపిస్తుండేవాణ్ని. మామూలుగానైతే ఫెర్నాండెజ్ బిహారీ మాదిరిగా ధోవతీ, కండువా ధరించేవారు’ అని నారాయణ్ తెలిపారు. అరంగేట్రం ఇలా.. కార్మిక నేతగా గుర్తింపు పొందిన ఫెర్నాండెజ్ రాజకీయ అరంగేట్రం మాత్రం ఆసక్తికరం. ముంబై (బాంబే)లోని న్యూ మున్సిపల్ కౌన్సిల్లో జార్జ్ ఫెర్నాండెజ్ కౌన్సిలర్‌గా ఉండేవారు. అప్పట్లో కాంగ్రెస్ నేత ఎస్కే పాటిల్ ముంబైకి మకుటం లేని మహారాజుగా చలామణి అయ్యేవారు. పెద్దపెద్ద పారిశ్రామికవేత్తల మద్దతు కూడా ఆయనకే ఉండేది. ఈ నేపథ్యంలో కార్మికవర్గాల మద్దతుతో 1967 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని జార్జి నిర్ణయించారు. సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్రావ్ పాటిల్‌ను కలుసుకుని ‘మీరు బాంబేకు మకుటం లేని మహారాజు కదా.. ఎవరో మున్సిపల్ కౌన్సిలర్ జార్జ్ ఫెర్నాండెజ్ మీపై పోటీకి దిగుతున్నాడట. ఒకవేళ మీరు ఓడిపోతే’ అని ప్రశ్నించారు. దీంతో పాటిల్ స్పందిస్తూ..‘ఈ జార్జి ఫెర్నాండెజ్ ఎవరు? ఆ దేవుడు కూడా నన్ను ఓడించలేడు’ అని జవాబిచ్చారు. మరుసటి రోజు పత్రికల్లో ఇదే ప్రచురితమైంది. దీన్ని ఆయుధంగా మలుచుకున్న ఫెర్నాండెజ్..‘తనను దేవుడు కూడా ఓడించలేడని పాటిల్ అంటున్నారు. కానీ ఆయన్ను మీరు (ప్రజలు) ఓడించగలరు’ అని పోస్టర్లు వేయించారు. దీంతో దక్షిణ ముంబై స్థానంలో పాటిల్‌పై 42వేల ఓట్ల మెజారిటీతో జార్జి గెలిచారు. లైలా కబీర్‌తో వివాహం..జయా జైట్లీతో సహజీవనం బెంగాల్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి హుమాయూన్ కబీర్ కూతురు లైలాను 1971లో జార్జి వివాహమాడారు. వారి ఏకైక కుమారుడు అమెరికాలో ఉన్నారు. 1990లో కుటుంబ విభేదాలతో లైలాకు విడాకులివ్వకుండానే ఆయన విడిగా జీవించడం ప్రారంభించారు. తరువాత కాలంలో సమతా పార్టీ అధ్యక్షురాలు జయా జైట్లీతో తన నివాసంలో కలిసి జీవించారు. 2012లో లైలా, ఆమె కుమారుడు జయను ఇంట్లోంచి గెంటి వేయగా, సుప్రీంకోర్టు అనుమతితో ఆమె జార్జిని కలుసుకున్నారు. కార్మిక నేతగా, చురుకైన పార్లమెంటేరియన్‌గా, కేంద్ర మంత్రిగా మంచి పేరు తెచ్చుకోవడమేగాక మంత్రి పదవిలోని సమయంలో ఆయన హక్కుల ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. పౌర హక్కుల ఉద్యమాలకు ఆయన మద్దతుగా నిలిచేవారు. డాక్టర్ లోహియాతో కలిసి పని చేసిన నేతల్లో ప్రముఖుడైన ఫెర్నాండెజ్ మరణంతో భారత రాజకీయాల్లో కీలక శకం ముగిసినట్టయింది. కన్నడం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడిన జార్జి గొప్ప రాజకీయవేత్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఇంకో జన్మ ఉంటే వియత్నాం పౌరుడిగా! మళ్లీ జన్మంటూ ఉంటే వియత్నాం పౌరుడిగా పుట్టాలని కోరుకుంటానని జార్జి ఫెర్నాండెజ్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. అంతర్యుద్ధంతో అతలాకుతలం అయినప్పటికీ వియత్నాం భారత్ కంటే ముందుకు దూసుకుపోతోందనీ, రాబోయే వందేళ్ల భవిష్యత్ గురించి వాళ్లు ఆలోచిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. 15 ఏళ్ల క్రితం బెంగళూరులోని కర్ణాటక ప్లాంటర్స్ అసోసియేషన్ సమావేశంలో ఫెర్నాండెజ్ మాట్లాడుతూ..‘వియత్నాం ప్రజలు క్రమశిక్షణ, అంకితభావం, దృఢసంకల్పం కలిగినవారు. తమ ఆశయసాధన కోసం ప్రాణత్యాగానికి సైతం వారు వెనుకాడరు. అమెరికా, చైనా, ఫ్రాన్స్ జోక్యం, అంతర్యుద్ధం కారణంగా 30 లక్షల మంది వియత్నాం పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ శరవేగంగా పురోగమిస్తున్న వియత్నాం.. తలసరి ఆదాయంలో భారత్‌ను దాటేస్తోంది. నేనేమీ అసూయతో మాట్లాడటం లేదు. ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత రక్షణమంత్రిని నేనే. మరో జన్మంటూ ఉంటే వియత్నాం పౌరుడిగా పుట్టాలని కోరుకుంటా’ అని ఫెర్నాండెజ్ తెలిపారు. -
మౌనంగా నిష్క్రమించిన ‘ధిక్కారం’
రాం మనోహర్ లోహియా సిద్ధాంతాలతో ప్రభావితుడై నూనూగు మీసాల ప్రాయంలోనే కార్మికో ద్యమంలో అడుగుపెట్టి, తిరుగులేని కార్మిక నాయకుడిగా ఎదిగి అధికార పీఠాన్ని గడగడలాడించిన జార్జి ఫెర్నాండెజ్ మంగళవారం 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొన్ని దశాబ్దాలపాటు క్షణ కాలం తీరికలేనంతగా ఉద్యమాలతో మమేకమై, ఆ తర్వాత పార్లమెంటరీ రాజకీయాల్లో తలమున కలై, కేంద్రమంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసిన ఫైర్‌బ్రాండ్ ఫెర్నాండెజ్ గత పదేళ్లుగా అనారోగ్యం బారినపడి ఎవరినీ గుర్తుపట్టలేని నిస్సహాయస్థితికి చేరుకున్నారు. తన లోకంలో తాను ఉండి పోయారు. చెప్పాలంటే ఫెర్నాండెజ్ మరణమే ఇప్పుడు ఆయన్ను మళ్లీ ప్రజాజీవన రంగంలో ప్రస్తావనాంశంగా మార్చింది. కేథలిక్ మతాచార్యుడిగా తీర్చిదిద్దాలనుకున్న అమ్మానాన్నలను కాదని 8 అణాలతో ముంబై మహానగరంలో ఆయన అడుగుపెట్టాడు. చిన్నా చితకా పనులు చేసు కుంటూ రాత్రుళ్లు పేవ్మెంట్లపై నిద్రపోయేవాడు. అటువంటి వ్యక్తి అచిరకాలంలోనే ఆ మహా నగరాన్ని స్తంభింపజేసే స్థాయి కార్మికోద్యమ నాయకుడిగా ఎదగడం ఆయన నాయకత్వ పటిమకు తార్కాణం. పది భాషల్ని అనర్గళంగా మాట్లాడగలగటం, దిగ్గజాల్ని సైతం ధిక్కరించడం ఆయన నైజం. బహుశా ఫెర్నాండెజ్ ఇప్పుడూ ఆ బాణీనే కొనసాగిస్తే ‘జాతి వ్యతిరేకి’గా ముద్రపడి జైలు గోడల వెనక మగ్గేవారేమో! తిరుగుబాటుదారన్నా, ధిక్కారస్వరం వినిపించేవారన్నా సాధారణ ప్రజానీకంలో తెలియని ఆపేక్ష ఉంటుంది. వారి సిద్ధాంతాలతో, ఆచరణతో విభేదిస్తున్నా అంతరాంతరాల్లో అది సహజంగా అంకురిస్తుంది. విస్ఫులింగాలు విరజిమ్ముతూ, నరనరాల్లో నెత్తుర్ని ఉప్పొంగింపజేసే ధైర్యశాలిని తమవాడిగా భావించనిదెవరు? కనుకనే కార్మికులంతా చాలా త్వరగానే ఆయన్ను సొంతం చేసు కున్నారు. 1967 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్.కె. పాటిల్‌ను ఓడిం చాక ఆయన పేరు ఆసేతు హిమాచలం మార్మోగిపోయింది. అందరూ ఆయన్ను ‘జయింట్ కిల్లర్’గా పిలవడం ప్రారంభించారు. మరో ఏడేళ్లకు ప్రారంభమైన రైల్వే సమ్మె ఫెర్నాండెజ్ జీవి తంలో అత్యంత కీలకమైన ఘట్టం. లక్షలమంది కార్మికులను ఒక్కతాటిపై నడిపి సాగించిన ఆ సమ్మె అప్పటి కేంద్ర ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. రైల్వేలో ఇతర సిబ్బందికి ఎప్పటి కప్పుడు వేతనాలు పెంచుతూ లోకో సిబ్బందికి నిర్దిష్ట పనివేళలు లేకుండా, సరైన వేతనాలివ్వ కుండా రాచిరంపాన పెట్టేవారు. ఒకసారి వారు రైలు ఎక్కారంటే దాన్ని గమ్యస్థానం చేర్చేవరకూ వారిదే బాధ్యత. అందుకు ఎన్నిరోజులు పట్టినా డ్యూటీలో కొనసాగాల్సిందే. కేంద్రప్రభుత్వాధీ నంలో ఉన్న అతి పెద్ద సంస్థ బాహాటంగా చట్టాలను ఉల్లంఘిస్తున్న తీరును రైల్వే సమ్మె ప్రశ్నిం చింది. కనుకనే రైల్వే కార్మికుల్లో 70 శాతంమంది అందులో భాగస్వాములయ్యారు. ఆనాటి ప్రభుత్వం ఉక్కుపాదంతో దాన్ని అణిచివేసింది. లక్షలమందిని జైళ్లలో బంధించి, వేలాదిమందిని ఉద్యోగాలనుంచి వెళ్లగొట్టింది. అనంతరకాలంలో విధించిన ఎమర్జెన్సీకి గల అనేక కారణాల్లో రైల్వే సమ్మె ఒకటి. ఆ నిర్బంధకాలంలో ఫెర్నాండెజ్ కోసం పోలీసులు వేంటాడి, వేటాడి అరెస్టుచేశారు. బరోడా డైనమైట్ కేసులో ముద్దాయిని చేశారు. ఆయన్ను అవమానించాలని గొలుసులతో బంధించి నడిపించారు. నిజానికి ఆ ఛాయాచిత్రమే లోక్‌సభ ఎన్నికల్లో అతి పెద్ద ప్రచారాస్త్రంగా మారి, జైల్లో ఉండగానే ఆయనకు ఘనవిజయాన్ని సాధించిపెట్టింది. ఎమర్జెన్సీ అనంతరం ఆయన హక్కుల సంఘాలతో కూడా సన్నిహితంగా పనిచేశారు. దేశంలో ఏ మూల హక్కుల ఉల్లంఘన జరిగినా, దానికి వ్యతిరేకంగా పోరాడే సంస్థలకు ఆయన దన్నుగా నిలబడేవారు. అవి చిన్నవా, పెద్దవా... వాటి వెనక ఉండే జనం ఎంతమంది అన్న అంశాలు ఆయన లెక్కజేసేవారు కాదు. అది నెత్తురోడిన ఇంద్రవెల్లి కావొచ్చు...మరోచోట గని కార్మికుల సమ్మె కావొచ్చు–ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఫెర్నాండెజ్ ప్రత్యక్షం కావాల్సిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన చిలకలూరిపేట బస్సు దహనం కేసులో ఉరిశిక్షపడిన ఇద్దరు దళిత యువకుల ప్రాణాలను కాపా డటంలో ఫెర్నాండెజ్ తీసుకున్న చొరవ మరవలేనిది. ‘అలజడి మా జీవితం... ఆందోళన మా ఊపిరి’ అనుకుంటూ పోరుబాట పడుతున్న యువ తను అప్పట్లో లోహియా సిద్ధాంతాలతో ప్రభావితమై పనిచేస్తున్న పలువురు ఆలోచింపజేశారు. హింసామార్గం కాక వేరే పోరాట విధానాలున్నాయని అభిప్రాయం కలగజేయడంలో వీరి పాత్ర గణనీయమైనది. అందులో ఫెర్నాండెజ్ ముఖ్యుడు. ఆయన పేరు చెబితే ఎప్పుడూ చెదిరి ఉండే జుత్తు, నలిగిపోయిన కుర్తా, పైజమా, భుజానికో సంచీ గుర్తొస్తాయి. ఆయనే కాదు... అప్పట్లో చాలామంది లోహియావాదుల ఆహార్యం అదే. కానీ విషాదమేమంటే ఆ వర్గంలోని అందరి మాదిరే ఫెర్నాండెజ్ కూడా సగటు రాజకీయవేత్తగా మారిపోయారు. ఒకప్పుడు వ్యవస్థకు పక్కలో బల్లెంగా ఉన్నవాడు అందులో భాగం కావడం మాత్రమే కాదు... ఆ రాజకీయపుటెత్తుల్లో కీలకంగా మారడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జనతాపార్టీ పాలనలో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి వెన్నుదన్నుగా నిలిచి ద్వంద్వ సభ్యత్వం ఉన్నవారికి చోటులేదంటూ పరోక్షంగా పార్టీలో ఆరెస్సెస్ అనుకూలవాదులపై దాడి చేసిన ఫెర్నాండెజ్ 24 గంటలు తిరగకుండా అందుకు భిన్న మైన వైఖరి తీసుకోవడం ఎవరికీ రుచించలేదు. అనంతరకాలంలో ఆయన ఎన్డీఏలో మంత్రిగా పనిచేశారు. తెహెల్కా స్టింగ్ ఆపరేషన్ వ్యక్తిగతంగా ఫెర్నాండెజ్‌ను అవినీతిపరుడని నిరూపించ లేకపోయింది. ఆయన రక్షణమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయన్న శవపేటికల కుంభకోణం, బరాక్ క్షిపణుల స్కాంలో కమిషన్లు విచారణ జరిపి ఆయన ప్రమేయం లేదని తేల్చాయి. ఆయన ఎన్ని తప్పటడుగులు వేసినా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఇప్పటికీ, ఎప్పటికీ ‘రెబల్’ ఫెర్నాండెజ్ మాత్రమే జనం గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. -
‘మరో జన్మంటూ ఉంటే అక్కడే పుడతా’
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) తీవ్ర అస్వస్ధతతో మంగళవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మంగుళూరులో జన్మించిన ఫెర్నాండెజ్ దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి కేబినెట్లో రక్షణ మంత్రిగా పనిచేశారు. ఎన్నో దేశాలు పర్యటించిన ఫెర్నాండెజ్ వియత్నాం దేశం పట్ల అమితమైన అభిమానం చూపేవారు. వారి నిబద్ధతను మెచ్చుకునేవారు. అంతేకాక వియత్నాన్ని సందర్శించిన భారతదేశ తొలి రక్షణశాఖ మంత్రి కూడా ఆయనే. (జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూత) అటల్ బిహారి వాజ్‌పేయి కేబినెట్లో రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో కర్ణాటక ప్లాంటర్స్ అసోసియేషన్ కాన్ఫరెన్స్‌కి హాజరయ్యారు ఫెర్నాండెజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇలా చెప్పుకోవడానికి నేనేం సిగ్గు పడటం లేదు. మరో జన్మంటూ ఉంటే వియత్నాంలో జన్మించాలని ఉంది. నమ్మిన దాని కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా వారు సిద్ధంగా ఉంటార’న్నారు. (‘ఫెర్నాండెజ్ అంటే ఇందిర కూడా భయపడేది’) అంతేకాక తాను వియత్నాంలో పర్యటించినప్పుడు.. అమెరికా, చైనా, ఫ్రాన్స్ దేశాలతో ఉన్న వివాదాల కారణంగా దాదాపు 30 లక్షల మంది వియత్నాం వాసులు చంపబడ్డారని తెలిసినప్పుడు తాను ఎంతో బాధపడ్డానని చెప్పుకొచ్చారు. ‘తలసరి ఆదాయంలో వియాత్నం ఇప్పటికి మనకంటే వెనకబడే ఉంది... కానీ ఇన్ని అవరోధాలను ఎదుర్కొని నిలబడగలిగింది’ అని ప్రశంసించారు. రాబోయే 100 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని.. ఇప్పుడు వినూత్న ఆలోచనలు చేసే దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క వియాత్నం మాత్రమేనని అప్పట్లో ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. -
ఫెర్నాండెజ్ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: మాజీ రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణంతో దేశం ఒక బలమైన సోషలిస్టు నేతను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. అవిశ్రాంత పోరాట యోధుడిగా, బలమైన సోషలిస్టు నేతగా ఫెర్నాండెజ్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. ఫెర్నాండెజ్ మరణం దేశానికి తీరనిలోటని, కేంద్రమంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జార్జి ఫెర్నాండెజ్(88) మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఫెర్నాండెజ్ మృతిపై ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. (జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూత) -
‘ఫెర్నాండెజ్ అంటే ఇందిర కూడా భయపడేది’
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) తీవ్ర అస్వస్ధతతో మంగళవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన స్నేహితుడు, బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి, ఫెర్నాండెజ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ టైంలో ఫెర్నాండెజ్‌ను చూస్తే.. ఇందిరా గాంధీ విపరీతంగా భయపడేవారన్నారు సుబ్రమణ్య స్వామి. ఆయన మాట్లాడుతూ.. ‘గాంధీ కుంటుంబం అంటే ఫెర్నాండెజ్‌కు అసలు ఇష్టం ఉండేది కాదు. ఆ కుటుంబం దేశాన్ని నాశనం చేస్తుందని ఆయన నమ్మేవాడు. ఆయన తన జీవితాంతం కాంగ్రెస్‌ను, గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకించాడు’ అని తెలిపారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలను ఫెర్నాండెజ్ తీవ్రంగా వ్యతిరేకించేవాడన్నారు. ‘ఆ సమయంలో ఫెర్నాండెజ్‌ను చూస్తే ఇందిరా గాంధీ భయపడేవారు. ఆయనను అరెస్ట్ చేసిన తర్వాతే ఇందిరా గాంధీ ప్రశాంతంగా ఉండగలిగార’ని తెలిపాడు సుబ్రమణ్య స్వామి. అంతేకాక తమ అనుబంధం గురించి మాట్లాడుతూ.. ‘ఫెర్నాండెజ్ నాకు చాలా ప్రియమైన స్నేహితుడు. మేం తరచుగా కలుసుకుని పలు అంశాల గురించి చర్చించేవాళ్లం. అతను చాలా తెలివైన వాడు. అతడు తన జీవితంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎన్నో గొప్ప ర్యాలీలు, సభలు నిర్వహించాడ’ని తెలిపారు. అంతేకాక ఫెర్నాండెజ్ బోఫోర్స్ కేసును ఓ కొలిక్కి తీసుకురావాలనిభావించారు. కానీ వాజ్‌పేయ్ సూచన మేరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారన్నారు సుబ్రమణ్య స్వామి. అంతేకాక సైనికులు క్షేమం గురించి ఫెర్నాండెజ్ కన్నా ఎక్కువగా ఏ రక్షణశాఖ మంత్రి కృషి చేయలేదని ప్రశంసించారు. -
మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూత
-
జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) తీవ్ర అస్వస్ధతతో మంగళవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా ఆయన స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఫెర్నాండెజ్ మంచానికే పరిమితమయ్యారు. 1930 జూన్ 3న మంగుళూరులో జన్మించిన జార్జి మ్యాథ్యూ ఫెర్నాండెజ్ 1967లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి కేబినెట్లో రక్షణ మంత్రిగా పనిచేసిన ఫెర్నాండెజ్ సమాచార శాఖ, రైల్వే, పరిశ్రమలు వంటి పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. జనతాదళ్ నేతగా పేరొందిన ఫెర్నాండెజ్ వీపీ సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా వ్యవహరించారు. మాతృసంస్ధ జనతాదళ్‌ను వీడిన అనంతరం ఆయన బీజేపీతో చేతులు కలిపారు. 1994లో సమతా పార్టీని స్ధాపించిన ఫెర్నాండెజ్ ఎన్డీఏలో భాగస్వామిగా బీజేపీతో కలిశారు. ఎన్డీఏలో కీలక నేతగా ఎదిగిన ఫెర్నాండెజ్ వాజ్‌పేయికి అత్యంత విధేయుడిగా పేరొందారు. ఫెర్నాండెజ్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్ అణుపరీక్షలను భారత్ విజయవంతంగా చేపట్టింది. ఫెర్నాండెజ్‌ను పలు వివాదాలు చుట్టుముట్టిన సందర్భాల్లో వాజ్‌పేయి ఆయనకు వెన్నంటి నిలిచారు. ఫెర్నాండెజ్ ప్రస్ధానం సాగిందిలా.. జార్జి ఫెర్నాండెజ్ రాజకీయ నాయకుడిగానే కాదు, జర్నలిస్టుగా, ట్రేడ్ యూనియన్ల నేతగా, వ్యవసాయదారుడిగా సుపరిచితులు.ఆయన ఆరేళ్ల వయసులోనే పాస్టర్ శిక్షణ కోసం బెంగళూరు వెళ్లారు.అక్కడి నుంచి 1949లో ముంబైకి మకాం మార్చి, సోషలిస్ట్ ట్రేడ్ యూనియన్‌లో చేరి కార్మికోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. రైల్వేలో పనిచేస్తూ ట్రేడ్ యూనియన్ నేతగా కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం అనేక ధర్నాలు, ఆందోళనలు చేసిన ఫెర్నాండెజ్ 1967లో సౌత్ ముంబై నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత ఎస్కే పాటిల్‌ను ఓడించి పార్లమెంట్లో అడుగుపెట్టారు.1975లో ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిన ఫెర్నాండెజ్ 1976లో బరోడా డైనమైట్ కేసులో అరెస్టయ్యారు.1977లో బిహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి గెలిచి, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.1989-90లో ప్రతిష్టాత్మక కొంకణ్ రైల్వే ప్రాజెక్టు కోసం రైల్వే మంత్రిగా విశేష కృషి చేశారు. బరాక్ మిస్సైల్ కుంభకోణం, తెహెల్కా వివాదాల్లో ఆయన పేరు వినిపించింది . -
దౌత్య యుద్ధం!
పెద్దవాళ్ల దగ్గర వినయంగా, విధేయతగా, అణకువగా మెలగడం మంచి లక్షణమంటారు. ఆ పెద్దవాళ్లు తమ పెద్దరికం నిలుపుకునేంతవరకూ... చిన్నవాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయనంతకాలమూ ఇది నిజంగా మంచి లక్షణమే. ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నా అగ్రరాజ్యం అమెరికా దగ్గర దశాబ్దాలుగా వినయాన్ని, విధేయతనూ ప్రదర్శించడం మాత్రమే అలవాటైన మన పాలకులు తొలిసారి జూలువిదిల్చారు. అమెరికాపై దౌత్యయుద్ధానికి దిగారు. న్యూయార్క్‌లో డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పనిచేస్తున్న సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారిణి దేవయాని ఖోబ్రగడే విషయంలో అతిగా ప్రవర్తించిన అమెరికా చర్యను నిరసిస్తూ వరస చర్యలు తీసుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన ఒక ప్రతినిధి బృందాన్ని కలవడానికి లోక్‌సభ స్పీకర్ మొదలుకొని జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ వరకూ అందరూ నిరాకరించారు. నరేంద్రమోడీనుంచి రాహుల్‌గాంధీ వరకూ అధికార, విపక్ష నేతలందరూ తొలిసారి ఒకే మాట మాట్లాడారు. అంతేకాదు... మన ప్రభుత్వం అమెరికా రాయబార కార్యాలయంవద్ద చాన్నాళ్లుగా ఉంటున్న బారికేడ్లను తీయించింది. అమెరికా దౌత్యకార్యాలయాల్లో, వారి ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి చెల్లిస్తున్న వేతనాల వివరాలూ, వారి బ్యాంకు ఖాతాల వివరాలూ ఇవ్వాలని హుకుంజారీచేసింది. అమెరికా సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకూ ఇచ్చిన ప్రత్యేక గుర్తింపు కార్డుల్ని వెనక్కు ఇవ్వాలని ఆదేశించింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇన్నాళ్లుగా అమెరికా దౌత్య సిబ్బంది అనుభవిస్తున్న ప్రత్యేక సౌకర్యాలన్నిటికీ స్వస్తి పలికింది. అంతక్రితం భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌ను విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి దేవయాని విషయంలో వ్యవహరించిన తీరుకు తీవ్ర నిరసనను, అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ చర్యల్లో ఉక్రోషం కనబడవచ్చు. ఉద్రేకం కనబడవచ్చు. మనవాళ్లలో తరచుగా దర్శనమిచ్చే నెమ్మదితనం మాయమైనట్టు అనిపించవచ్చు. కానీ, ఎప్పుడూ మృదువుగానే మాట్లాడదామనుకుంటే కుదరదు. మంద్రంగా ఉన్నా సరిపోదు. ఒక్కోసారి పొలికేక అవసరమవుతుంది. చెవులు చిల్లులుపడేలా మాట్లాడవలసి ఉంటుంది. ఇప్పుడు మన దేశం ఆ పనేచేసింది. దేవయాని ఖోబ్రగడే తనవద్ద పనిచేయించడానికి భారత్‌నుంచి తీసుకెళ్లిన సహాయకురాలికి చట్టప్రకారం ఇవ్వాల్సిన వేతనంకంటే తక్కువ ఇచ్చారని, ఆమెకు సంబంధించిన వివరాలను అందజేయడంలో మోసానికి పాల్పడ్డారని అమెరికా ప్రధాన ఆరోపణలు. మన ప్రభుత్వం దౌత్యకార్యాలయాల్లో చెల్లించమని నిర్దేశించిన వేతనాన్నే సహాయకురాలికి చెల్లించామని దేవయాని తండ్రి చెబుతున్నారు. దౌత్యవేత్తగా పనిచేస్తున్న దేవయానికి మన ప్రభుత్వం చెల్లించే వేతనం నెలకు 4,120 డాలర్లుకాగా, తమ చట్టాల ప్రకారం సహాయకురాలికి ఆమె నెలకు 4,500 డాలర్లు చెల్లించి తీరాలని అమెరికా చేస్తున్న వాదన. ఇందులో సహేతుకత ఏపాటో విచారణ తర్వాత తేలుతుంది. కానీ, ఆ ఆరోపణలను ఆసరాచేసుకుని దేవయానిపట్ల అనుచితంగా ప్రవర్తించారు. పిల్లల్ని దించడానికి పాఠశాలకు వెళ్తే అక్కడికక్కడే ఆమెను చుట్టుముట్టి నిర్బంధంలోకి తీసుకుని సంకెళ్లువేశారు. అటు తర్వాత తమ కార్యాలయానికి తీసుకెళ్లి ఆమె దుస్తులు తీయించి తనిఖీచేశారు. అనంతరం ఆమెను మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులుగా ఉన్నవారితోపాటు బంధించారు. డీఎన్ఏ శాంపుల్ తీసుకున్నారు. న్యాయస్థానం ఆమెకు బెయిల్ ఇచ్చేలోగానే ఇవన్నీ జరిగిపోయాయి. భారత్ వ్యక్తం చేసిన నిరసన చెవికెక్కకపోగా తమ అధికారులను అమెరికా సమర్థించుకో జూసింది. దేవయాని చేసిన పని దౌత్యవేత్తగా ఆమె విధుల్లో భాగం కాదు గనుక దౌత్యవేత్తలకు వర్తించే వియన్నా ఒప్పందంలోని అంశాలు ఆమెకు వర్తించబోవని దబాయించింది. నిజానికి అమెరికా మన దేశానికి సంబంధించిన ప్రముఖులతో ఇలా వ్యవహరించడం ఇది మొదటిసారి కాదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఒకటికి రెండుసార్లు తనిఖీల పేరుతో అవమానించారు. అంతక్రితం అప్పటి ప్రధాని వాజపేయికి, అప్పటి రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్, విదేశాంగ శాఖ మాజీమంత్రి ఎస్ఎం కృష్ణలకు కూడా ఇలాగే జరిగింది. సుప్రసిద్ధ నటులు షారుఖ్ ఖాన్ , కమల్‌హాసన్‌లకు ఇదే పరాభవం ఎదురైంది. గత మూడేళ్లలో మన దౌత్యవేత్తలను వేర్వేరు కారణాలతో ఇలా వేధించడం ఇది మూడోసారి. ఈ వరస అవమానాలను ఎప్పటికప్పుడు దిగమింగుకోవడం, ఆగ్రహించినవారికి సర్దిచెప్పుకోవడం మన పాలకులకు అలవాటైంది. ఇప్పుడు దేవయాని ఘటన జరిగాక చేపట్టిన చర్యలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఏ దౌత్య కార్యాలయానికైనా పటిష్టమైన భద్రత కల్పించడం సాధారణమే. కానీ, అమెరికా దౌత్య కార్యాలయం వెలుపల బారికేడ్ల నిర్మాణం ఆ పరిమితిని మించిపోయిందని ఇప్పుడు తీసుకున్న చర్యలనుబట్టి అర్ధమవుతుంది. ఎంత మిత్ర దేశమనుకున్నా ఇతర దేశాల దౌత్యవేత్తలకు లభ్యంకాని ప్రత్యేక సౌకర్యాలు అమెరికా దౌత్యవేత్తలకు ఎందుకు కల్పించినట్టు? ఇన్నేళ్లుగా ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ కూడా ఇలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పనిమనుషులకు మన చట్టాలు తగిన స్థాయిలో వేతనాలు నిర్ణయించలేదన్నది నిజం. మన దౌత్యకార్యాలయాల్లో పనిమనుషులుగా వెళ్లిన వారికి కూడా ఆ చట్టాలకు అనుగుణంగానే వేతనాలు అందుతున్నాయి. ఇది సరిగా లేదనుకున్నప్పుడు అమెరికా అధికారులు మన దేశంతో సంప్రదింపులు జరపాలి. తమ దేశంలో దౌత్య కార్యాలయం కొనసాగించదలుచుకుంటే తాము నిర్ణయించిన వేతనాలివ్వాలని సూచించాలి. కానీ, అందుకు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను శిక్షించబూనడం అనాగరికం. ఇప్పుడు మనవైపుగా తీసుకున్న చర్యల తర్వాతనైనా అమెరికాకు జ్ఞానోదయం కలగాలి. సరిగా వ్యవహరించడం నేర్చుకోవాలి.