సాక్షి, హైదరాబాద్: మాజీ రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణంతో దేశం ఒక బలమైన సోషలిస్టు నేతను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. అవిశ్రాంత పోరాట యోధుడిగా, బలమైన సోషలిస్టు నేతగా ఫెర్నాండెజ్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. ఫెర్నాండెజ్ మరణం దేశానికి తీరనిలోటని, కేంద్రమంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు
గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జార్జి ఫెర్నాండెజ్(88) మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఫెర్నాండెజ్ మృతిపై ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. (జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment