
న్యూఢిల్లీ: మాజీ రక్షణమంత్రి, సోషలిస్ట్ దిగ్గజం జార్జి ఫెర్నాండెజ్(88) అంత్యక్రియలు గు రువారం ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఫెర్నాం డెజ్ కోరిక మేరకు తొలుత ఆయన పార్థివదేహాన్ని దహనంచేసి, అస్థికలను పృథ్వీరాజ్ రోడ్డులోని క్రైస్తవ శ్మశానవాటికలో ఖననం చేయనున్నట్లు ఆయన భార్య లీలా కబీర్ వెల్ల డించారు. గురువారం ఉదయం వరకు ప్రముఖుల, అభిమానుల సందర్శనలు, నివాళుల తర్వాత మధ్యాహ్నం మూడింటికి స్వగృహం శాంతినివాస్ నుంచి అంతిమయాత్ర మొదలవుతుందని ఆమె పేర్కొన్నారు. అమెరికాలో ఉంటున్న ఫెర్నాండెజ్ ఏకైక కుమారుడు సియాన్ ఈరాత్రికల్లా ఢిల్లీ చేరుకోనున్నాడు.