తమ్ముడి మరణవార్త విని అన్న హఠాన్మరణం | The sudden death of brother's obituary heard | Sakshi
Sakshi News home page

తమ్ముడి మరణవార్త విని అన్న హఠాన్మరణం

Published Tue, Sep 20 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

The sudden death of brother's obituary heard

 అయ్యంగారిపల్లె (పాలకుర్తి) : కలగోలుపుగా ఉండే తమ్ముడి మరణవార్త విని అన్న హఠాన్మరణం పొందిన సంఘటన మండలంలోని అయ్యంగారిపల్లెలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని ఈరవెన్నులో కాసోజు లక్ష్మీనర్సయ్య(70) ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయమై అయ్యంగారిపల్లెలో ఉంటున్న అన్న రామనర్సయ్య(80)కు బంధువులు సమాచారం అందించారు. అయితే తమ్ముడి మరణవార్త విన్న అన్న హఠాన్మరణం పొందాడు. దీంతో రెండు గ్రామాల్లో విషాదం అలుముకుంది.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement