తమ్ముడి మరణవార్త విని అన్న హఠాన్మరణం
అయ్యంగారిపల్లె (పాలకుర్తి) : కలగోలుపుగా ఉండే తమ్ముడి మరణవార్త విని అన్న హఠాన్మరణం పొందిన సంఘటన మండలంలోని అయ్యంగారిపల్లెలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని ఈరవెన్నులో కాసోజు లక్ష్మీనర్సయ్య(70) ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయమై అయ్యంగారిపల్లెలో ఉంటున్న అన్న రామనర్సయ్య(80)కు బంధువులు సమాచారం అందించారు. అయితే తమ్ముడి మరణవార్త విన్న అన్న హఠాన్మరణం పొందాడు. దీంతో రెండు గ్రామాల్లో విషాదం అలుముకుంది.