హైదరాబాద్ : సినీ నటుడు ఉదయ్ కిరణ్ భౌతికకాయాన్ని ఈరోజు ఉదయం నిమ్స్ ఆసుపత్రి నుంచి శ్రీనగర్ కాలనీలోని ఆయన నివాసం జ్యోతి హోమ్స్ అపార్ట్మెంట్కు తరలించారు. అనంతరం అభిమానుల సందర్శనార్ధం ఉదయ్‌కిరణ్ పార్థివదేహాన్ని ఫిలించాంబర్ కు తరలించారు.
ఉదయ్ ఆత్మహత్యతో భార్య విషత, సోదరి శ్రీదేవి, బావ, తండ్రి అభిమానులు దుఃఖంలో మునిగిపోయారు. ఈ రోజు సాయంత్రం ఎర్రగడ్డ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా అంతకు ముందు ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా పూజ నిర్వహించారు.