![Actress Sadha Comments On Uday Kiran Death - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/22/1_0.jpg.webp?itok=3fWByshw)
టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. లవర్‌బాయ్ ఇమేజ్‌తో ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రల్లో నటించిన ఉదయ్‌కిరణ్‌కి యూత్‌లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే అనుకున్నంత స్థాయిలో కెరీర్ లేకపోవడం, సరైన అవకాశాలు లేక డిప్రెషన్‌తో ఉదయ్‌కిరణ్ 2014లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఉదయ్‌కిరణ్ మృతిపై హీరోయిన్ సదా మాట్లాడుతూ.. 'అతను ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎప్పుడూ ఊహించలేదు. ఉదయ్ కిరణ్‌తో కలిసి 'ఔనన్నా కాదన్నా' సినిమా చేశాను. అతను ఎంతో మంచి వ్యక్తి. అంత మంచి నటుడ్ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన కెరీర్‌లో ఎక్కడో తప్పు జరిగింది. కానీ ఏం జరిగినా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
సినిమా అవకాశాల కంటే జీవితమే ముఖ్యం. సమస్యకు చావే పరిష్కారం కాదు.. ఒక యాక్టర్ గా మనం ది బెస్ట్ అవ్వాలి అంతే. ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అన్నది పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది ' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సదా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment