
చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న నటుడు ఉదయ్ కిరణ్. యూత్‌లో అతని మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఊహించని విధంగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని మనందరికీ దూరమయ్యారు. కానీ ఎప్పటికీ అతని నటించిన సినిమాలను ఇప్పటికి ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో నటించిన ఉదయ్ కిరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజాగా ఉదయ్ కిరణ్‌ను మరోసారి వెండితెరపై చూసుకునే అవకాశం లభించింది. అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన నువ్వు నేను సినిమా ఇప్పుడు రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఇటీవల టాలీవుడ్‌లో పాత సినిమాలను రి రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమా మళ్లీ సందడి చేయనుంది.
కాగా.. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్, అనిత జంటగా నటించారు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతమందించిన ఈ సినిమా 2001వ సంవత్సరం ఆగస్టు 10న రిలీజై అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు ఏకంగా 5 నంది అవార్డులు అందుకున్నారు. తాజాగా మార్చి 21న థియేటర్స్‌లో రీ రిలీజ్ అవుతోంది. దీంతో ఉదయ్ కిరణ్ అభిమానులు మరోసారి థియేటర్లో తమ హీరోని చూడటానికి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నువ్వు నేను రీ రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment