ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య బాధించింది | Uday kiran good friend, says Tarun | Sakshi
Sakshi News home page

ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య బాధించింది

Published Sun, Jan 12 2014 9:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య బాధించింది

ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య బాధించింది

ఆత్మహత్య బాధాకరం: హీరో తరుణ్
 
దివంగత హీరో ఉదయ్‌కిరణ్ తనకు మంచి మిత్రుడని, అతని మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని హీరో తరుణ్ ఆవేదన చెందారు. శ్రీకాంత్ కలసి ఇక్కడికి వచ్చిన ఆయన తన మనస్సులోని భావాలను విలేకరులతో పంచుకున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలియదుకాని ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. మంచి నటుడ్ని తె లుగు సినీ పరిశ్రమ పోగొట్టుకుందని వ్యాఖ్యానించారు. తెలుగు ఇండస్ట్రీని నాలుగు కుటుంబాలే శాసిస్తున్నాయన్న టాక్‌పై విలేకరులు ప్రస్తావించగా అలాంటిదేమి ఉండదన్నారు. ఎవరూ ఎవర్నీ ఏమీ చేయలేరన్నారు.


 
 మన సినిమా బాగుంటే అదే ఆడుతుందన్నారు. పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలు బాగున్నా ఆడడం లేదన్న విషయంలో కూడా నిజం లేదన్నారు. ఎన్ని చిన్న సినిమాలు బాగా ఆడడం లేదంటూ... ఇటీవల విడుదలై విజ యం సాధించిన కొన్ని చిన్న సినిమాల పేర్లను ఉదహరించారు.


 
 చిన్నవి, పెద్దవి అని కాదని లో బడ్జెట్, హై బడ్జెట్ అనేదే చూడాలన్నారు. ఎన్నో లో బడ్జెట్ సినిమాలు బాగా ఆడుతున్నాయన్నారు. సినిమా బాగుం టే ప్రేక్షులు వద్దన్నా వెళ్లతారన్నారు. వారినెవరూ ఆపలేరని చెప్పారు. ప్రస్తుతం వేట, యుద్ధం సినిమాల్లో నటిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement