
రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించిన ఉదయ్ కిరణ్
హైదరాబాద్ : ఉదయ్ కిరణ్ రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో వెల్లడి అయ్యింది. ఉరి వేసుకునే ముందు అతను చేతి మణికట్టు నరాలు కోసుకునే ప్రయత్నం చేసినట్లు ఫోరెన్సిక్ నివేదికలో బయటపడింది. రాత్రి 10.30 ....11.00 గంటల మధ్యలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోరెన్సిక్ సిబ్బంది తెలిపారు. అలాగే ఉదయ్ కిరణ్, అతని భార్య విషిత కాల్ డేటాను పోలీసులు తెప్పించారు. విషిత ఫోన్ నుంచే ఉదయ్ కిరణ్కు మెసేజ్లు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
అలాగే ఉదయ్ కిరణ్ ఫోన్ నుంచి నాలుగు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రాణ స్నేహితుడు శరత్కు రెండుసార్లు, భార్య విషితకు రెండుసార్లు అతను కాల్ చేసినట్లు తెలుస్తోంది. భార్యకు ఎలాంటి మెసేజ్ పంపలేదని....ఉదయ్ కిరణ్ కాల్ చేయగా.... తన ఫోన్ చెడిపోయిందని విషిత మెసేజ్ పంపినట్లు పోలీసులు గుర్తించారు.
కాగా గత కొంత కాలంగా సినిమా అవకాశాలు లేక సతమతం అవుతున్న ఉదయ్ కిరణ్....ఆదివారం రాత్రి శ్రీనగర్ కాలనీనలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతను ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, తన కెరీర్ ఆశాజనకంగా లేక పోవడమే కారణమని తెలుస్తోంది.