ఉదయ్ కిరణ్ మృతిపై వీడిన మిస్టరీ | Mystery of Uday Kiran's Death Unravelled | Sakshi
Sakshi News home page

ఉదయ్ కిరణ్ మృతిపై వీడిన మిస్టరీ

Published Thu, Aug 21 2014 1:00 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ఉదయ్ కిరణ్ మృతిపై వీడిన మిస్టరీ - Sakshi

ఉదయ్ కిరణ్ మృతిపై వీడిన మిస్టరీ

సాక్షి, హైదరాబాద్: సినీ హీరో ఉదయ్‌కిర ణ్ ఊపిరాడక మృతి చెందాడని, అంతకు ముందు అతడు మ ద్యం తాగాడని  ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేది క వెల్లడించింది. బంజారాహిల్స్ పోలీసులకు ఈ నివేదిక బుధవారం చేరింది. జనవరి 5న ఉదయ్‌కిరణ్ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం సమయంలో విస్రాను భద్రపర్చి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు పంపించారు.
 
సుదీర్ఘకాలం తరువాత ఫోరెన్సిక్ నివేదిక రావడంతో ఉదయ్‌కిరణ్ మరణానికి గల కారణాలు కూడా వెల్లడయ్యాయి.  చిత్ర పరిశ్రమలో ఎదగలేకపోతున్నాననే మానసిక ఒత్తిడిలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని దర్యాప్తులో తేలింది. గతంలో కూడా రెండుమూడ్లు సార్లు ఆత్మహత్యకు యత్నించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అనుమానాస్పద మృతి కేసును త్వరలో ఆత్మహత్య కేసుగా మార్చి మూసి వేసే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement