
పోరాడదాం, గెలుద్దాం: శివాజీ
హైదరాబాద్: ఆత్మహత్య పిరికి చర్య అని నటుడు శివాజీ అన్నారు. సమస్యల నుంచి పారిపోకూడదని, పోరాడాలని ఆయన సూచించారు. సమస్యలను తప్పించుకుంటే ఓడిపోయినట్టేనని పేర్కొన్నారు. సమస్యలను ఎదుర్కొందాం, పోరాడదాం అని అన్నారు. పోరాడదాం, గెలుద్దాం అని వ్యాఖ్యానించారు. జీవితంలో ఏదో రోజు విజయం సాధిస్తామని తెలిపారు.
ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి నివాళి అర్పించిన శివాజీ విలేకరులతో మాట్లాడారు. తాను ఎదుర్కొన్న సమస్యలకు 20, 30 సార్లు ఆత్మహత్య చేసుకోవాలన్నారు. భగవంతుడి ఇచ్చిన జీవితాన్ని పిరికి చర్యలకు బలికానీవ్వకూడదన్నారు. ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు, నమ్ముకున్న వారిని నట్టేటా ముంచడం భావ్యం కాదని శివాజీ అన్నారు.