
'ఉదయ్ చాలా పెద్ద తప్పు చేశాడని పిస్తోంది'
హైదరాబాద్: ఉదయ్ కిరణ్ చనిపోయాడంటే నమ్మడం చాల కష్టంగా ఉందని సంగీ దర్శకుడు, నటుడు, దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్పారు. పెళ్లి తర్వాత ఆయన జీవితం ఎలా ఉందనేది తనకు తెలియదన్నారు.
ఆయనకు చాలా మంది అభిమానులున్నారని తెలిపారు. అభిమానులు తనకు ఫోన్ చేసి ఉదయ్ కిరణ్ గురించి అడుగుతుంటారని చెప్పారు. ఆత్మహత్య చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాడని పిస్తోందని అభిప్రాయపడ్డారు. తనకున్న అభిమానులకు అన్యాయం చేశాడని ఆర్మీ పట్నాయక్ అన్నారు. ఒక్క క్షణం ఆలోంచివుంటే ఉదయ్ కిరణ్ బతికివుంచేవాడని నటుడు దువ్వాసి మోహన్ పేర్కొన్నారు.