బతకాలని లేదంటూ.... పలుమార్లు! | uday kiran in Suicidal tendency from past two weeks, says wife vishita | Sakshi
Sakshi News home page

బతకాలని లేదంటూ.... పలుమార్లు!

Published Mon, Jan 6 2014 9:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM

బతకాలని లేదంటూ.... పలుమార్లు!

బతకాలని లేదంటూ.... పలుమార్లు!

హైదరాబాద్ : తనకు బతకాలని లేదంటూ ఉదయ్ కిరణ్ తన భార్య విషితతో పలుమార్లు అన్నట్లు సమాచారం.  రెండు వారాల క్రితం నుంచి అతను  ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయ్ కిరణ్ మూడ్ మార్చేందుకు విషిత ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో విషిత ఈ విషయాన్ని వెల్లడించింది.

నూతన సంవత్సర వేడుకలను బెంగళూరులో జరుపుకున్నామని, జనవరి 2న హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు ఆమె తెలిపింది. సినిమాల్లో అవకాశాలు రాలేదని... ఉదయ్ కిరణ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు, దానితో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని విషిత పోలీసులు తెలియచేసింది.  ఉదయ్ కిరణ్ 2012లో అక్టోబర్ 24న  విషితను వివాహమాడాడు.

ఏది ఏమైనప్పటికి  టాలీవుడ్ చాక్లెట్ బాయ్ ఉదయ్ కిరణ్ ఇకలేడు. అందరినీ దుఃఖ సాగరంలో ముంచి కన్నుమూశాడు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని తన నివాసంలో  ఉరేసుకుని చనిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

అతను ఇప్పటివరకు మొత్తం 19 సినిమాల్లో నటించాడు. అందులో 16 తెలుగు, 3 తమిళ సినిమాలు  ఉన్నాయి. ఉదయ్‌ కిరణ్‌ చివరి చిత్రం జై శ్రీరాం.. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం ఉదయ్‌కిరణ్‌ దిల్‌ కబడ్డీ అనే తెలుగు, వంబు సదాయి అనే తమిళ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్‌ దశలోనే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement