Director Teja quits from the project of NTR Biopic - Sakshi
Sakshi News home page

అందుకే తప్పుకున్నా: తేజ

Published Thu, Apr 26 2018 1:52 AM | Last Updated on Thu, Apr 26 2018 10:48 AM

Nandamuri Balakrishna Starrer Biopic On NTR To Get A New Director As Filmmaker Teja Walks Out Of The Project - Sakshi

దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) బయోపిక్‌ ‘యన్‌.టి.ఆర్‌’ ప్రారంభోత్సవం మార్చి 29న హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో ఎన్‌.బి.కే ఫిలింస్‌ పతాకంపై విబ్రి మీడియా సమర్పణలో ఈ చిత్రం మొదలైంది. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. అయితే అనుకోకుండా బుధవారం ఈ చిత్రం నుంచి తేజ తప్పుకుంటున్నారనే వార్త వచ్చింది.

‘‘ఎన్టీఆర్‌ లాంటి మహా వ్యక్తి చరిత్రను తెరకెక్కించలేనేమో అనే భయంతోనే ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటున్నాను’’ అని దర్శకుడు తేజ చెప్పినట్లుగా సినిమా పి.ఆర్‌.వో తెలిపారు. తేజ బయటకు వచ్చారనే వార్త రావడంతో నెక్ట్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించే దర్శకుడు ఎవరు? అనే చర్చ మొదలైంది. సీనియర్‌ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు ఆ బాధ్యత నిర్వహించే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement