
ఆస్పత్రి నుంచి జయేంద్ర సరస్వతి డిశ్చార్జి
జయేంద్ర సరస్వతి ఆరోగ్యం కుదుట పడడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
మూడు రోజుల క్రితం శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. స్వామి ఆరోగ్య పరిస్థితి కుదుట పడడంతో ఆయన భక్తులు, అనుయాయులు సంతోషం వ్యక్తం చేశారు.