Jayendra Saraswati
-
కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం
-
శ్రీవారి సేవలో ప్రముఖులు..
-
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖ ప్రవచకుడు చాగంటి కోటేశ్వరరావు, తమిళనాడు రాష్ట్ర మంత్రి అన్చు అళగన్, సినీ నటులు అల్లరి నరేష్, సుమంత్ అశ్విన్‌లు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రముఖులకు ఆలయ అర్చకులు స్వామివారిని తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం పలికారు. వినాయకుడిని దర్శించుకున్న నరేష్ కాణిపాకం: వరసిద్ధి వినాయక స్వామిని నరేష్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కాగా, నరేష్‌తో సెల్ఫీలు దిగేందుకు ఆలయ సిబ్బంది పోటీ పడ్డారు. ఒక్కసారిగా 50మంది ఆయనకు అడ్డుపడ్డారు. ఆలయంలో సెల్ఫోన్ల నిషేధం భక్తులకేనా? ఆలయ సిబ్బందికి లేదా? అని భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
జయేంద్ర సరస్వతికి మళ్లీ అస్వస్థత
విజయవాడ : కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. విజయవాడలో బుధవారం ఉదయం నిర్వహించిన చాతుర్మాస దీక్ష సమయంలో ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ టి.రవీంద్రనాథ్ నేతృత్వంలో ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరి నిమోనియాగా మారిందన్నారు. ప్రస్తుతం జయేంద్ర సరస్వతి బాగానే ఉన్నారని, శ్వాస తీసుకోవడంలో మరింత ఇబ్బంది తలెత్తితే వెంటిలేటర్‌పై ఉంచాల్సివస్తుందని వైద్యులు తెలిపారు. జయేంద్ర సరస్వతి ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను చెన్నైలో ఉన్న ఆయన వ్యక్తిగత వైద్యులకు విజయవాడ వైద్యులు ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. కాగా స్వామీజీ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారని తెలియడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వారం రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురైన స్వామి మూడు రోజుల పాటు ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. -
ఆస్పత్రి నుంచి జయేంద్ర సరస్వతి డిశ్చార్జి
విజయవాడ: అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆరోగ్యం కుదుట పడింది. మూడు రోజుల క్రితం శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. స్వామి ఆరోగ్య పరిస్థితి కుదుట పడడంతో ఆయన భక్తులు, అనుయాయులు సంతోషం వ్యక్తం చేశారు. -
నిలకడగా కంచి పీఠాధిపతి ఆరోగ్యం
అస్వస్తతకు గురై ఆస్పత్రిలో చేరిన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వత్రి ఆరోగ్యం నిలకడగా ఉంది. జయేంద్ర సరస్వత్రిని ఐసీయూ నుంచి మెడికల్ వార్డకు తరలించినట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజు తెలిపారు. జయేంద్ర సరస్వతి షుగర్ లెవెల్స్ సాధారణ స్థితికి వచ్చాయన్నారు. గురువారం ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వివరించారు. -
జయేంద్ర సరస్వతికి అస్వస్థత.
-
జయేంద్ర సరస్వతికి అస్వస్థత
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి (82) అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి హైబీపీతో బాధపడుతూ, స్పృహలేని పరిస్థితిలో ఉండగా ఆయన భక్తులు, అనుయాయులు ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చారు. స్వామి ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారని, ఆయనకు బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నాయని స్వామికి చికిత్స అందిస్తున్న డాక్టర్ రవిరాజు తెలిపారు. సాయంత్రం వరకు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుందని వివరించారు. ఆస్పత్రికి తీసుకువచ్చిన వెంటనే స్వామిని వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స ప్రారంభించారు. ఆయనకు సీటీ స్కాన్ తీయగా అంతా సాధారణంగానే ఉందని, వచ్చినప్పటి కంటే ఇప్పటికి పరిస్థితి కొంచెం మెరుగుపడిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. స్వామి ఆరోగ్య పరిస్థితి తెలియగానే పెద్ద సంఖ్యలో భక్తులు ఆంధ్రా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు. గత సంవత్సరం జరిగిన గోదావరి పుష్కరాలకు కూడా జయేంద్ర సరస్వతి హాజరయ్యారు. రాజమహేంద్రవరంలో 2015 జూలై 14వ తేదీన పుణ్యస్నానం చేసి, ఉదయం 6.26గంటలకు గోదావరి పుష్కరాలను ప్రారంభించారు. రెండేళ్ల క్రితం కూడా ఒకసారి స్వామి అస్వస్థతకు గురయ్యారు. అప్పట్లో నెల్లూరు జిల్లాలో విగ్రహ ప్రతిష్ఠ కోసం వచ్చిన ఆయనకు షుగర్ లెవెల్స్ తగ్గడంతో అక్కడి జయభారత్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. -
కృష్ణా పుష్కరాలు పవిత్రమైనవని: జయేంద్ర సరస్వతి
విజయవాడ : వచ్చే నెలలో జరగనున్న కృష్ణా పుష్కరాలు చాలా పవిత్రమైనవని కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. ఆదివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. పుష్కర స్నానమాచరించి ప్రతి ఒక్కరూ పుణ్యం పొందాలన్నారు. పుష్కర సమయంలో 33 కోట్ల మంది దేవతలు స్నానమాచరిస్తారని తెలిపారు. -
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించా
- కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తిరుమల: దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించానని తమిళనాడులోని కంచికామ కోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయ అనంతరం ఆలయానికి వచ్చిన పీఠాధిపతికి ఆలయ అధికారులు ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో తొలుత ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా అర్చకులు జయేంద్ర సరస్వతిని వస్త్రంతో సత్కరించారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా పీఠాధిపతికి టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ప్రత్యేక మర్యాదలు చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం జయేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడుతూ మహిమాన్వితమైన శ్రీవేంకటేశ్వరుడుని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. వారి వెంట ఆలయ డెప్యూటీ ఈవో కోదండ రామారావు, బోర్డు సభ్యులు పసుపులేటి హరిప్రసాద్, కృష్ణమూర్తి ఉన్నారు. -
జయేంద్ర సరస్వతి ఉక్కిరిబిక్కిరి
చెన్నై: పదిహేనేళ్ల క్రితం చెన్నైలో జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిగా కంచిమఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సోమవారం చెన్నై సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. వంద ప్రశ్నలతో రెండు గంటలపాటు జడ్జి.. కంచి పీఠాధిపతిని ఉక్కిరిబిక్కిరి చేశారు. సోమశేఖర్ ఘనాపాటి పేరుతో జయేంద్రపై ఆరోపణలతో తమిళనాడు ప్రభుత్వానికి ఆకాశరామన్న ఉత్తరాలు అందాయి. ఈ నేపథ్యంలో 2002 సెప్టెంబర్ 20న చెన్నై మందవల్లిలో నివసించే ఆడిటర్ రాధాకృష్ణన్ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి మారణాయుధాలతో దాడిచేశారు. ఈ ఉత్తరాల వ్యవహారాన్ని రాధాకృష్ణనే నడిపించినట్లు భావించిన వారు దాడులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
జయేంద్ర సరస్వతికి అస్వస్థత
-
జయేంద్ర సరస్వతికి అస్వస్థత
నెల్లూరు, న్యూస్‌లైన్: కంచి కామకోటి పీఠాధిపతి, జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామి(79) అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం నెల్లూరు వచ్చిన ఆయన సాయంత్రం జొన్నవాడ కామాక్షితాయి ఆలయానికి వెళ్తూ దారి మధ్యలో వాహనంలోనే స్పృహకోల్పోయారు. ఆయనను నెల్లూరులోని జయభారత్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత దగ్గర్లోని డయాగ్నోస్టిక్స్ సెంటర్లో సీటీ, ఎంఆర్ఐ స్కాన్ పరీక్షలు నిర్వహించి మళ్లీ ఆస్పత్రికి తెచ్చి ఈసీజీ పరీక్ష చేశారు. స్వామీజీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళనపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. షుగర్ లెవల్స్ తగ్గడంతో సృహకోల్పోయారన్నారు. స్వామీజీకి చికిత్స కోసం చెన్నై నుంచి ప్రముఖ న్యూరాలజిస్ట్ కల్యాణ్‌రామన్ బయల్దేరారని తెలిపారు. నెల్లూరులోని శంకరమఠంలో కొత్తగా నిర్మించిన చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కోసం జయేంద్ర సర స్వతి వచ్చారు. ఆయన అస్వస్థత విషయాన్ని టీవీల ద్వారా తెలుసుకున్న భక్తులు ఆందోళనకు గురయ్యారు. పలువురు జయభారత్ ఆస్పత్రికి చేరుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడారు. -
జయేంద్ర సరస్వతి నిర్దోషి
సాక్షి, చెన్నై: తొమ్మిదేళ్ల కిందట సంచలనం సృష్టించిన శంకరరామన్ హత్య కేసు నుంచి కంచి మఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతికి ఎట్టకేలకు విముక్తి లభించింది. సరైన సాక్ష్యాలు లేని కారణంగా ఈ కేసులో వీరితోపాటు మిగతా 21 మంది నిందితులను పుదుచ్చేరిలోని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బుధవారమిక్కడి సెషన్స్ కోర్టు జడ్జి సీఎస్ మురుగన్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. కేసులో ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాలు చూపించనందున మొత్తం 23 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు జడ్జి తెలిపారు. చార్జిషీటులో పేర్కొన్న అభియోగాలను నిరూపించడంలో పోలీసులు విఫలమైనందున సంశయ లబ్ధి (బెనిఫిట్ ఆఫ్ డౌట్) కింద నిందితులను విడిచిపెడుతూ కేసును కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారు. 2004, సెప్టెంబర్ 3న కాంచీపురంలోని శ్రీవరదరాజపెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకరరామన్ గుడి ప్రాంగణంలోనే హత్యకు గురి కావడం పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య వెనుక కంచి పీఠాధిపతి ప్రమేయం ఉందన్న ఆరోపణలపై అదే ఏడాది దీపావళి రోజున మహబూబ్‌నగర్‌లో జయేంద్ర సరస్వతిని పోలీసులు అరెస్టు చేశారు. కేసులో మొత్తం 24 మంది నిందితులు ఉండగా వారిలో కదివరన్ అనే వ్యక్తి ఈ ఏడాది చెన్నైలో అనూహ్య పరిస్థితుల మధ్య హత్యకు గురయ్యారు. 2004 నుంచి అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో చివరికి ఎవ రూ దోషులుగా తేలకపోవడం గమనార్హం. కోర్టు తీర్పుపై శంకరరామన్ కుటుంబీకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పుపై అప్పీలు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు శంకరరామన్ తనయుడు ఆనంద్ శర్మ తెలిపారు. ఎవరూ దోషులు కాకుంటే తన తండ్రిని ఎవరు చంపినట్టు అని ఆయన ప్రశ్నించారు. జడ్జి తీర్పు వెలువరిస్తున్న సమయంలో కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. కంచి మఠం సిబ్బంది, భక్తులు, నిందితుల బంధుగణం, జాతీయ, రాష్ట్ర మీడియా ప్రతినిధులతో కోర్టు ప్రాంగణం కిటకిటలాడింది. జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతితోపాటు నిందితులంతా కోర్టు హాలులోనే ఉన్నారు. తీర్పు అనంతరం ఏమీ మాట్లాడకుండానేనే కంచి స్వాములు.. వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుపతికి కారులో బయల్దేరి వెళ్లారు. దర్యాప్తు సరిగ్గా సాగలేదు.. ఉదయం 10.50 గంటలకు జడ్జి మురుగన్ కేసు విచారణను ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలకు తీర్పు వెలువరించారు. శంకరరామన్ హత్య కేసులో దర్యాప్తు ఆసాంతం సరైన మార్గంలో సాగలేదని ఆయన స్పష్టంచేశారు. కేసు దర్యాప్తులో అప్పటి కాంచీపురం ఎస్పీ ప్రేమ్‌కుమార్ అత్యుత్సాహం ప్రదర్శించారని తప్పుపట్టారు. జయేంద్ర సరస్వతికి బెయిల్ మం జూరు చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు గుర్తుచేశారు. ప్రేమ్‌కుమార్ మితిమీరిన జోక్యం చేసుకోవడంతో దర్యాప్తు గతి తప్పిందని, కేసు దర్యాప్తు ప్రధాన అధికారి(సీఐవో) స్వతంత్రంగా వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు. హత్య అని నిరూపించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని, అంతేగాక శంకరరామన్ భార్య పద్మ, కుమారుడు ఆనంద్‌శర్మ ప్రాసిక్యూషన్‌ను బలపరిచే విధంగా వ్యవహరించలేదన్నారు. హత్య కేసులో ప్రధాన కుట్రదారులుగా అభియోగాన్ని ఎదుర్కొన్న అప్పు, కదిరవన్ (ఆ తర్వాత హత్యకు గురయ్యాడు)లు తాము ఆ సమయంలో సంఘటన ప్రదేశంలో లేమని నిరూపించుకున్నారని వివరించారు. ఫిర్యాది గణేశన్‌తోపాటు కుప్పుస్వామి, దురైకన్ను తదితర సాక్షులు సైతం ప్రాసిక్యూషన్ వాదనను బలపరిచేలా వ్యవహరించలేదని పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన వారిని గుర్తించడంలో శంకరరామన్ కుటుంబీకులు విఫలమయ్యారన్నారు. పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లు నిందితుల నేరాన్ని రుజువు చేయలేకపోయాయని చెప్పారు. దర్యాప్తు అధికారులు సాక్షులను బెదిరించి సంతకాలు తీసుకోవడం, కన్నయ్య అనే ఎస్సైని బెదిరించి విధులకు దూరంగా ఉంచడం వంటి తప్పిదాలకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. ఏ కోణంలో చూసినా నిందితులపై మోపిన అభియోగాలపై బలమైన సాక్ష్యాలు లేవని తెలిపారు. అందువల్ల వారిని నిర్దోషులుగా భావిస్తున్నట్లు చెప్పారు. కేసు నేపథ్యం ఇదీ.. కంచి మంఠంలో నిధుల దుర్వినియోగం జరుగుతోందని పేర్కొంటూ ఆ మఠం ఆధీనంలో ఉన్న శ్రీవరదరాజపెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకరరామన్ ప్రభుత్వానికి ఉత్తరాలపై ఉత్తరాలు రాశారు. ఈ నేపథ్యంలో 2004లో ఆయన ఆలయ ఆలయ ప్రాంగణంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు కంచి మఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి సహా పలువురిని నిందితులుగా చేర్చి అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి ముందు జయేంద్ర సరస్వతి 61 రోజులపాటు జైలు జీవితం గడిపారు. పోలీసులు మొత్తం 1873 పేజీల చార్జిషీటును దాఖలు చేసి 712 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు. 370 మందిని సాక్షులుగా చేర్చారు. వీరిలో 187 మందిని కోర్టు విచారించింది. ఎప్పుడేం జరిగింది? 2004, సెప్టెంబర్ 3: కాంచీపురంలోని శ్రీవరదరాజపెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకరరామన్ హత్య 2004, నవంబర్ 11: దీపావళి రోజున మహబూబ్‌నగర్‌లో జయేంద్ర సరస్వతి అరెస్టు నవంబర్ 12: జయేంద్ర సరస్వతికి జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు 2005, జనవరి 10: జయేంద్ర సరస్వతికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. విజయేంద్ర సరస్వతి అరెస్టు జనవరి 21: నిందితులపై చార్జిషీటు దాఖలు చేసిన తమిళనాడు సిట్ పోలీసులు ఫిబ్రవరి 10: విజయేంద్ర సరస్వతికి బెయిల్ మంజూరు చేసిన మద్రాస్ హైకోర్టు మార్చి 6: కేసు విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలంటూ జయేంద్ర సరస్వతి పిటిషన్.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు అక్టోబర్ 26: శంకరరామన్ హత్య కేసుపై విచారణను పుదుచ్చేరిలోని కోర్టుకు బదిలీ చేసిన సుప్రీం 2006, మార్చి 28: 24 మంది నిందితులపై అభియోగాలు నమోదు 2009, ఏప్రిల్ 2: పుదుచ్చేరిలోని ప్రధాన సెషన్స్ కోర్టులో విచారణ మొదలు 2010, జనవరి 21: కోర్టులో రవి సుబ్రహ్మణ్యం ఎదురు సాక్ష్యం 2013, మార్చి 21: కేసులో నిందితుడు కదిరవన్ చెన్నైలో హత్య. 23కు చేరిన నిందితుల సంఖ్య నవంబర్ 12: నవంబర్ 27న తీర్పు వెలువరించనున్నట్లు పుదుచ్చేరి లోని కోర్టు వెల్లడి నవంబర్ 27: జయేంద్ర సరస్వతితోపాటు నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చిన కోర్టు -
శంకర్రామన్ హత్య కేసులో నేడు తుది తీర్పు
-
శంకర్రామన్ హత్య కేసులో నేడు తుది తీర్పు
కాంచీపురంలోని వరదారాజ పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్రామన్ హత్య కేసుకు సంబంధించిన పుదుచ్చేరి జిల్లా కోర్టు బుధవారం ఉదయం 11.00 గంటలకు తన తీర్పును వెలువరించనుంది. శంకర్రామన్ హత్య కేసులో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి సహా 23 మంది ఆ కేసులో నిందితులుగా ఉన్నారు. వారంతా ఇప్పటికికే పుదుచ్చెరి చేరుకున్నారు. శంకర్రామన్ హత్య కేసులో కోర్టు తీర్పు నేడు వెలువడనున్న నేపథ్యంలో దేశ ప్రజలంతా ఆసక్తితో ఎదురు చేస్తున్నారు. 2004లో సెప్టెంబర్3న కాంచీపురంలోని వరదాజ పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్రామన్ ఆలయ ప్రాంగణంలో అత్యంత దారుణంగా హత్య కావించబడ్డారు. దాంతో ఆ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ హత్యలో కంచి పీఠాధిపతులు పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కంచి పీఠాధిపతులు జయేంద్ర, విజయేంద్ర సరస్వతులతోపాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద నిందితులుగా కేసులు నమోదుయ్యాయి. కంచీపురం జిల్లాలోని చెంగల్పట్లు కోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది. అయితే శంకరామన్ హత్య కేసు స్వేచ్ఛగా, నిష్పక్షపాతమైన విచారణ తమిళనాడులో సాధ్యం కాదని జయేంద్ర సరస్వతి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో శంకర్రామన్ హత్య కేసును సుప్రీంకోర్టు పుదుచ్చేరి జిల్లా సెషన్స్ కోర్టుకు బదిలి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి పుదువై కోర్టు 9 సంవత్సరాల పాటు 189 మంది సాక్షులను విచారించారు. విచారణ పూర్తి కావటంలో ఈ హత్య కేసుకు సంబంధించిన తీర్పును పుదుచ్చేరి జిల్లా కోర్టు జడ్జి బుధవారం వెలువరించనున్నారు.