
దిలీప్‌కుమార్
శ్వాస సంబంధిత సమస్యలతో బాలీవుడ్ ప్రముఖ నటులు దిలీప్‌కుమార్ ఇటీవల ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దిలీప్‌కుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. బుధవారం ఆయనకు ‘ప్లూరల్ యాస్పిరేషన్’ (ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించడం) ప్రొసిజర్ జరిగింది. దిలీప్ కుమార్ బాగున్నారని ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ ఫైజల్ ఫరూకి తెలిపారు. ‘‘వైద్యులు నితిన్ గోఖలే, జలీల్ పార్‌కర్‌తో నేను మాట్లాడాను. దిలీప్‌గారి ఆరోగ్యం నిలకడగా ఉందని వారు పేర్కొన్నారు. దిలీప్‌ని ఇవాళ (గురువారం) డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది’’ అని ఫైజల్ పేర్కొన్నారు. ఆయన చెప్పిన ఈ విషయం దిలీప్ కుమార్ అధికారిక ట్విటర్ ఖాతాలో కూడా పోస్ట్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment